Naga Chaitanya : ‘‘నేను సమంతతో విడాకులు తీసుకుని దాదాపు ఏడాదిన్నర అవుతున్నా.. ఇంకా అదే న్యూస్ ను పలు న్యూస్ ఛానెళ్లు పలు రకాలుగా చూపిస్తున్నారు. నా గురించి ఎలాంటి రూమర్స్ క్రియేట్ చేసినా అంత పట్టించుకోను గానీ.. నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తే చాలా హర్ట్ అవుతా’’ అని అక్కినేని నాగచైతన్య పేర్కొన్నారు. చైతూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన విడాకులు గురించి మీడియా చేస్తున్న రాద్దాంతంపై స్పందించారు. సమంతతో విడాకుల విషయంలో తన ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం తనకు చాలా బాధ కలిగించిందని చైతూ తెలిపారు. అందులో వాళ్ల తప్పేమీ లేదని, ఇంకా ఆ ఇష్యూను సాగదీయడం తప్పని నాగచైతన్య చెప్పారు.


ఇప్పటికైనా తానిచ్చిన క్లారిటీతో ఆ టాపిక్ ను క్లోజ్ చేస్తారనుకుంటున్నానని నాగచైతన్య తెలిపారు. సామ్, తాను డిసైడ్ చేసుకున్న తర్వాత విడాకుల నిర్ణయం తీసుకున్నామని, అదే విషయాన్ని ఇద్దరం చెప్పామన్నారు. కానీ అది జరిగిపోయి ఇంతకాలమైనా.. ఆ టాపిక్ ను వదలేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఇప్పుడు ఈ విషయంపై మాట్లాడడానికి ముఖ్య కారణమేమిటంటే.. థర్డ్ పార్టీని తీసుకువచ్చి, వాళ్ల తప్పు లేకుండానే, వాళ్ల పేరును పాడు చేస్తున్నారని చెప్పారు. ప్రారంభంలో ఈ విషయాన్ని చాలా పట్టించుకునే వాణ్ణి అని, అప్పట్లో వీటన్నింటినీ చూస్తే చాలా కష్టంగా అనిపించేదని నాగ చైతన్య చెప్పారు. అసలు ఈ టాపిక్ ను ఎందుకింత స్ప్రెడ్ చేస్తున్నారు.. టీఆర్పీ కోసం, హెడ్ లైన్స్ కోసమే చేస్తున్నారా.. ఇంత డర్టీ అయిపోయిందా ఈ బిజినెస్ అని అనుకునేవాడినన్నారు. కానీ ఇప్పుడు మాత్రం అలవాటైపోయిందని తెలిపారు. 


ప్రస్తుతం తన దృష్టంతా 'కస్టడీ' సినిమాపై ఉందని నాగచైతన్య చెప్పారు. ఆ సినిమా హిట్ కొట్టాలి, ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేయాలన్నదే ఉందన్నారు. తాను ఈ ఇండస్ట్రీలోకి వచ్చింది ఫ్రొఫెషనల్ లైఫ్ తో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికే గానీ, పర్సనల్ లైఫ్ తో కాదని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక సినిమాలో తనకు జంటగా నటించిన హీరోయిన్ కృతి శెట్టికి సంబంధించిన ఇంట్రస్టింగ్ విషయాలను కూడా నాగ చైతన్య పంచుకున్నారు. ఆమెతో ఇది రెండో సినిమా అని, ఈ మూవీలో ఆమె క్యారెక్టర్ ను చాలా బాగా డిజైన్ చేశారని చెప్పారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు 80, 90లలోకి వెళ్లిపోతారని చెప్పారు. ఖచ్చితంగా ఆ రోజుల్లోకి వెళతారని, అది అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన 'కస్టడీ' టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమా మే 12న థియేటర్లలో రిలీజ్ కానుంది.


ఇదిలా ఉండగా ఇటీవలే సమంతతో విడాకులపై స్పందించిన నాగచైతన్య.. ఆమెపై ప్రశంసలు గుప్పించారు. సమంతా చాలా హర్డ్ వర్కర్ అని, ఏమైనా అనుకుంటే చేసి తీరుతుందని చైతూ వెల్లడించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విడిపోయినా సమంతపై పాజిటివ్ కామెంట్స్ చేయడంతో నాగచైతన్యను ఆయన ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.


Also Read: సమంత హార్డ్ వర్కర్ - ఫోన్ పగలగొట్టాలనిపిస్తాది: నాగ చైతన్య