Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7లో ఫినాలే అస్త్రా కోసం బ్యాక్ టు బ్యాక్ టాస్కులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఫినాలే అస్త్రా కోసం మూడు టాస్కులు పూర్తి కాగా అందులో అమర్‌దీప్ అత్యధిక పాయింట్లను సాధించి ముందంజలో ఉన్నాడు. ఇక జరిగిన మూడు టాస్కుల్లో రెండు టాస్కులు గెలిచిన అర్జున్.. రెండో స్థానంలో ఉన్నాడు. అయితే ఇన్నాళ్లు ప్రతీ ఆటలో కలిసి ఆడిన ఫ్రెండ్స్ మధ్య కూడా ఫినాలే అస్త్రా వల్ల గొడవలు జరుగుతున్నాయి. 60 పాయింట్ల కోసం ప్రియాంకతో సీరియస్ ఫైట్ చేశాడు అమర్. తనకు గాయాలు అవుతున్నా పట్టించుకోలేదు. దీంతో ప్రియాంక.. అమర్‌పై అలిగి గౌతమ్‌కు సపోర్ట్ చేసినట్టు తాజాగా విడుదలయిన ప్రోమో చూస్తే అర్థమవుతోంది.
గెస్ చేయ్ గురు..
ముందుగా ఈ ప్రోమోలో ఫినాలే అస్త్రా కోసం కంటెస్టెంట్స్ అయిదో టాస్క్‌లో పోటీపడుతున్నట్టుగా చూపించారు. ఆ అయిదో ఛాలెంజ్ పేరు ‘గెస్ చేయ్ గురు’ అని బిగ్ బాస్ వివరించారు. ఈ ఛాలెంజ్‌లో కంటెస్టెంట్స్‌కు సమయానుసారం కొన్ని సౌండ్స్‌ను వినిపిస్తారు బిగ్ బాస్. అయితే ఆ సౌండ్స్ ఏంటి అని వారు గెస్ చేసి రాయాలి. ఈ టాస్క్‌కు మళ్లీ శివాజీ, శోభానే సంచాలకులుగా వ్యవహరిస్తున్నారు. కంటెస్టెంట్స్‌లో ఎవరూ ఛీటింగ్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపై పడింది. అయితే ఈ టాస్క్‌లో అమర్.. గోట్‌కు బదులుగా షీప్ అని రాశాడని తనకు ఒక పాయింట్ తీసేయమని అన్నాడు అర్జున్. గోట్ అయితే ఏముంది? షీప్ అయితే ఏముంది అని అమర్ ప్రశ్నించాడు. రెండు వేర్వేరు అని అర్జున్, ప్రియాంక అన్నారు. ‘‘అలా ఎలా అవుతుంది రెండు మేకలే కదా’’ అని అమర్ కన్ఫ్యూజన్‌లో పడిపోయాడు.
కప్ప, హెలికాప్టర్ సౌండ్లు ఎలా ఉంటాయి..?
కొన్ని రౌండ్లు ముగిసిన తర్వాత యావర్, ప్రశాంత్.. తరువాతి రౌండ్స్‌లో పాల్గొనలేరని బిగ్ బాస్ తెలిపారు. ఆ తర్వాత కప్ప సౌండ్ ఎలా ఉంటుంది అని అమర్‌ను బిగ్ బాస్ అడగగా.. అమర్ ఇమిటేట్ చేసి చూపించాడు. అమర్‌తో పాటు ప్రియాంక కూడా ఇమిటేట్ చేసే ప్రయత్నం చేసింది. దానికి అమర్.. ‘‘ఇది మగ కప్ప. ఇది ఆడ కప్ప’’ అని చెప్పగా కంటెస్టెంట్స్ అంతా నవ్వుకున్నారు. ఇక హెలికాప్టర్ సౌండ్ ఎలా ఉంటుంది అని పల్లవి ప్రశాంత్‌ను అడిగారు బిగ్ బాస్. తనకు తోచిన విధంగా ప్రశాంత్ చేసి చూపించగా.. ‘‘స్ట్రీమ్ ఇంజెన్ కాదు హెలికాప్టర్’’ అని బిగ్ బాస్ కామెడీ చేశారు.
వెధవను అయ్యింది నేనే కదా..
ఇక ఫినాలే అస్త్రా కోసం కొన్ని ఛాలెంజ్‌లు పూర్తయిన తర్వాత ప్రియాంక.. పాయింట్స్ టేబుల్‌లో లాస్ట్‌లో ఉంది. దీంతో ‘‘మీ దగ్గర ఉన్న పాయింట్స్‌లో నుంచి సగం పాయింట్స్ మీరు ఇవ్వాలనుకునే ఒకరికి ఇవ్వొచ్చు’’ అని బిగ్ బాస్ తెలిపారు. బిగ్ బాస్ చెప్పగానే ఎక్కువగా ఆలోచించకుండా గౌతమ్ పేరును ప్రకటించింది ప్రియాంక. దీంతో అమర్‌దీప్ హర్ట్ అయ్యాడు. ‘‘నాకు ఇవ్వాలని అనిపించలేదా’’ అని అడిగాడు. ‘‘ప్రతీది ముఖ్యమే’’ అని ప్రియాంక సమాధానమిచ్చింది. దానికి అమర్ ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా కూర్చోగా.. ఏంటి అని అడిగింది ప్రియాంక. ‘‘వెధవను అయిపోయింది నేనే కదా’’ అంటూ అక్కడ నుంచి లేచి వెళ్లిపోయాడు అమర్. ‘‘వెధవను అయిపోయానంటే ఏంటి నీ అర్థం’’ అని ప్రియాంక అడుగుతున్నా పట్టించుకోలేదు. నవంబర్ 28న ప్రసారమయిన ఎపిసోడ్‌లో శివాజీ, శోభా కలిసి అమర్‌కే తమ పాయింట్స్‌ను త్యాగం చేశారు. అయినా కూడా ప్రియాంకతో 60 పాయింట్ల కోసం కుస్తీపడ్డాడు. తనకు గాయాలు అవుతున్నా పట్టించుకోలేదు. ఇంత జరిగిన తర్వాత కూడా ప్రియాంక తనకే సపోర్ట్ చేయాలని అమర్ ఎలా ఆశిస్తున్నాడని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
Also Read: అమరావతి రైతుల కోసం పోరాడిన శివాజీ? ‘బిగ్ బాస్’ ఓట్ల కోసం కొత్త ప్రచారం - ఈ మెసేజ్ మీకు వచ్చిందా?
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply