Bigg Boss Telugu 6: బిగ్ బాస్ సీజన్ 6లో ఉన్న ఇంటి సభ్యులను ఆర్జే సూర్య గురించి అడిగితే చాలా పాజిటివ్ గా చెబుతారు. ఎందుకంటే ఆట కన్నా సూర్య ఇంటి సభ్యుల ప్రేమను గెలుచుకోవడం పైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. కానీ ఆయన ప్రేక్షకుల మనసు గెలుచుకోలేక పోయాడు. ఆడితేనే కదా ప్రేక్షకులకు నచ్చేది. వ్యక్తిగా నచ్చినప్పటికీ, ఆటగాడిగా ఆయన నచ్చలేదు ఆడియెన్స్‌కి. అందుకే ఎనిమిదో వారమే, అంటే ఈ వారమే ఆయన ఎలిమినేట్ అయినట్టు సమాచారం. ఆరోహి ఉన్నంత కాలం ఆమె చుట్టూ తిరుగుతూ అన్నం తినిపించుకుంటూ ఉండేవాడు. ఆమె ఇలా వెళ్లిందో లేదో  ఇనయాను తన వైపు తిప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి తింటూ, కబుర్లాడు కుంటూ గడిపేశారు. ఆడపులిలా ఉండే ఇనయా కాస్త సూర్య వల్ల పొద్దుతిరుగుడు పూవుగా మారిపోయింది. ఆమెలోని ఫైర్ మొత్తాన్ని నీళ్లు పోసి ఆపేశాడు సూర్య. చివరికి ఎలాగో నాగార్జున క్లాసు పీకి ఇనయాను మళ్లీ ఆటలోకి పంపే ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం ఇనయా కాస్త ఫరవాలేదనిపిస్తోంది. 


సూర్య గట్టిగా ఆడిన టాస్కుల ఒక్కటంటే ఒక్కటి లేదు. పోనీ తన కోసం గట్టిగా వాదించిన సందర్భం కూడా లేదు. అసలు ఏ విషయంలోనూ ఆయన స్టాండ్ తీసుకున్న సందర్భం కూడా లేదు. ఏదో లవర్ బాయ్‌లా  వచ్చి అలా బయటకు వెళుతున్నాడు ఆర్జే సూర్య. నిజం చెప్పాలంటే ఈయన ఆట మీద కన్నా ఆరోహి, ఇనయాల మీద చూపించిన శ్రద్ధే ఎక్కువ.  ఆ శ్రద్ధ ఆట మీద పెట్టుకుంటే టాప్ 5 ఉండాల్సిన కంటెస్టెంట్ ఈయన. కానీ చుట్టూ అమ్మాయిలతో చేరి తన ఎలిమినేషన్ తానే తెచ్చుకున్నట్టు తెలుస్తోంది.


మంచి ఆర్టిస్ట్
బిగ్ బాస్ గురించి పక్కన పెడితే ఆర్జే సూర్యలో చాలా టాలెంట్ ఉంది. అనేక మంది సెలెబ్రిటీల గొంతులను ఇట్టే అనుకరిస్తాడు. ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, చిరంజీవి... ఇలా స్టార్ హీరోలందరి గొంతులు ఇట్టే మిమిక్రీ చేస్తాడు. చాలా సార్లు తనకున్న టాలెంట్‌తో ఇంటి సభ్యులను అలరించడమే కాదు, కొన్ని ఎపిసోడ్‌లను కూడా ముందుకు నడిపించాడు. ముఖ్యంగా పుష్పరాజ్ క్యారెక్టర్లో ఆయన జీవించాడు. 


ఆర్జే సూర్య ఫ్రెండు బుజ్జిమా మాత్రం బాగా ఫేమస్ అయ్యింది. ఆమె ఫ్రెండో, గర్ల్ ఫ్రెండో, లవరో, కాబోయే భార్యో తెలియకుండా సూర్య ఎలిమినేట్ అయిపోతున్నాడు. బుజ్జిమా ఏమో సూర్య నాకు ఫ్రెండ్ మాత్రమే అంటుంది. కానీ సూర్య మాత్రం ఫ్రెండ్ కన్నా ఎక్కువ అంటాడు. వీరిద్దరి మధ్య బంధం ఏంటో ఎప్పుడు క్లారిటీగా చెబుతారో. 






Also read: నువ్వెవరు ఆడించడానికి? బిగ్‌బాస్ ఉన్నారుగా, కామన్‌సెన్స్ లేదా? - గీతూకి గట్టిగానే క్లాసు తీసుకున్న నాగ్