Navdeep Apologise Bigg Boss 9 Contestant Srija: బిగ్ బాస్ అగ్ని పరీక్ష రోజు రోజుకూ హీట్ పెంచేస్తోంది. టాప్ 15 కంటెస్టెంట్స్‌లో చోటు దక్కించుకునేందుకు ప్రస్తుతం 'డూ ఆర్ డై' పోటీ నిర్వహిస్తున్నారు. జడ్జెస్ నవదీప్, బిందు మాధవి, అభిజిత్ ఒక్కొక్కరిగా డిఫరెంట్ టాస్కులు ఇస్తూ ఆ సీట్స్ ఫిల్ చేస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీజకు నవదీప్ సారీ చెప్పారు.
సోమవారం జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ శ్రీజపై నవదీప్ మాట తూలారు. ఓ గేమ్ అన్ ఫెయిర్ అంటూ ఆమె హ్యాండ్ రెయిజ్ చేయగా... ఆమెను స్టేజీ మీదకు పిలిచి... 'అది అన్ ఫెయిర్ అని నువ్వు ఎలా చెప్తావ్. ఊరి నుంచి ఊపుకుంటూ వచ్చిన నీకు అంత సీన్ లేదు. ఇది తప్పు. నేను మామూలుగా చెప్తున్నా. అక్కడ ఇలా ఉండదు. ఇక ఛాన్స్ లేదు. వెళ్లి కూర్చో.' అంటూ కామెంట్ చేశారు. దీనిపై విమర్శలు రాగా తన ఇన్ స్టా స్టోరీ సారీ చెబుతూ పోస్ట్ పెట్టారు.
సున్నిత మనసులకు సారీ
'ఊరి నుంచి వచ్చి' అన్న మాటకు ఫీలైన సున్నితమైన మనసులకు ప్రేమతో సారీ చెబుతున్నా అంటూ నవదీప్ పోస్ట్ చేశారు. 'ప్రేమతో సారీ చెబుతున్నా. కుదిరితే క్షమించండి. ఐ లవ్యూ' అంటూ హార్ట్ సింబల్ ఎమోజీతో పోస్ట్ చేశారు. ఇది వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే?
టాప్ 15లో ప్లేస్ కోసం 17 మంది కంటెండర్స్ మధ్య పోటీ జరుగుతుండగా యాంకర్ శ్రీముఖి కల్కి, షాకిబ్ మధ్య ఓ టాస్క్ ఇచ్చారు. తెలిసిన వారికి ఫోన్ చేసి టాస్క్ అని చెప్పకుండా ఎక్కువ అమౌంట్ అకౌంట్‌లో వేయించుకోవాలంటూ ఇద్దరికీ వేర్వేరుగా చెప్తూనే టాస్క్ ఇచ్చారు. షాకిబ్ కన్ఫ్యూజ్ అయ్యి రూ.60 వేలు వేయించుకోగా... కల్కి ఫస్టే రూ.90 వేలు రప్పించుకున్నారు. దీంతో ఆమెను టాప్ 15లోకి చేర్చారు జడ్జెస్. ఇది అన్ ఫెయిరా అని అడగ్గా శ్రీజ హ్యాండ్ రెయిజ్ చేశారు.
దీనిపై నవదీప్ ఆమెకు క్లాస్ పీకారు. 'షాకిబ్ కన్ఫ్యూజ్ అయినా నేను చెప్పాను. అతనికి మరో ఛాన్స్ కూడా ఇచ్చాం. అది అన్ ఫెయిర్ అని నువ్వెలా చెప్తావ్. ఊరి నుంచి ఊపుకుంటూ వచ్చిన నీకు అంత సీన్ లేదు. వెళ్లి సీట్లో కూర్చోండి.' అంటూ ఫైర్ అయ్యారు. ఈమాత్రం దానికి నన్ను ఎందుకు పిలిచారు? అని శ్రీజ ప్రశ్నిస్తే... 'అందరికీ తెలియాలి కదా' అంటూ ఆన్సర్ ఇచ్చారు నవదీప్. ఈ కామెంట్స్‌పై విమర్శలు వ్యక్తం కాగా నవదీప్ సారీ చెబుతూ ఇన్ స్టా పోస్ట్ చేశారు.