రీల్ లైఫ్ లో విలన్ పాత్రలు పోషించిన సోనూసూద్ రియల్ లైఫ్ లో మాత్రం హీరోగా కొనసాగుతున్నారు. కరోనా సమయంలో ఎంతో మంది అభాగ్యులకు ఆపన్న హస్తం అందించారు. వలస కార్మికులను సొంతూళ్లకు చేర్చేందుకు వాహనాలు ఏర్పాటు చేయడంతో పాటు ఎన్నో హాస్పిటల్స్ కు ఆక్సిజన్ అందించారు. పలు చోట్ల ఉచితంగా ఆక్సీజన్ ఫ్లాంట్స్ ఏర్పాటు చేశారు. కరోనా సోకి వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి చక్కటి వైద్యం ఉచితంగా అందించారు.   కరోనా తర్వాత కూడా ఆయన సేవలు కొనసాగాయి. ఆపదలో ఉన్నామంటూ తన దగ్గరికి వచ్చిన ఎంతో మందిని ఆదుకున్నారు. ఆయన సాయంతో ఎంతో మంది చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. ఆయన సేవా గుణానికి యావత్ దేశం సలాం చేసింది.


ఫ్యామిలీకి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు 


సినిమాలు, సాయం కోసం వచ్చిన వారిని ఆదుకోవడంలో బిజీగా ఉండే సోనూసూద్, కుటుంబానికి కూడా తగినంత సమయం కేటాయిస్తారు. వారికితో ఎక్కువ సమయాన్ని గడిపేందుకు ఇష్టపడుతారు. ఆయనకు కార్లంటే ఎంతో ఇష్టం. ఇప్పటికే ఆయన గ్యాలరీలో పలు కార్లు ఉన్నాయి. వాటిలో చాలా వరకు లగ్జరీవే ఉన్నాయి. తాజాగా ఆ కార్లతో మరో కాస్ట్లీ కారు చేరింది.  


బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్‌ కారును కొనుగోలు చేసిన సోనూసూద్


లగ్జరీ కార్లకు ప్రసిద్ధి పొందిన లేటెస్ట్ బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్‌ కారును కొనుగోలు చేశారు. దేశంలో ప్రస్తుతం ఉన్న అత్యంత విలాసవంతమైన కార్లలో ఈ కారు కూడా ఒకటి. దీని ఖరీదు దాదాపు 1.73 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన ఈ కారు ముందు నిలబడి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నెటిజన్లు ఆయన కారును చూసి ఫిదా అవుతున్నారు. రియల్ హీరోకు శుభాకాంక్షలు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటికే సోనూసూద్ గ్యారేజీలో చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. పోష్‌ పనమేరా, మెర్సిడిస్‌ బెంజ్, ఆడి క్యూ 7 కార్లతో పాటు పలు కార్లు కొలువుదీరాయి. తాజాగా వీటితో  బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్‌ కారు జాయిన్ అయ్యింది.






Read Also: 2022 మోస్ట్ పాపులర్ స్టార్స్‌లో దక్షిణాది తారల హవా, టాప్ 10లో ఆరుగురు మనోళ్లే!