Chikiri Chikiri Song: రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న పాన్-ఇండియా మూవీ పెద్ది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి దర్శకుడు బుచ్చిబాబు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. మోహిత్ చౌహాన్ పాడిన ఈ పాట నవంబర్ 7 న రిలీజైంది. విడుదలైన 24 గంటల్లోనే రికార్డ్ స్థాయిలో వ్యూస్ సొంతె చేసుకుంది. రెహ్మాన్ స్వరాలు, మోహిత్ వాయిస్, రామ్ చరణ్ స్టెప్స్, జాన్వి అందం...అభిమానులకు పెద్ద ట్రీట్ ఇచ్చినట్టైంది. ఈ సాంగ్ మొత్తం లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మూమెంట్ ను విలేజ్ స్టైల్లో ప్రెజంట్ చేశారు.
చికిరి చికిరి సాంగ్ విడుదలైన అన్ని భాషల్లోనూ కలిపి 16 రోజుల్లో వంద మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది.గతంలో ఇలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిన సాంగ్స్ పై ఫోకస్ పెడుతున్నారు. పాటలో లిరిక్స్, బీట్ సరిగ్గా కుదిరితే చాలు..అర్థం అయినా కాకున్నా ప్రేక్షకులకు ఎక్కేస్తుందనేందుకు ఇదే నిదర్శనం అంటున్నారు క్రిటిక్స్. వాస్తవానికి మోహిత్ చౌహాన్ పాడిన ఈ పాటలో లిరిక్స్ ఏవీ సరిగా అర్థం కాలేదు.. తెలుగు పదాలను సరిగా పలకలేదని..అర్థపర్థంలేకుండా ముక్కలు చేసి పడేసి పాడారనే విమర్శలొచ్చాయ్. కానీ సాంగ్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ముందు అవన్నీ పక్కకుపోయాయ్.
ఏ ముహూర్తాన చికిరి సాంగ్ రిలీజ్ చేశారో కానీ...ఎక్కడ చూసినా చికిరి చికిరి జోరు కొనసాగుతూనే ఉంది. ఇండియాలోనే కాదు... జపాన్, చైనా, నైజీరియా అన్ని దేశాల్లోనూ సోషల్ మీడియాలో మోత మోగిస్తోంది. రీల్స్, వీడియోస్ అదరిపోతున్నాయ్. అమ్మాయిలు, అబ్బాయిలు అంతా చరణ్ హుక్ స్టెప్ ని పోటాపోటీగా వేస్తున్నారు. ఈ సాంగ్ లో జాన్వి అందం కన్నా చెర్రీ డాన్స్ కి ఫిదా అయ్యారు ప్రేక్షకులు.ఈ పాట ఏకంగా 100 మిలియన్ ప్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ రీల్స్ అన్నీ ఓ లెక్క..బ్రహ్మానందం డాన్స్ మరో లెక్క అన్నట్టుంది.
బ్రహ్మీ లేకుండా మీమ్స్ ఉండవేమో అనేంతలా ఉంటుంది వాడకం. వెండితెరపైనా అదే క్రేజ్.. సోషల్ మీడియాలోనూ అదే జోరు.. ఎక్కడున్నా బ్రహ్మీ స్టైలే వేరు. బ్రహ్మానందం కూడా ఈ మీమ్స్ చూసి ఆనందిస్తారు. ఆయన సినిమాల్లోని హాస్యభరితమైన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ , డైలాగ్స్ ను ఉపయోగించి మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. బ్రహ్మీ బర్త్ డే సందర్భంగా కూడా గాడ్ ఆఫ్ మీమ్స్ కి హ్యాపీ బర్త్ డే అని ఆనందంగా విశెష్ చెబుతుంటారు నెటిజన్లు. ఇక... ఇప్పుడు చికిరి సాంగ్ కి కూడా అప్పటి సినిమాల్లో బ్రహ్మీ స్టెప్స్ ని జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిజంగా అదిరిపోయింది డాన్స్... ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ కూడా సరిగ్గా మ్యాచ్ అయ్యాయ్ అంటున్నారు నెటిజన్లు. చరణ్ - బ్రహ్మీ ఎవరికి ఎన్ని మార్కులేస్తారని మరికొందరు ఓటింగ్ పెట్టారు... ఇంకొందరైతే ఒరిజనల్ వీడియో కన్నా ఇదే అదిరింది అంటున్నారు...ఆ ఫన్నీ వీడియో మీరూ చూసేయండి.
2026 సమ్మర్ కానుకగా మార్చి లాస్ట్ వీక్ లో రిలీజ్ కానున్న పెద్ద మూవీకి సంబంధించి మరిన్ని అప్టేడ్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.