Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్6 చివరికి వచ్చేసింది. మరో అయిదు రోజుల్లో బిగ్ బాస్ ఫినాలే జరగబోతోంది. ఇంట్లో ప్రస్తుతం ఇంకా ఆరుగురు ఉన్నారు. వీరిలో ఒకరిని మిడ్ వీక్ ఎలిమనేషన్ పేరుతో ఇంటికి పంపనున్నారు. ఇక మిగిలేది టాప్5. వీరే ఫైనల్లో అడుగుపెట్టబోతున్నారు. కాగా బిగ్ బాస్ ఒక్కో కంటెస్టెంట్‌ను పొగడ్తలతో ముంచెత్తే టాస్కు మొదలుపెట్టారు. వారి జర్నీ వీడియోలు కూడా రెడీ చేశారు. గార్డెన్ అంతా అందంగా ముస్తాబైంది. ముందుగా రేవంత్‌ను పిలిచాడు బిగ్ బాస్. గార్డెన్లో రేవంత్ ఫోటోలు చాలా చోట్లా పెట్టారు. ఒక చిన్న వేదికను ఏర్పాటు చేశారు.దానిపై రేవంత్ నిల్చున్నారు. ఆయన భార్య నుంచి కాల్ వచ్చింది. ఆమె గెలిచిరావాలని చెప్పింది. 


కోపాన్ని పాషన్‌గా మార్చి
బిగ్ బాస్ రేవంత్‌ గురించి కాసేపు మాట్లాడాడు. ‘ఇప్పటివరకు పాటల పోటీల్లో మీరు గెలిచారు.ఇప్పుడు వ్యక్తిత్వానికి చెందిన పోటీలో కూడా గెలవాలని బిగ్‌బాస్ ఇంట్లో అడుగుపెట్టారు. మీ కోపం బలహీనతగా మారి పొరపాట్లకు కారణమైంది. ఓటమిని తీసుకోలేని మీ మనస్తత్వం చుట్టూ ఉన్న వారు వేలెత్తి చూపించే అవకాశాన్ని ఇచ్చింది. మీరు కోపాన్ని పాషన్‌గా మార్చారు. అది మీ పట్టుదలను రెట్టింపు చేసింది. ఆకలి టాస్కుల్లో ఎంత చూపించారో, ఇంట్లో కూడా అంతే చూపించారు. దాచుకుని తినడంలో మీలోని చిన్న పిల్లాడి అమాయకత్వాన్ని బిగ్‌బాస్ గమనించారు. అన్ని భావాలను కలిగిన వారే నిజమైన విజేతలు. అవన్ని దాచుకోకుండా మీరు చూపించిన తీరు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. జీవితంలో తండ్రయ్యే ముఖ్యమైన క్షణాలను వదులుకుని ఇంటి సభ్యులకు దూరంగా ఉన్నా గెలుపు కోసం ఎక్కడిదాకానైనా వెళ్లాలనే కోరికే మిమ్మల్ని ముందుకు నడిపింది’ అంటూ చెప్పుకొచ్చాడు బిగ్‌బాస్. ఆ తరువాత అతడి జర్నీ వీడియో ప్లే చేశారు. అది చూసి రేవంత్ చాలా ఎమోషనల్ అయిపోయాడు. 


తరువాత శ్రీసత్య
లక్ వల్ల టాప్ 6లో ఉంది శ్రీసత్య. ఆమెను పిలిచాడు బిగ్‌బాస్. ఆమె తన అక్కతో మాట్లాడింది. ఆమె గురించి బిగ్‌‌బాస్ చెబుతూ ‘పరిస్థితులు భుజాలపై బరువును పెంచితే దాన్ని చిరునవ్వుతో మోస్తూ ముందుకు కదిలే సత్తువ చూపించడమే మనిషికి మొదటి విజయం. ఆ పట్టుదల, మొండితనం రెండూ మీలో ఉన్నాయి. కష్టం వచ్చినప్పుడు పారిపోవడమో, ఎదుర్కోవడమో రెండే దారులుంటాయి. మీరు ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కోవడాన్ని ఎంచుకున్నారు. ఒంటరితనమే అడ్డుగా మార్చుకున్న మీకు... మీలో మరో కోణాన్ని తట్టే ఇద్దరు స్నేహితులు దొరికారు. ఇక్కడ మీ ప్రయాణాన్ని సులువు చేశారు’ అంటూ ఆమె జర్నీని ప్లే చేశారు బిగ్ బాస్. అది చూసి ఆమె చాలా ఎమోషనలైంది. 


విన్నర్ అనుకుంటున్న రేవంత్ జర్నీని మొదటిగా వేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీన్ని బట్టి వేరే వారిని విన్నర్ చేస్తారేమో అన్న అనుమానం మొదలైంది. చివరికి ఆదిరెడ్డిని విన్నర్ చేసినా చేస్తారు. ఇనాయను తీసేసిన బిగ్‌బాస్ ఏదైనా సాధ్యమే. 


Also read: ఇనయాకు ‘బిగ్ బాస్’ ఇచ్చిన పారితోషికం ఎంతో తెలుసా? ఆమె ఫ్యాన్స్‌కు ఇది ఓదార్పే!