వారియర్స్‌కు పనులు కేటాయించేందుకు బిగ్ బాస్ జాబ్ మేళా పెట్టగా.. ఛాలెంజర్స్ అందరూ డిసైడ్ చేసుకొని.. నటరాజ్ మాస్టర్,  తేజస్వి,అరియనా, అఖిల్ లను చెఫ్ లుగా ఎంపిక చేశారు. హౌస్‌ కీపింగ్ టీమ్ గా.. అషు, మహేష్, హమీద, సరయులను ఎంపిక చేశారు. మేనేజర్ గా ముమైత్ ను ఫైనల్ చేశారు. అయితే ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ లో అరియనా, నటరాజ్ మాస్టర్ ల ప్రవర్తన సరిగ్గా లేదని బిందు మాధవి, యాంకర్ శివ, శ్రీరాపాక కూర్చొని మాట్లాడుకున్నారు. 


ఆ తరువాత అరియనా, అషురెడ్డి, స్రవంతి ఒక దగ్గర కూర్చొని ఉండగా.. నటరాజ్ మాస్టర్, తేజస్వి ఎన్ని వారాలు హౌస్ లో ఉన్నారో డిస్కస్ చేసుకున్నారు. లంచ్ కి ఏం తినాలో.. వారియర్స్ టీమ్.. ఛాలెంజర్స్ టీమ్ కి కొన్ని ఆప్షన్స్ ఇవ్వగా.. వారు ఎక్కువ ఫుడ్ అడగడంతో ఇక చేసేదేం లేక.. రేషన్ మొత్తం అవగొట్టేదామని తేజస్వి చెప్పింది. 


ఛాలెంజర్స్.. వారియర్స్ తో సేవలు చేయించుకోవచ్చు కాబట్టి.. ఆర్జే చైతు  అషురెడ్డిని నీళ్లు తీసుకురమ్మని చెప్పాడు. ఆమె వాటర్ బాటిల్ ఫుల్ గా వాటర్ తీసుకురాగా.. తాగించమని అడిగాడు చైతు. ఆయన చెప్పినట్లుగానే చేసింది అషు. అయితే సడెన్ గా తన నోట్లో నీళ్లని అషు మొహంపై ఊశాడు చైతు. దీంతో అషు షాకైంది. నీళ్లు ఎక్కువ తాగించడంతోనే అలా చేయాల్సి వచ్చిందని చెప్పాడు. కానీ చైతు కావాలనే చేశాడనే విషయం క్లియర్ గా తెలుస్తుంది. దీన్ని అషురెడ్డి సీరియస్ గా తీసుకోకపోవడంతో ఇష్యూ అవ్వలేదు. 


ఇదే విషయాన్ని ఛాలెంజర్స్ కూడా చైతుతో అన్నారు. వేరే ఎవరిపైనైనా ఇలా నీళ్లు ఊస్తే అసలు ఊరుకోరని అన్నారు. దానికి చైతు.. ఆమెకి(అషురెడ్డి) ఆల్రెడీ సారీ చెప్పానని ఇక ఈ టాపిక్ వదిలేయాలని అన్నారు. 


బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరే:
వారియర్స్ టీమ్: 
1. అషురెడ్డి (సీజన్ 3)
2. మహేష్ విట్టా (సీజన్ 3)
3. ముమైత్ ఖాన్ (సీజన్ 1)
4. అరియనా (సీజన్ 4)
5. నటరాజ్ మాస్టర్ (సీజన్ 5)
6. తేజస్వి మదివాడ (సీజన్ 2)
7. సరయు (సీజన్ 5)
8. హమీద (సీజన్ 5) 
9. అఖిల్ సార్థక్ (సీజన్ 4)


ఛాలెంజర్స్:
1. ఆర్జే చైతు (ఆర్జే)
2. అజయ్ కతుర్వర్ (నటుడు)
3. స్రవంతి చొక్కారపు (యాంకర్)
4. శ్రీరాపాక (నటి)
5. అనిల్ రాథోడ్ (మోడల్)
6. మిత్రా శర్మ (నటి, నిర్మాత)
7. యాంకర్ శివ (యూట్యూబ్ యాంకర్)
8. బిందు మాధవి (హీరోయిన్) 


Also Read: 'బిగ్ బాస్ మేళా' ఎవరెవరికి ఏ పనులు కేటాయించారంటే?


Also Read: నన్ను పెళ్లి చేసుకుంటావా? చైతూకు సరయు ఆఫర్, హమీదాకు వాతలు పెడతానన్న నటరాజ్!