బాలీవుడ్లో నటీనటుల్లో విడాకులు పెరిగిపోతున్నాయి. అమీర్ ఖాన్, కిరణ్ రావ్ బాటలోనే అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కూడా నడవబోతున్నట్టు సమాచారం. ఇమ్రాన్ ఖాన్ ప్రేమించి పెళ్లాడిన భార్యకు విడాకులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడని బాలీవుడ్ మీడియా చెబుతోంది. అతను అవంతిక అనే అమ్మాయిని దాదాపు ఎనిమిదేళ్ల పాటూ ప్రేమించి వివాహం చేసుకున్నాడు. పెళ్లికి ముందే వీరిద్దరూ సహజీవనం సాగించారు. వీరిద్దరి పెళ్లి 2011లో జరిగింది. ఏడేళ్ల పాప కూడా ఉంది. తమ 19 ఏళ్ల బంధానికి ఇమ్రాన్ ఖాన్ స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నాడట. గత కొన్ని నెలలుగా భార్యకు దూరంగా నివసిస్తున్నాడు.  ఇప్పటికీ మనసు మారలేదని, విడాకులు ఇచ్చేందుకే సిద్ధంగా ఉన్నాడని సమాచారం. ఎంతకీ అతని మనసు మారకపోవడంతో అవంతిక కూడా విడాకులు సిద్దమైందట. 


2019 వరకు వారి వివాహ జీవితం బాగానే ఉంది. ఆ ఏడాదే వారి మధ్య దూరం పెరిగి ఇద్దరూ చెరో ఇంట్లో ఉండడం మొదలుపెట్టారు. అప్పట్నించి కుటుంబ సభ్యులు, స్నేహితులు వారిద్దరినీ కలిపేందుకు చాలా ప్రయత్నాలు చేశారట. చివరికి అవంతిక కూడా స్వయానా భర్తతో ఉండే సమస్యలు సర్దుబాటు చేసుకునేందుకు ప్రయత్నించింది. కానీ ఇమ్రాన్ మాత్రం ఒక్క మెట్టు కూడా దిగడం లేదు. అవంతికతో ఇక కలిసి జీవనం సాగించేది లేదని తేల్చి చెప్పాడట. 


ఆమె కారణమా?
ఇమ్రాన్ ఖాన్ దక్షిణా హీరోయిన్ లేఖా వాషింగ్జన్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని, ఆమె వల్లే అవంతికకు విడాకులు కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యాడని బాలీవుడ్ హంగామా వెబ్ సైట్ చెబుతోంది. లేఖాకు కూడా పెళ్లైంది. ఆమె భర్త పాబ్లో ఛటర్జీకి ఇమ్రాన్ మంచి ఫ్రెండు. 


అమీర్ ఖాన్ సహకారంతో సినిమాల్లో అడుగుపెట్టాడు ఇమ్రాన్ ఖాన్. 2008లో జానే తు యా జానే నా సినిమాలో తొలిసారి నటించారు. మొదటి సినిమాలోనే నటనతో మెప్పించాడు. వరుస పెట్టి సినిమాలు చేశాడు. ఢిల్లీ బెల్లీ, ఐ హేట్ లవ్ స్టోరీస్, కిడ్నాప్ వంటి సినిమాల్లో నటించాడు. 2015 తరువాత ఏమైందో తెలియదు కానీ సినిమాలు చేయడం ఆపేశాడు.