Bigg Boss 6 Telugu: సీజన్ 6 చివరికి వచ్చేసింది. ప్రస్తుతం 13 వవారం నడుస్తోంది. 15 వారం చివరికి విజేత ఎవరో తేలిపోతుంది. ప్రస్తుతం ఇంట్లో 8 మంది మిగిలారు. ఇందులో ఫినాలే టిక్కెట్ ఎవరు దక్కించుకుంటారో తేల్చుకునేందుకు పోటీ జరుగుతోంది. రెండు టాస్కుల తరువాత ఇనాయ, శ్రీసత్య ‘టిక్కెట్ టు ఫినాలే’ రేసు నుంచి బయటికి వెళ్లిపోయారు. మిగతవారికి ఫిజికల్ టాస్కుల ఇచ్చారు బిగ్ బాస్. ఆ పోటీ అంతా అయ్యాక అసలైన ట్విస్టు ఇచ్చాడు బిగ్ బాస్.
ఆరుగురిలో నలుగురు మాత్రమే తరువాతి పోటీలో పాల్గొనాలని, ఆ నలుగురు ఎవరో ఏకాభిప్రాయంతో తేల్చుకోవాలని చెప్పారు. దీంతో ఇంటి సభ్యులకు చిర్రెత్తు కొచ్చింది. ఆడి ఓడిపోయినా ఫర్వాలేదు కానీ ఇలా ఏకాభిప్రాయం పేరుతో పక్కకి వెళ్లిపోవడం ఇష్టం లేదని అన్నాడు రోహిత్.ఇక రేవంత్ ఏకాభిప్రాయం అనే కాన్సెప్ట్ వల్ల తానే ఎక్కువగా నష్టపోయానని, చాలా సార్లు తననే తీసేశారని చెప్పాడు. ఆదిరెడ్డి కూడా ఈ సమయంలో ఏకాభిప్రాయం కరెక్టు కాదు బిగ్ బాస్ అని అన్నాడు. ఇక శ్రీహాన్ అయితే కోపంగా నన్ను ఏకాభిప్రాయం పేరుతో తీసేస్తే నేను ఒక్కరిని ఆడనివ్వనని అన్నాడు.
ఈ సీజన్లో ఇంటి సభ్యులు ఎక్కువసార్లు బిగ్ బాస్‌ని ఎదిరించారు. అందరి కన్నా ముఖ్యంగా గీతూ బిగ్ బాస్‌ని కూడా లెక్క చేయకుండా నేను నీ మాట కూడా వినను బిగ్ బాస్ అంటూ ఓవర్ చేసి బయటికి వెళ్లిపోయింది. ఆదిరెడ్డి కూడా అదే జాతి. బిగ్ బాస్, హోస్ట్ చెప్పినా కూడా వాదించడం, అదేదో గొప్పగా అనుకోవడం, తాను నిజాయితీపరుడినని నిరూపించుకోవడం కోసం తాపత్రయపడులూ హోస్ట్ నాగార్జున, బిగ్ బాస్ మాట కూడా వినకుండా చేస్తున్నాడు. ఇక ఫైమా కూడా రేవంత్ విషయంలో బిగ్ బాస్ టీమ్‌ను, నాగార్జునను పరోక్షంగా అంది. రేవంత్ తప్పులు చూపించరు అంటూ ఎన్నో మాటలు అంది. ఇప్పుడు ఏకాభిప్రాయం అనే పదంతో మిగతా ఇంటి సభ్యులు కూడా తప్పుబట్టడం మొదలుపెట్టారు.
ఈసారి ఎవరు?
13వ వారం నామినేషన్లో రేవంత్, రోహిత్, ఆదిరెడ్డి, కీర్తి, శ్రీసత్య, ఫైమా ఉన్నారు. ఇనాయ కెప్టెన్ అవ్వడంతో ఆమెను ఎవరూ నామినేట్ చేయలేదు. శ్రీహాన్‌ను కూడా ఎవరూ నామినేట్ చేయకపోవడంతో ఆయన కూడా సేవ్ అయ్యాడు. ఈసారి ఫైమా, శ్రీసత్యలలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. రాజ్ కన్నా ఫైమాకు తక్కువగా ఓట్లు వచ్చాయి మొన్న. కానీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ కారణంగా ఆమె సేవ్ అయ్యింది. కానీ ఈసారి ఆమె బయటికి వెళ్లే ఛాన్సు ఉంది. అయితే శ్రీసత్యకు కూడా అవకాశాలు ఉన్నాయి.
Also read: ‘టికెట్ టు ఫినాలే’ కోసం కిందా మీద పడి కొట్టుకున్న అమ్మాయిలు