Bigg Boss 6 Telugu: మరొక్క మూడు వారాల్లో ముగిసిపోతోంది బిగ్ బాస్ సీజన్ 6. ప్రతి సీజన్లో పదో వారంలోనే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేవారు. ఈసారి మాత్రం 12 వ వారంలో కుటుంబసభ్యులను అనుమతించారు. నిన్నటి ఎపిసోడ్లో ఆదిరెడ్డి భార్యా బిడ్డలను పంపించారు బిగ్ బాస్. తరువాత రాజ్ తల్లిని పంపించారు. ఈరోజు ఎపిసోడ్లో మాత్రం ఫైమా తల్లిని, శ్రీసత్య తల్లిదండ్రులను, రోహిత్ తల్లిని ఇంట్లోకి పంపిస్తున్నారు. 


ఇక ప్రోమోలో ఏముందంటే రాజ్ ఇంట్లో పాటల టీచర్ గా ఎంట్రీ ఇచ్చాడు. అందరికీ పాటలే నేర్పిస్తూ కనిపించాడు. ఫైమాకు, శ్రీహాన్‌కు పాటలు నేర్పించాడు. ఇందులో శ్రీహాన్‌కు ‘లాలి లాలి’ పాట నేర్పించబోయాడు. ఇందులో మళ్లీ ఆయన ‘వసపత్ర సాయికి’ అంటూ అందుకున్నాడు. రాజ్‌ ఎప్పుడు తెలుసుకుంటాడో వటపత్రసాయికి అని. రేవంత్ చెప్పినా కూడా వినకుండా ‘నువ్వే నాకు చెప్తావా’ అంటూ వాదన పెట్టుకున్నాడు. అంతా ఫన్ కోసమే చేశారు. ఈ లోపు ఇంట్లోవారిని ఫ్రీజ్ చేశారు బిగ్ బాస్. 



కన్ఫెషన్ రూమ్ నుంచి రోహిత్ తల్లి వచ్చింది. వచ్చి కొడుకుని ముద్దులాడారు. ఇంటి సభ్యులతో ప్రేమగా మాట్లాడారు. అందరికీ తినిపించారు. ఆదిరెడ్డి డ్యాన్సు అదిరిపోయిందని చెప్పింది. ఆమెకు తెలుగు సరిగా రాక పోవడంతో హిందీలో మాట్లాడింది. అందరి కుటుంబసభ్యులు వస్తున్నప్పుడు కీర్తి బాధను దిగమింగుకుంటోంది. ఆమెకు తల్లిదండ్రి, అన్నదమ్ములు ఎవరూ బతికి లేరు. బంధువులంతా దూరం పెట్టారు. దీంతో ఆమె తరపున ఎవరు వస్తారో అన్న ఆత్రుత ఆమెలోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా ఉంది.  






కాగా ఈ వారం శ్రీహాన్ ఆరు ఓట్లు, ఫైమాకి మూడు ఓట్లు, రోహిత్‌కి మూడు ఓట్లు, రాజ్‌కి రెండు ఓట్లు, ఆదిరెడ్డికి రెండు ఓట్లు, ఇనాయకు రెండు ఓట్లు పడ్డాయి. కీర్తిని ఎవరూ నామినేట్ చేయలేదు. ఇక రేవంత్ కెప్టెన్ అవ్వడంతో ఎవరూ  నామినేట్ చేయలేకపోయారు. అంటే రేవంత్, కీర్తి తప్ప మిగతా అందరూ నామినేషన్లలో ఉన్నారు. 


ఈసారి ఇంటి నుంచి ఎవరు వెళతారో అంచనా వేసేస్తున్నారు  ప్రేక్షకులు. రాజ్ లేదా రోహిత్... వీరిద్దరిలో ఒకరు బయటికి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు భావిస్తున్నారు.


Also read: ఫ్యామిలీని కలిసిన ఇంటి సభ్యులు - బిగ్‌బాస్ హౌస్‌లో ఆదిరెడ్డి భార్య, రాజ్ తల్లి