బాలీవుడ్ టీవీ స్టార్ ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 'బిగ్ బాస్' రియాలిటీ షోతో పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. బోల్డ్ స్టైలింగ్, చిత్ర విచిత్రమైన ఫ్యాషన్ కు ప్రసిద్ధి చెందింది. డిఫరెంట్ అవుట్ ఫిట్స్ తో కుర్రాళ్ల దృష్టిని ఆకర్షిస్తుంది.. అదే సమయంలో వివాదాలు కొని తెచ్చుకుంటూ, నెట్టింట విపరీతమైన ట్రోలింగ్‌ ఎదుర్కొంటుంది. అయినా సరే అవేమీ పట్టించుకోకుండా ఉర్ఫీ జావేద్ తన బోల్డ్ ఫ్యాషన్ తో నెట్టింట రచ్చ చేస్తుంది. అయితే ఉర్ఫీది 'బ్యాడ్ టేస్ట్' అనే ఇటీవల బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కామెంట్ చేయగా.. లేటెస్ట్ గా దీనిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ స్పందించింది. 


బాలీవుడ్ స్టార్ హీరోయిన్, తన కజిన్ కరీనా కపూర్ నిర్వహిస్తున్న 'వాట్ విమెన్ వాంట్' చాట్ షోకి రణబీర్ కపూర్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఉర్ఫీ జావేద్ దుస్తుల గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఉర్ఫీ అవుట్ ఫిట్స్ లేదా ఆమె ఛాయిసెస్ ను బ్యాడ్ టేస్ట్ గా రణబీర్ పేర్కొన్నాడు. అయితే, కరీనా కొన్ని రోజుల తర్వాత ఉర్ఫీని అత్యంత ధైర్యవంతురాలిగా, చాలా గట్స్ ఉన్న అమ్మాయిగా అభివర్ణించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కరీనా కాంప్లిమెంట్ పై ఉర్ఫీ స్పందించింది.


“నేను గాల్లో ఎగిరాను, నేను మొదట నమ్మలేకపోయాను. ఇది ఒక జోక్ అని నేను అనుకున్నాను.. ఆమె నా దుస్తులను విమర్శించి ఉంటుందని భావించాను. నన్ను ప్రశంసించిందని చెప్పి.. అందరూ నన్ను మోసం చేస్తున్నారనుకున్నా. కానీ తర్వాత నేను ఆ వీడియో క్లిప్‌ని చూశాను. ఆ రోజు నేను నా జీవితంలో ఏదో సాధించానని గ్రహించాను” అని ఉర్ఫీ జావేద్ తెలిపారు. రణ్‌ బీర్ కామెంట్స్ తో నేను అప్సెట్ అయ్యాను, కానీ కరీనా కపూర్ కాంప్లిమెంట్ తో నేను ‘రణ్‌ బీర్ గో టూ హెల్’ అన్నట్లుగా ఉంది. కరీనా నన్ను ప్రశంసించింది, నాకు ఎవరి ధ్రువీకరణ లేదా మరేమీ అవసరం లేదు అని ఉర్ఫీ చెప్పుకొచ్చింది. 


రణబీర్ కపూర్ 'బ్యాడ్ టేస్ట్' అనే కామెంట్ చేసిన కొన్ని రోజుల తర్వాత, కరీనా కపూర్ ఓ ఇంటర్వ్యూలో ఉర్ఫీ జావేద్ యొక్క ఫ్యాషన్ ఛాయిస్ గురించి తన అభిప్రాయం వ్యక్తం చేసింది. “నేను ఉర్ఫీ మాదిరిగా ధైర్యంగా లేను, కానీ ఆమె చాలా ధైర్యవంతురాలని, చాలా గట్స్ ఉన్న అమ్మాయి అని నేను భావిస్తున్నాను. ఫ్యాషన్ అంటే భావవ్యక్తీకరణ, వాక్ స్వాతంత్ర్యం. ఆమె నిజంగా ఎంతో ఉత్సాహంతో చాలా కూల్ గా అద్భుతంగా కనిపిస్తుందని నేను భావిస్తున్నాను. ఆమె కోరుకున్నట్లుగా, ఆమెకు నచ్చినట్లు చేస్తుంది. ఫ్యాషన్ అంటే ఇదే. మీరు మీ స్వంత స్కిన్ తో సౌకర్యవంతంగా ఉండటం.. మీరు మీలాగే సరిగ్గా చేయడం ఫ్యాషన్. నేను కాన్ఫిడెన్స్ ని మాత్రమే ప్రేమిస్తున్నాను. నేను ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయిని కాబట్టి నేను ఆత్మవిశ్వాసం కోసమే ఉంటాను. నేను ఆమె కాన్ఫిడెన్స్ ని మరియు ఆమె నడుచుకునే విధానాన్ని ప్రేమిస్తున్నాను. హ్యాట్సాఫ్" అని కరీనా కపూర్ చెప్పింది. 


కరీనా కపూర్ స్టేట్మెంట్ ఉర్ఫీ జావేద్ దృష్టిని ఆకర్షించింది. ఆమె తన ప్రత్యేకమైన అవుట్ పిట్స్ తో వరుస ఫోటోలను పోస్ట్ చేస్తూ తన ఎగ్జైట్మెంట్ ని వ్యక్తం చేసింది. “నా కాన్ఫిడెన్స్ తనకు నచ్చిందని కరీనా కపూర్ చెప్పింది. నా లైఫ్ ఇప్పుడు కంప్లీట్ అయింది. ఓకే బై. నన్ను ఎవరైనా గిల్లండి'' అని ఉర్ఫీ క్యాప్షన్ పెట్టింది.