BrahmaAnandam Movie Announcement: సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు చాలా మంది వారసులు వచ్చారు. కొంత మంది తక్కువ సమయంలోనే మంచి సక్సెస్ అందుకుంటే, మరికొంత మంది ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. టాలెంట్ ఉన్న అదృష్టం కలిసిరాని వాళ్లు చాలా మంది ఉంది. అలాంటి వారిలో ఒకడు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్. 2004లో ‘పల్లకిలో పెళ్లి కూతురు’ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘బసంతి’, ‘చారుశీల’, ‘మను’ లాంటి సినిమాలు చేశాడు. ఈ మూవీస్ ఏవీ ఆయనకు అనుకున్న స్థాయిలో సక్సెస్ అందివ్వలేదు. అడపాదడపా సినిమాలు చేసుకుంటూ వస్తున్న గౌతమ్.. సాలిడ్ హిట్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం మరోసారి గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు.
పుష్కరకాలం తర్వాత సినిమా చేస్తున్న బ్రహ్మీ కొడుకు
సుమారు పుష్కరకాలం తర్వాత రాజా గౌతమ్ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి ‘బ్రహ్మానందం’ అనే పేరు పెట్టారు. నిజ జీవితంలో తండ్రి కొడుకులు అయిన బ్రహ్మానందం, గౌతమ్ ఈ సినిమాలో తాత మనువళ్లుగా నటించబోతున్నారు. యంగ్ డైరెక్టర్ RVS నిఖిల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. సావిత్రి, శ్రీ ఉమేష్ యాదవ్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. గ్రామీణ, పట్టణ సంస్కృతుల సమ్మేళనంతో అలరిస్తోంది.
ఫన్నీగా ఆకట్టుకుంటున్న అనౌన్స్ మెంట్ వీడియో
ఇక ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియో సినీ అభిమానులు కడుపుబ్బా నవ్విస్తోంది. ఇందులో గౌతమ్ నెక్ట్స్ మూవీ గురించి బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ మధ్య జరిగిన సంభాషణను నవ్వుతెప్పిస్తుంది. అప్పుడెప్పుడో సినిమా చేసిన గౌతమ్ ఇప్పటి వరకు మళ్లీ సినిమా చేయడం లేదని బ్రహ్మానందం, వెన్నెల కిశోర్ కు చెప్తాడు. ఏ కథ వినిపించినా, ఏదో ఒక వంక పెడుతున్నాడని బాధపడతాడు. అయితే, గౌతమ్ సినిమా చేసేందుకు ఓకే చెప్పడని కిశోర్, బ్రహ్మీకి చెప్తాడు. ఈ విషయంలో తెలిసి ఫుల్ ఖుషీ అవుతాడు. అయితే, ఈ సినిమాలో ఓ తాత క్యారెక్టర్ ఉందని, డైలాగులు కూడా ఉన్నాయని దాని కోసం... అనగానే, బ్రహ్మీ ఎవరికి ఫోన్ చేయాలో చెప్పండి, చేసి ఒప్పిస్తాను అంటాడు. మీరే చేయాలి అని చెప్పడంతో ఆయన షాక్ అవుతాడు. చివరకు గౌతమ్, కిశోర్, బ్రహ్మీతో తాత క్యారెక్టర్ చేయించేందుకు ఒప్పిస్తారు. మొత్తంగా తండ్రీకొడుకులు ఈ సినిమాలో తాత మనువళ్లుగా కనిపించనున్నారు.
డిసెంబర్ 6న ‘బ్రహ్మానందం’ విడుదల
త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు శాండిల్య పిసపాటి సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను మితేష్ పర్వతనేని నిర్వహిస్తున్నారు. ప్రసన్న ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
Also Read: అది నాకు కష్టమైన నిర్ణయం, కానీ వదులుకోక తప్పదని అర్థమయ్యింది - రాజమౌళి