మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్ ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. #MEGA154 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే మరికొంతమంది స్టార్స్ ను తీసుకున్నారు.
మాస్ మహారాజా రవితేజను మెగాస్టార్ తమ్ముడి పాత్ర కోసం తీసుకున్నారు. ఆయనకు భారీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. కారణాలు బయటకు రానప్పటికీ.. రవితేజ కోసం అనుకున్న పాత్రలో మరో నటుడిని తీసుకోబోతున్నారు దర్శకుడు బాబీ. ఇప్పటికే ఒకరిద్దరు హీరోలను సంప్రదించినట్లు తెలుస్తోంది.
త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. మరోపక్క ఈ సినిమాలో మలయాళ నటుడు బిజూ మీనన్ ను విలన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. ఇక ఈ సినిమాకి 'వాల్తేర్ వీరయ్య' అనే టైటిల్ దాదాపు ఫైనల్ చేసినట్లే. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు చిరు లిస్ట్ లో 'భోళాశంకర్', వెంకీ కుడుముల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆయన నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా దసరా సీజన్ లో రిలీజ్ కానుంది.
Also Read: 'జబర్దస్త్' వదిలేసిన అనసూయ - ఆ స్టార్ డైరెక్టరే కారణమా?
Also Read: బాలయ్య సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ - యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా!