Bigg Boss 6 Telugu: ఈ రోజు విడుదల చేసిన మొదటి ప్రోమోతో పోలిస్తే రెండో ప్రోమో చాలా బెటర్ అనిపించింది. ఇందులో గీతూ పై సెటైర్లు పేల్చాడు రేవంత్. ప్రోమో మొదలవ్వగానే పాటకు డ్యాన్స్ వేస్తూ కనిపించారు ఇంటి సభ్యులు. మధ్యలో నాగార్జున ‘ఏంటి రేవంత్ ఏదో ఎంటర్టైన్ చేస్తున్నావ్ అందరిని’ అని అడిగారు. దానికి  రేవంత్ గీతూ పుష్ఫ స్టైల్లో ఎలా నడుస్తుందో నడిచి చూపించాడు. అది చూసి అందరూ నవ్వారు. దానికి గీతూ ‘నేను చాలా స్టైల్ గా నడుస్తా. వీళ్లు ఏదోలా నడుస్తున్నారు’ అంది. దానికి నాగార్జున ‘గీతూ నడిస్తే చాలా స్టైల్ గా ఉంటుంది’ అని అన్నారు. దానికి రేవంత్ ‘ఇలాగా సర్’ అని మళ్లీ నడిచి చూపించారు. దానికి అందరూ నవ్వారు. 

వామ్మో వద్దే వద్దుప్రతి ఇంట్లో గీతూలాంటి పిల్ల ఉంటే బావుండనిపించేలా చేస్తా సర్ అంది గీతూ నాగార్జునతో. దాంతో అక్కడున్న ఆడియెన్స్ వామ్మో వద్దే వద్దు అన్నారు. దానికి నాగార్జున ‘వద్దో అని అరుస్తున్నారు ఆడియెన్స్’ అని చెప్పారు. దానికి రేవంత్ కూడా ‘హౌస్ లో కూడా అదే అభిప్రాయం సర్’అన్నాడు. నిజంగానే ఇలాంటి పిల్ల ఉండాలని ఎవరు కోరుకుంటారు? పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వనని చెబుతుంది, తనకు పడకపోతే ఎదుటివారి గురించి చెడు ప్రచారాలు చేస్తుంది, అవసరానికి మించి ఓవర్ యాక్షన్ చేస్తుంది, తనకు మాత్రమే కావాలనే స్వార్ధంతో ఉంటుంది... ఇలాంటి వాళ్లు ఇంట్లో ఉండాలని ఎవరు మాత్రం కోరుకుంటారు. 

డైలాగులు - ట్యాగ్లుకొన్ని రకాల డైలాగులు ఇచ్చి వాటికి తగ్గ వారిని ఎంచుకుని మెడలో వేయమని చెప్పారు. బాలాదిత్య ‘అవసరానికి దారులు తొక్కే పాత్రలే తప్ప, హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో’ అనే డైలాగ్ ఎంచుకుని గీతూ మెడలో వేశారు. దానికి నాగార్జున ‘నీ ఉద్దేశంలో గీతక్క అవసరాల కోసం దారులు తొక్కుతుంది’ అన్నారు. దానికి బాలాదిత్య అవునని చెప్పాడు. తరువాత ఇనయా ‘సొల్లాపు దమ్ముంటే నన్నాపు’ అనే డైలాగ్ తీసి సూర్య మెడలో వేసింది. దానికి నాగార్జున ‘ఈ మధ్య ఇనయా పొద్దు తిరుగుడు పువ్వు అయిపోయింది’ అన్నారు. దానికి అందరూ నవ్వారు. పొద్దు తిరుగుడు పువ్వు సూర్యుడి వైపే తిరుగుతుందనే ఉద్దేశంతో అన్నారు నాగ్. 

పకోడా అంటున్నాడు...వాసంతి ‘చేయి చూశావా ఎంత రఫ్‌గా ఉందో రఫ్పాడిస్తా’ అనే డైలాగ్ తీసి రేవంత్ మెడలో వేసింది. ఎందుకు వేశావ్ అని అడిగితే ‘నన్ను పకోడా’ అని పిలుస్తున్నాడు సర్ అంది. దానికి రేవంత్ ‘పకోడా కాదు పకోడి’ అని సరిచేశాడు. దానికి అందరూ నవ్వారు. 

కాగా ఈసారి ఎలిమినేషన్లో తొమ్మిది మంది ఉన్నారు. 1. ఆదిత్య2. గీతూ3. రాజ్ 4. కీర్తి5. సుదీప6. ఆదిరెడ్డి7. ఇనయా8. శ్రీహాన్9. అర్జున్

కవీరిలో ఈ వారం సుదీప బయటికి వెళ్లినట్టు సమాచారం. ఆమె ఇంట్లో వంటలక్కగా మారింది కానీ ఆట ఆడింది లేదు. దీంతో ఒకవేళ ఆమె వెళ్లిపోయిన బిగ్ బాస్ ఆటపై పెద్ద ఎఫెక్టు పడదని బిగ్ బాస్‌కు అర్ధమైపోయుంటుంది. అందుకే ఈమెనే ఈసారి ఎలిమినేట్ చేసినట్టు పక్కా సమాచారం.  

Also read: వయస్సొచ్చిన చిరుతలా ఉన్నావ్, గీతూకు చుక్కలు చూపించిన నాగార్జున, దెబ్బకు బద్దకం వదిలిపోయింది!