రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఇంట్లో కంటే విమానాల్లో ఎక్కువ సేపు ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరి దృష్టి 'బ్రహ్మస్త్ర' (Brahmastra Movie) మీద మాత్రమే ఉంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోందీ సినిమా. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, హిందీ సినిమా అడ్డా ముంబైతో పాటు పలు నగరాల్లో పర్యటించిన బాలీవుడ్ కొత్త జంట ప్రమోషన్స్ చేసింది.
ప్రస్తుతం ఆలియా గర్భవతి. అయినా సరే విశ్రాంతి తీసుకోకుండా సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకు వెళ్లడం కోసం కష్టపడుతున్నారు. మెజారిటీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. సోషల్ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుంచి కొంత వ్యతిరేకత ఉంది. బాయ్ కాట్ ట్రెండ్ గురించి ఆల్రెడీ తెలిసిందే. అయితే... ఇప్పుడు ఆ వ్యతిరేకత సోషల్ మీడియా నుంచి గుడి వరకు వచ్చింది.
Protest Against Brahmastra Team At Ujjaini Mahankali Temple : రణ్‌బీర్, ఆలియాతో పాటు 'బ్రహ్మాస్త్ర' దర్శకుడు అయాన్ ముఖర్జీ మంగళవారం ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లారు. అక్కడ వాళ్ళకు నిరసనకారులు స్వాగతం పలికారు. నల్ల బ్యాడ్జీలు ధరించిన కొందరు సినిమాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'బ్రహ్మాస్త్ర'ను విడుదల చేయకూడదని డిమాండ్ చేశారు. మరి, 'బ్రహ్మాస్త్ర' టీమ్ దర్శనం చేసుకున్నారో? లేదో? తెలియలేదు. ఉజ్జయినిలో స్థానిక పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారని తెలిసింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత హిందీ సినిమా పరిశ్రమలో వారసులుగా అడుగు పెట్టిన కొంత మంది తారలపై ప్రేక్షకుల్లో వ్యతిరేక భావం ఉంది. వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు బాయ్ కాట్ చేయమంటూ పిలుపు ఇస్తున్నారు. ఇప్పుడు అది కాస్తా సోషల్ మీడియా నుంచి పబ్లిక్‌లోకి రావడం శుభ పరిణామం కాదు. దీనిపై బాలీవుడ్ స్టార్స్‌లో ఆందోళన నెలకొంటుందని ఊహించవచ్చు.
Brahmastra Review : సినిమా మీద మంచి హైప్ నెలకొంది. అయితే.... దుబాయ్ నుంచి ఉమైర్ సంధు పాజిటివ్ రివ్యూ ఇవ్వలేదు. 'బ్రహ్మాస్త్ర'కు కేవలం 2.5 రేటింగ్ మాత్రమే ఇచ్చారు. వీఎఫ్ఎక్స్ హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయని, కొన్ని సీక్వెన్సులు బావున్నాయని ఆయన పేర్కొన్నారు.
Brahmastra Release : సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా సుమారు ఎనిమిది వేల స్క్రీన్‌లలో 'బ్రహ్మాస్త్ర' విడుదల అవుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ పాజిటివ్‌గా ఉన్నాయి. సినిమాకు ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా భారీ వసూళ్లు వస్తాయి.
Also Read : రాజ మందిరంలోకి వంచన, ద్రోహం - మణిరత్నం తీసిన విజువల్ వండర్, 'పొన్నియన్ సెల్వన్' ట్రైలర్
'బ్రహ్మాస్త్ర' చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), మౌనీ రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగులో 'బ్రహ్మాస్త్రం' పేరుతో విడుదల చేస్తున్నారు. సుమారు 400 కోట్ల రూపాయలతో సినిమా రూపొందించినట్లు హిందీ ఇండస్ట్రీ టాక్. హిట్ టాక్ వస్తే అంత రావడం పెద్ద కష్టం ఏమీ కాదు. కానీ, ఫ్లాప్ అయితే పరిస్థితి ఏంటి? అనేది హిందీ ఇండస్ట్రీని వెంటాడుతున్న ప్రశ్న. ఈ సినిమా ఫ్లాప్ అయితే మిగతా రెండు భాగాలు చేస్తారా? లేదా? అన్నది చూడాలి.
Also Read : ఫారిన్‌లో, షూటింగ్ లొకేషన్‌లో అబ్బాయ్ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన బాలకృష్ణ