Bigg Boss Telugu 6: ఈ వారం గీతూ ఆట చూసి చాలా మంది ప్రేక్షకులు మండిపోయింది. ఇంత ఓవరాక్షన్ అవసరమా? అని ప్రతి ఒక్కరూ చిరాకు పడ్డారు. అంతేకాదు ఆమె ఇంట్లో ఎంత అరాచకం చేసినా బిగ్‌బాస్ నిశ్శబ్దంగా ఉన్నాడు. దీంతో గీతూయే ఆడిస్తుంటే ఇక బిగ్‌బాస్ ఎందుకు అని కామెంట్లు కూడా చేసుకున్నారు. ఇంకెందుకు గీతూకి తీసుకెళ్లి టైటిల్ ఇచ్చేస్తే సరిపోతుంది కదా అనుకున్నారంతా. కానీ ఈ వీకెండ్లో గీతూకి గట్టిగానే క్లాసు తీసుకున్నారు నాగార్జున. నిజం చెప్పాలంటే ఈ సీజన్ మొత్తంలో ఇప్పటివరకు ఇంత గట్టిగా క్లాసు తీసుకుంది గీతూకేనేమో. అయినా ఆమెకు ఈ కోటింగ్ ఏం సరిపోతుంది లెండి. కుక్కతోక వంకర కదా. వచ్చే వారం కూడా ఇదే బుద్ధి చూపిస్తుందేమో. 



విడుదల చేసిన ప్రోమోలో గీతూకి క్లాసు పీకుతూ కనిపించారు నాగార్జున. ఆదిరెడ్డి - గీతూ నిల్చుని ఉండగా, నాగార్జున ‘మొన్న జరిగిన చేపల టాస్కులో నీ పార్టనర్ గీతూ ఫిజికల్ టాస్కు ఇవ్వండి గుద్ది పడేస్తా అంది, గుద్ది పడేసిందా’ అని ఆదిరెడ్డిని అడిగారు. గీతూకి నీడలా మారిన ఆదిరెడ్డి ‘ఆడింది సర్’ అని చెప్పాడు. ఏం ఆడిందో ఆయనకే తెలియాలి. దానికి నాగార్జున ‘బాగా ఆడితే మీరే ఎందుకు లీస్ట్‌లో ఉన్నారు’ అని అడిగారు. ‘నువ్వు గెలవాలని కాదు, అవతలి వారి వీక్‌నెస్ మీద దెబ్బకొట్టాలని ట్రై చేశావ్ ’ అన్నారు నాగార్జున. దానికి గీతూ ‘లాస్ట్ వీక్ పువ్వుల టాస్కు  ఎవరు సరిగా ఆడలేదు సర్, నేనుండే సీజన్, వాళ్లు ఆడకపోయినా నేనే ఆడిపిద్దామని, అందరినీ కావాలనే రెచ్చగొట్టా’ అంది గీతూ. 


అది బిగ్‌బాస్ పని
‘గేమ్‌ని ఇంట్రెస్ట్‌గా మార్చడం ఎలాగో బిగ్‌బాస్ చూసుకుంటాడు, ఎవరి ఆట వాళ్లు ఆడితే సీజన్ ఎక్కడో ఉంటుంది’ అని అన్నారు నాగార్జున. దానికి గీతూ ‘మెంటలైపోతుంది సర్ గేమంటే, బయట కూడా నేను గేమర్‌ని సర్’ అంది గీతూ. ‘ఒకరి వీక్‌నెస్ మీద ఆడడం గేమర్ కాదు’ అన్నారు నాగ్. ‘అసలు నువ్వెవరు ఆటలో ఇన్వాల్వ్ అవ్వడానికి, సంచాలక్ అంటే ఎంపైర్. నీ ఆట బొచ్చులో ఆట అయిపోయింది. ఆ మాట బావుందా? బాగోలేదు కదా. కోపం వస్తే కామన్ సెన్స్, అన్నీ వెళ్లిపోతాయేమో’ అని చాలా కోప్పడ్డారు నాగార్జున. గీతూ ముఖం మాడిపోయింది. ‘గీతూ నీకు పనిష్మెంట్ తీసుకోవడానికి అర్హురాలివి’ అన్నారు నాగార్జున. మరి ఏ పనిష్మెంట్ ఇస్తారో చూడాలి. 


సీజన్లో ప్రతి కంటెస్టెంట్‌కు అభిమానులు ఏర్పడతారు. కానీ విచిత్రంగా ఈ సీజన్లో మాత్రం గీతూ అభిమానులు కన్నా ద్వేషించే వాళ్లని ఎక్కువగా మూటకట్టుకుంది. అందుకే అతి ఎప్పుడైనా అనర్ధమే. ఆమె తన నోటికి తాళం వేసుకుని, అతిగా మాటలు విసిరేయకుండా ఉంటేనే మంచిది. 


Also read: అతడే ఇంటి కెప్టెన్, ఆడినా కూడా బాలాదిత్యను జైలుకి పంపిన శ్రీహాన్, శ్రీసత్య-గీతూల కోసమేనా?