‘బిగ్ బాస్’ సీజన్-7లోకి రతిక రీ-ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, హౌస్‌లోకి వెళ్లిన రోజు నుంచి రతిక హౌస్‌లో అందరితో ఆచితూచి మాట్లాడుతోంది. బయట శివాజీకి ఉన్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయన గ్రూపుతోనే దోస్తీ చేస్తోంది. ముఖ్యంగా యావర్‌ను వదిలి అస్సలు ఉండటం లేదు. అంతేగాక.. ఈ ఇంట్లో నీకు ఫ్రెండ్స్ ఎవరో తెలుసా నీకు? అని అడిగింది. ‘‘మనం ఇద్దరం ఒకే ప్లేటులో తినడం చూసి.. ప్రియాంక వచ్చారండి లవ్ బర్డ్స్ అన్నదని ఓ పెద్ద మనిషి నాకు చెప్పారు. మనం ఫ్రెండ్లీగా ఉంటే.. అలా అర్థం తియ్యడం ఏమిటీ?’’ అంటూ పుల్లలు పెట్టే కార్యక్రమానికి తెరదీసింది రతిక.


రతిక అప్పుడప్పుడు శివాజీకి భజన చేస్తూ కనిపిస్తోంది. అయితే, పల్లవి ప్రశాంత్‌ మాత్రం ఆమె దగ్గరకు వస్తుంటే చాలు అక్కడి నుంచి వెళ్లిపోతున్నాడు. చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాడు. ఇదే విషయాన్ని రతిక.. శివాజీ దృష్టికి తీసుకెళ్లింది. ‘‘ప్రశాంత్ నాతో ఎందుకు అలా ఉంటున్నాడు? వచ్చిన రోజు నుంచి చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాడు. నాతో మాట్లాడటం లేజదు’’ అని తెలిపింది. దీంతో శివాజీ ‘‘ప్రశాంత్‌కు చెప్పాను. ఆమెతో మాట్లాడమన్నా’’ అని తెలిపాడు. 


యావర్‌ మధ్యవర్తిత్వం


పల్లవి ప్రశాంత్‌ తనతో మాట్లాడటంలేదని చెప్పడంతో.. యావర్ మధ్యవర్తిత్వం వహించాడు. దీంతో రతిక, పల్లవి ప్రశాంత్‌ వాదోపవాదనలు చేసుకున్నారు. ‘‘నువ్వు నన్ను అక్క అని పిలవడం నచ్చలేదు. నన్ను రతిక అని పిలువు. బయటకు వెళ్లాక నీ ఇష్టం.. కానీ హౌస్‌లో ఉన్నప్పుడైనా ఫ్రెండ్లీగా ఉండు’’ అని అనడంతో.. ‘‘నేను అక్కా అనే పిలుస్తా’’ అని ప్రశాంత్ సమాధానం ఇచ్చాడు. ‘‘ఫస్ట్ నేను నీతోనే మాట్లాడా. నీతోనే ఎక్కువగా ఉన్నా. మనోళ్లు అనిపించి నీతో ఉన్నాను. కానీ, నువ్వు.. టాస్క్ రోజు మా అమ్మ, నాన్నను అన్నావు. నన్ను మస్త్ తిట్టావు. మొన్న నేను టీవీలో నాన్ను చూసి.. బాధేసింది. అదే మనసులో ఉండిపోయింది. ఆ బాధలోనే ఉన్నా’’ అంటూ పల్లవి ప్రశాంత్ ఏడ్చేశాడు. దీంతో రతిక స్పందిస్తూ.. ‘‘నేను ఆ ఇంటెన్షన్‌తో అనలేదు. ఆ రోజు అమర్‌దీప్ వల్లే అలా అనాల్సి వచ్చింది. నేను చెప్పేది విను. మనం ఫ్రెండ్స్‌గా ఉందాం’’ అని పేర్కొంది. ‘‘ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. మొదట్లో నీతో అలా ఉండి.. ఇప్పుడు గలీజుగా అక్క అంటున్నాడేమిటీ అని భోలే అన్నాడు. అందుకే దీని గురించి మాట్లాడుతున్నా’’ అని రతిక తెలిపింది. కానీ, నువ్వే నన్ను అక్కా అని పిలవమన్నావు. నేను అలాగే పిలుస్తా అని స్పష్టత ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. ‘‘నా గేమ్ నేను ఆడుకోవాలి. నా మైండ్ కరాబ్ అవుతుంది. నా వల్ల ఏమైనా ఇబ్బంది పెట్టినట్లయితే సారీ. అక్కా సారీ’’ అంటూ రతికా షాకుల మీద షాకిచ్చాడు. తన దగ్గర నుంచి వెళ్లిపోయాడు. 


ఓట్ల కోసం శివాజీ భజన


శివాజీ, పల్లవి ప్రశాంత్‌లతో గొడవలు పెట్టుకున్న వెంటనే రతిక హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. రెండోసారి హౌస్‌లోకి వచ్చిన తర్వాత రతిక.. నేరుగా శివాజీ కాళ్లు పట్టుకుంది. ఆ తర్వాత యావర్‌తో క్లోజ్‌గా ఉండటం మొదలుపెట్టింది. ఛాన్స్ దొరికినప్పుడల్లా శివాజీకి భజన చేస్తూ కనిపిస్తోంది. ఇతర వివాదాల జోలికి వెళ్లకుండా.. ‘బిగ్ బాస్’ హౌస్ బయట ఎవరికైతే ఎక్కువ ప్రేక్షకుల మద్దతు ఉందో.. ఆ కంటెస్టెంట్లతోనే క్లోజ్‌గా ఉంటూ వారి అభిమానుల మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. శివాజీ కూడా ఆమెను తన గ్రూపులో కలిపేసుకున్నా.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే, టాస్కుల్లో మాత్రం అంత చురుగ్గా ఉండటం లేదు. రతిక ఈ సారి తన ఒరిజినాలిటీని దాచేసి ఫేక్‌గా ఉంటున్నట్లు తెలిసిపోతోంది. రెండోసారి వచ్చినందుకు రతిక రెట్టింపు ఉత్సాహంతో యాక్టీవ్‌గా ఉంటూ.. ఇండివిడ్యువల్ గేమ్ ఆడినట్లయితే.. తప్పకుండా ప్రేక్షకుల మెప్పు పొందెదేమో. కానీ, ఇప్పుడు ప్రేక్షకులను ఆమె మరింత విసిగిస్తున్నట్లు కనిపిస్తోంది. చెప్పాలంటే.. ముందు ఉన్న రతికానే బీబీ ప్రేక్షకులను బాగా అలరించినట్లు కనిపిస్తోంది. వచ్చే వారం నామినేషన్స్‌లో ఉంటే.. మళ్లీ డేంజర్ జోన్‌లోకి వచ్చినట్లే. ఇప్పటికైనా రతిక.. నష్ట నివారణ చర్యలపై ఫోకస్ తగ్గించి.. కేవలం తన ఆట మీద ఫోకస్ పెడితే.. తప్పకుండా ప్రేక్షకుల మెప్పు పొందుతుంది. 


కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచిన కంటెస్టెంట్స్ వీళ్లే: 


కెప్టెన్సీ టాస్క్ కోసం.. ఇప్పటివరకు జరిగిన ‘బిగ్ బాస్’ మారథన్‌లో కంటెస్టెంట్లు అంతా పోటీపడ్డారు. చివరికి ప్రియాంక, పల్లవి ప్రశాంత్, గౌతమ్, శోభాశెట్టి, సందీప్‌లు టాస్కుల్లో గెలిచి కెప్టెన్సీ కంటెండర్‌షిప్‌ను సొంతం చేసుకున్నారు. వీరి మధ్య కెప్టెన్సీ టాస్క్ జరగనుంది.


Also Read: వాళ్లకు సాయం చేయొద్దన్న శివాజీ - నాకు అన్యాయం జరిగితే ఒప్పుకోనన్న తేజ!