ఎంటర్టైన్ మెంట్ వర్గాల్లో ఎక్కడ చూసినా ఇప్పుడు చర్చంతా బిగ్ బాస్ పైనే. ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తిచేసుకున్న బిగ్ బాస్… త్వరలో ఐదో సీజన్ లో నట్టింట్లో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఈ మధ్యే బిగ్‌బాస్ లోగో విడుదల చేసిన నిర్వాహకులు త్వరలోనే అంటూ హింట్ ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బిగ్ బాస్ 5 హడావుడే కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా బిగ్‌బాస్ సీజన్ 5లో రాబోతున్న కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో తెగ హడావుడి జరుగుతోంది.
ఇప్పటికే యాంకర్స్, కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్, హీరోయిన్స్ అంటూ పలువురి పేర్లు బయటకు వచ్చాయి. ప్రస్తుతం కొంతమంది కంటెస్టేంట్లకు ప్రోమో షూట్స్ కూడా జరుగుతున్నట్లుగా టాక్. కంటెస్టెంట్ల జర్నీ వీడియోలు కూడా అప్పుడే సిద్ధమైపోతున్నాయట. మరోవైపు ఈసారి కూడా హోస్ట్ గా ఉండనున్న అక్కినేని నాగార్జున ప్రోమో షూటింగ్‌లతో బిజీగానే ఉన్నాడని తెలుస్తోంది. ఇలా ఒకటా రెండా ఎక్కడ చూసినా బిగ్ బాస్ సందడే… అయితే కొత్తగా కంటెస్టెంట్స్ లిస్టులోకి కొత్త పేర్లు వచ్చి చేరుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం యంగ్ హీరో తేజా ప్రధాన పాత్రలో నటించిన జాంబిరెడ్డి సినిమా హీరోయన్ లహరి శారి బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా ఈ బ్యూటీ బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆశపడుతోందట. జాంబిరెడ్డిలో ఆమె పాత్ర కనిపించింది కొద్ది సమయం అయినా.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. పైగా మొదటి రెండు సీజన్లు బాగా క్లిక్కైనప్పటికీ వాళ్లకు బయటకు వచ్చాక పెద్దగా అవకాశాలు లేవు… కానీ మూడు, నాలుగు సీజన్ల కంటెస్టెంట్స్ మాత్రం బాగానే దూసుకుపోతున్నారు. ముఖ్యంగా నాలుగో సీజన్లో ప్రేక్షకులకు అంతగా తెలియని వాళ్లే రావడంతో… బిగ్ బాస్ తర్వాత పాపులారిటీ పెంచుకుని ఇప్పడిప్పుడే అవకాశాలు అందుకుంటున్నారు. జాంబిరెడ్డి బ్యూటీ కూడా అదే ఆలోచనలో ఉందట. హీరోయిన్ అనే ట్యాగ్ లైన్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే… ఆ తర్వాత అవకాశాలు అవే వస్తాయని ఆశపడుతోందట.
ఇక ఈసారి బిగ్‌బాస్ నిర్వహకులు భారీగానే ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఎంపిక చేసిన జాబితాలో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. జబర్దస్ స్టార్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌ను కూడా ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించారని, ఇందుకు భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారని టాక్, సుధీర్ కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఓకే చెప్పాడని అంటున్నారు. మరి ఈవార్తల్లో నిజమెంత అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాలి మరి….