Shivaji Bigg Boss 7: క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా ఎన్నో సినిమాల్లో నటించినా కూడా శివాజీ పర్సనల్ లైఫ్ గురించి చాలామంది ప్రేక్షకులకు తెలియదు. బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో(Bigg Boss Telugu 7) కంటెస్టెంట్‌గా వచ్చిన తర్వాత తన ప్రవర్తన ఏంటి అని చాలామంది ప్రేక్షకులకు తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత పలుమార్లు తన ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి ప్రస్తావించారు శివాజీ. దీంతో తన పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెరిగింది. అందుకే ఆయన పాత ఇంటర్వ్యూలను చూస్తూ అసలు శివాజీ భార్య ఎవరు, పిల్లలు ఎంతమంది అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. చాలాకాలం క్రితం ఆయన పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన భార్య గురించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.


లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్..


ఓ టీవీ చానెల్‌లో యాంకర్‌గా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి అడుగుపెట్టారు శివాజీ. అదే క్రమంలో హీరోగా కూడా పలు సినిమాల్లో నటించారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఇతర హీరోలకు డబ్బింగ్ కూడా చెప్పారు. ఇలా ఆర్టిస్టుగా సినిమాల్లో బిజీగా ఉంటున్న క్రమంలోనే శివాజీ పెళ్లి చేసుకున్నారు. శివాజీ సొంతూరు గుంటూరు జిల్లాలోని నర్సరావుపేట. అక్కడి నుండి హైదరాబాద్ వచ్చిన తర్వాత తనకు సినీ పరిశ్రమలో అవకాశాలు వచ్చాయి. అలా బిజీ అయిపోయారు. అప్పుడే తను ఒక ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు అక్కడ తన భార్యను చూసి ఇష్టపడ్డారు. ఆ తర్వాత వెంటనే కుటుంబాలకు ఈ విషయం తెలిసేలా చేసి పెళ్లి చేసుకున్నారు. అందుకే తమది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అని ఇంటర్వ్యూలో బయటపెట్టారు శివాజీ.


రాజకీయ కుటుంబం..


శివాజీ భార్య కుటుంబానికి రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వీజీ గౌడ్ అలియాస్ వుల్లోల్ల గంగాధర్ గౌడ్ తోడల్లుడు కూతురే తన భార్య అని శివాజీ ఈ ఇంటర్వ్యులో రివీల్ చేశారు. మామూలుగా ఒక ఫంక్షన్‌లో కలిసి మాట్లాడుకొని పెళ్లి చేసుకున్నారని, ఎక్కువగా గ్యాప్ కూడా తీసుకోలేదని శివాజీ అన్నారు. తను నటుడే అయినా కూడా తన భార్యకు అసలు షూటింగ్ ఎలా ఉంటుందో కూడా తెలియదని తెలిపారు. అలా తను ముందే కండీషన్ పెట్టారని బయటపెట్టారు. తన భార్య కుటుంబం ఆర్థికంగా ఉన్నవాళ్లే అయినా తన పెళ్లి మాత్రం పూర్తిగా తన ఖర్చుతో జరిగిందన్నారు. తనకు ఇష్టమైన తిరుపతిలో చేసుకున్నానని సంతోషంగా చెప్పారు. కట్నం ఆశించలేదు కానీ కారు అయితే కొనిచ్చారని అన్నారు. 


ఆత్మాభిమానం అడ్డొచ్చింది


సొంత కాళ్ల మీద నిలబడడం, ఎవరి సాయం లేకుండా బ్రతకడం తనకు ఇష్టమని శివాజీ తెలిపారు. అందుకే అవకాశాలు రాని సమయంలో కూడా ఎవరిని అడగలేక, ఆత్మాభిమానం అడ్డొచ్చి తిరిగి వెళ్లిపోదామని అనుకున్నారట. ఫైనల్‌గా అలాంటి సమయంలో శివాజీని వెతుక్కుంటూ బిగ్ బాస్ అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటున్నారని ప్రేక్షకులు భావిస్తున్నారు. తన భార్యకు మాత్రమే కాదు.. పిల్లలకు కూడా సినిమాలు, షూటింగ్లు అంటే తెలియదని, వారిని వాటన్నింటికి దూరంగా పెంచానని శివాజీ తెలిపారు. ఈ విషయాన్ని ఇంటర్వ్యూలో మాత్రమే కాదు.. బిగ్ బాస్‌లో కూడా తెలిపారు శివాజీ. తన కొడుకు మీద పంతంతో బిగ్ బాస్ ఆఫర్‌ను ఒప్పుకున్నానని కూడా అన్నారు.


Also Read: పిల్లలు దూరమయ్యారు, రెండో పెళ్లి చేసుకున్నా కానీ వర్కవుట్ అవ్వలేదు - శ్రీకాంత్ అయ్యంగార్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial