Bigg Biss 6 Telugu: బిగ్‌బాస్ ఏ సీజన్లోను లేని ఓ కొత్త ఆటను తెరపైకి తెచ్చారు. నిజానికి దీన్ని ఆట అనడానికి లేదు, ఇదో కొత్త పథకం అనవచ్చు. నామినేషన్లలో ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది. కానీ దీన్ని వాడడం మాత్రం చాలా కష్టం. అసలేంటంటే... ఈ వారం నామినేషన్లలో తొమ్మిది మంది ఉన్నారు. ఫైమా కెప్టెన్ అవ్వడం వల్ల ఆమె తప్పించుకుంది. మిగతా వారంతా నామినేషన్లలో ఉన్నారు. అయితే వారు నామినేషన్ నుంచి సేవ్ కావడానికి బిగ్ బాస్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. కాకపోతే ఆ ఆపర్లో పెద్ద ట్విస్టు కూడా ఉంది. 


ఈసారి బిగ్ బాస్ విన్నంగ్ ప్రైజ్ యాభై లక్షల రూపాయలు. నామినేట్ అయిన సభ్యులు ఈ వారం సేవ్ అయ్యేందుకు తమకిచ్చిన ఖాళీ చెక్‌లపై కొంత మొత్తం రాయాలి. ఎవరైతే వారిలో ఎక్కువ మొత్తం రాస్తారో వారు సేవ్ అవుతారు. అయితే ఆ మొత్తం విన్నింగ్ ప్రైజ్ అయిన యాభై లక్షల రూపాయల నుంచి తగ్గిస్తారు. అలాగే తాము ఎంత రాశామో కూడా ఇతర ఇంటి సభ్యులకు చెప్పకూడదు. చెక్‌లపై నగదు రాశాక వాటిని గార్డెన్లో పెట్టిన ‘డ్రాప్ బాక్సు’లో వేయాలి. ఆదిరెడ్డి చెక్ వేస్తూ ‘ఎవరైతే హయ్యస్ట్ ఎమౌంట్ రాసి, సేవ్ కావడానికి ప్రయత్నిస్తారో, వారికి ఈ ఇంట్లో ఉండడానికి అర్హతే లేదు బిగ్ బాస్’ అన్నాడు. ఇక రేవంత్  ‘నాకు సేవ్ అవుతానన్న నమ్మకం ఉంది, దాన్ని బట్టే ఎమౌంట్ రాశా’ అన్నాడు. ఇక ఇనాయ అయిదు లక్షలు ఇద్దరు రాసే అవకాశం ఉంది అంటూ ఏదేదో మాట్లాడుకుని వెళ్లిపోయింది.   


శ్రీసత్య డిస్‌క్వాలిఫై
యాటిట్యూడ్ స్టార్ శ్రీసత్య బిగ్ బాస్ చెప్పినప్పటికీ తాను ఎంత మొత్తం రాసిందో తన స్నేహితులకు చెప్పేసింది. దీంతో బిగ్ బాస్ ఆమెను ఈ టాస్కు నుంచి డిస్ క్వాలిఫై చేశారు. మిగతావారు మాత్రం ఎవరికీ చెప్పకుండా సీక్రెట్ గా ఉంచారు. ఈ మొత్తం ఆరు సీజన్లలో ఇలాంటి గేమ్ అయితే ఆడించడం ఇదే తొలిసారి. ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో కొత్త గేమ్‌లు ప్రవేశపెడుతున్నారు బిగ్ బాస్. ఈ సీజన్లో ఎంటర్టైన్ చేసే వాళ్లు లేకపోవడం పెద్ద మైనస్ అయిపోయింది. గత సీజన్లలోగా సన్నీ, షణ్ను, అభిజిత్, అఖిల్, బిందు మాధవి... ఇలా ప్రేక్షకుల మనుసును భారీగా గెలచుకున్న వారు ఒక్కరూ లేరు. కొంతలో కొంత రేవంత్ బెటర్ అనిపిస్తున్నా, తన పిచ్చికోపంతో చెడగొట్టుకుంటున్నాడు. మాటలు కూడా తూలుతున్నాడు. మాటిమాటికి అలగడం, మాటలు విసరడం చూసే వారికి చిరాకుగా ఉంది. 



ఇక ఈ వారం నామినేషన్లలో ఉన్న సభ్యులు ఎవరంటే..
1. రోహిత్
2. ఇనాయ
3. శ్రీహాన్
4. ఆదిరెడ్డి
5. రాజ్
6. రేవంత్
7. మెరీనా
8. శ్రీసత్య
9. కీర్తి


Also read: అరుపులు, కేకలు లేకుండా సాఫీగా సాగిన నామినేషన్ ప్రకియ, ఈసారి నామినేషన్లో ఉన్నది వీళ్లే