బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ బిపాసా బసు శుభవార్త చెప్పింది. తాను తల్లి కాబోతున్నానంటూ బేబీ బంప్ తో ఉన్న ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి బోల్డ్ గా ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. బిపాసా బేబీ బంప్ కి తన భర్త ముద్దులు పెడుతూ కరణ్ సంతోషాన్ని వ్యక్తపరిచాడు.
'కొత్త టైం, కొత్త జీవితం, కొత్త కాంతి మా జీవితాన్ని మరింత సంతోషం చేసేందుకు రాబోతుంది. వ్యక్తిగతంగా జీవిస్తున్న మేము ఇద్దరం అయ్యాం. అప్పటి నుంచి ఇద్దరం ఎంతో ప్రేమగా ఉన్నాం. ఇప్పుడు మా జీవితాల్లోకి మూడో వ్యక్తి రాబోతున్నారు. మా ప్రేమకి గుర్తుగా మాకోక బిడ్డ పుట్టి మా ఆనందాన్ని మరింత పెంచనుంది. మీ అందరికీ ధన్యవాదాలు. మీ అవధుల్లేని ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. మా జీవితాల్లోకి భాగస్వామిగా వస్తూ అందమైన ఆనందాన్ని ఇస్తున్నందుకు నా బిడ్డకి ధన్యవాదాలు” అంటూ బిపాసా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు.
గతంలో బిపాసా ప్రెగ్నెంట్ అనే రూమర్లు వచ్చాయి. వాటిని ఇప్పుడు నిజం చేస్తూ తన బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను రివీల్ చేస్తూ గుడ్ న్యూస్ చెప్పేసింది. బాలీవుడ్ బ్యూటీ బిపాసా తెలుగులోనూ నటించింది. మహేష్ బాబు నటించిన ‘టక్కరి దొంగ’ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకి సుపరిచితురాలైంది. ఇక బాలీవుడ్ లో ధూమ్ 2, రాజ్, రేస్ 2 వంటి పాపులర్ సినిమాల్లో నటించింది. 2016లో తన కంటే చిన్న వాడైన కరణ్ సింగ్ ని పెళ్లాడింది. అప్పటి నుంచి సినిమాలో తక్కువగా కనిపించిన సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంది. తన హాట్ హాట్ అందాల విందు చేస్తూ ఫోటోలని షేర్ చేస్తూ అభిమానులని అలరిస్తోంది.
తాజాగా బేబీ బంప్ ఫోటోలు కూడా బోల్డ్ గా చేసింది. వైట్ కలర్ షర్ట్ ధరించి ఒక బటన్ మాత్రమే పెట్టుకుని.. బేబీ బంప్ కనిపించేలా భర్తతో కలిసి రొమాంటిక్ గా ఫోజులిచ్చింది. ఈ ఫోటో ఘాట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గుడ్ న్యూస్ చెప్పినందుకు ఫ్యాన్స్, సెలబ్రిటీలు బిపాసా దంపతులకి శుభాకాంక్షలు చెప్తున్నారు. మలైకా అరోరా, సోఫి చౌదరి బిప్స్ కి కంగ్రాట్స్ చెప్పారు.
Also Read: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ
Also Read: అయ్యో రాధిక, నువ్వు లేని ‘డీజే టిల్లు’నా? సీక్వెల్‌లో ఆమె కనిపించదా?