తెలుగులో బిగ్ బాస్ అయిపోగానే.. ఈ రియాలిటీ షో ఫ్యాన్స్ అంతా హిందీ బిగ్ బాస్‌పై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం హిందీలో 17వ సీజన్ నడుస్తుండగా.. అందులో అంకితా లోఖండే, విక్కీ జైన్ గురించే ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా వీరి గురించే ఎక్కువగా చర్చలు నడుస్తున్నాయి. అంకితా, విక్కీ రియల్ లైఫ్ కపుల్. ఆ కపుల్‌కు బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌గా అవకాశం ఇచ్చి వారి వైవాహిక జీవితంలో చిచ్చుపెట్టిందని ఆడియన్స్ అనుకుంటున్నారు. వారు అలా అనుకోవడానికి అంకితా, విక్కీల మధ్య జరుగుతున్న గొడవలే కారణం. తాజాగా కోపంలో విక్కీ.. తన భార్యను కొట్టబోయాడు కూడా. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియీలో వైరల్ అవుతోంది.


విడాకుల స్టేట్‌మెంట్ మరవకముందే


అంకితా లోఖండే, విక్కీ జైన్.. బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి వారిద్దరి మధ్య ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ప్రసారమయిన ఎపిసోడ్‌లో వైవాహిక జీవితంలో భర్తలు కష్టపడతారు, అసలు పెళ్లి చేసుకోవడమే తప్పు అన్నట్టుగా విక్కీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దానికి అంకితాకు కోపం వచ్చింది. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత విక్కీతో కలిసి జీవించలేనని, విడాకులు కావాలని స్టేట్‌మెంట్ ఇచ్చింది అంకితా. దీంతో ప్రేక్షకులు మాత్రమే కాదు.. కంటెస్టెంట్స్ సైతం షాక్ అయ్యారు. అంకితా అలా అన్నప్పటి నుంచి విక్కీ కూడా తనతో సరిగా మాట్లాడడం లేదు. ఇక తాజాగా వారిద్దరి మధ్య వాగ్వాదం జరగగా.. అందులో కంట్రోల్ కోల్పోయిన విక్కీ.. అంకితాపై చేయి ఎత్తాడు. అక్కడే ఉన్న కంటెస్టెంట్స్ ఇది చూసి షాక్ అయ్యారు.


షాకైన కంటెస్టెంట్స్


తాజాగా ప్రసారమయిన బిగ్ బాస్ 17 ఎపిసోడ్‌లో విక్కీ జైన్.. తన తోటి కంటెస్టెంట్ అయిన అభిషేక్ కుమార్‌తో ఫుడ్‌కు సంబంధించి మాట్లాడుతూ ఉన్నాడు. అంకితా కూడా వారి మాటల్లో జోక్యం చేసుకుంది. విక్కీకి అది నచ్చలేదు. అంకితాను సైలెంట్‌గా ఉండమని హెచ్చరించాడు. మర్యాదగా మాట్లాడు అంటూ అంకితా సీరియస్ అయ్యింది. దీంతో విక్కీకి కోపం వచ్చి తనను కొట్టడానికి ముందుకు వచ్చి.. వెంటనే ఆగిపోయి లేచి వెళ్లిపోయాడు. అక్కడే ఉండి అంతా గమనిస్తున్న అభిషేక్, అరుణ్.. విక్కీ ప్రవర్తన చూసి షాక్ అయ్యారు. అరుణ్ అయితే ఏంటది అంటూ ఒక్కసారిగా అరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో విక్కీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఏర్పడిన నెగిటివిటీ.. మరింత ఎక్కువయిపోయింది. 






రెండేళ్ల వరకు అంతా ఓకే..


అంకితా, విక్కీల మధ్య జరుగుతున్న గొడవలు చూసి ప్రేక్షకుల్లో అంకితా పట్ల సింపథీ క్రియేట్ అయ్యింది. అలాంటి భర్తను భరిస్తున్నందుకు అంకితానే విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నారు. ‘పవిత్ర రిష్తా’ అనే సీరియల్‌తో బుల్లితెర నటిగా పాపులర్ అయిన అంకితా.. విక్కీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి వీరిద్దరికి సంబంధించిన ప్రతీ చిన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకునేది అంకితా. రెండేళ్ల పాటు వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగినా.. బిగ్ బాస్ వల్ల వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడుతున్నాయని ప్రేక్షకులు అనుకుంటున్నారు. అంతే కాకుండా ఇరు కుటుంబ సభ్యులు కూడా అంకితా, విక్కీలు బిగ్ బాస్ హౌజ్‌లో పడుతున్న గొడవలు చూసి ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది.


Also Read: గౌతమ్ ఇంట్లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పార్టీ - పల్లవి ప్రశాంత్ అలా, మిగతావారు అంతా ఇలా!