Bigg Boss 6 Telugu: మరొక్క మూడు వారాల్లో విజేత తేలిపోనుంది. ఇంటో ఇంకా 9 మంది మిగిలారు. ఈరోజు ఒకరు ఎలిమినేట్ అయితే ఇంకా ఎనిమిది మంది మిగులుతారు. అదే విషయాన్ని గుర్తు చేశారు నాగార్జున. ఇంట్లో స్నేహాలు, ప్రేమలు పక్కన పెట్టి ఇంట్లో ఉన్న సభ్యుల గురించి బ్యాడ్ క్వాలిటీస్ చెప్పమని అడిగారు. దానికి ఇనయా రాజ్ గురించి చెప్పింది. ‘బ్యాడ్ క్వాలిటీస్ అని కాదు కానీ, ఆయన ఎందుకు కొన్నిసార్లు రైజ్ అవుతాడో తెలియదు’ అని చెప్పింది. ఇక శ్రీహాన్ రేవంత్ గురించి చెప్పుకొచ్చాడు ‘ఫ్రెండంటే ఒకసారి చెబితే అర్థం చేసుకోవాలి, బయటివాళ్లకైతే పదిసార్లు చెబుతాం, ఫ్రెండ్ అంటే నమ్మకం ఉండాలి కదా, ఏది చెప్పినా వినాలి కానీ, నువ్వు నాకు చెప్పేదేంటి అన్నట్టు ఉండకూడదు’ అన్నాడు. అతను ఏ విషయం గురించి ఇలా చెప్పాడో తెలియలేదు.
ఇక శ్రీసత్య శ్రీహాన్ గురించి చెప్పుకొచ్చింది ‘ఆట కన్నా స్నేహానికే ఎక్కువ విలువ ఇచ్చి ఆడతాడు’ అని చెప్పింది. ఇక ఆదిరెడ్డి కూడా రేవంత్ గురించే చెప్పాడు ‘అతను బాగా బాగా ఆడతాడు, అలాంటి వ్యక్తి నేనున్నాను అని చూపించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు, అది అవసరం లేదు’ అని చెప్పాడు. ఇక రేవంత్ ఫైమా గురించి చెప్పుకొచ్చాడు. ఫైమా వెటకారం తగ్గించుకోవాలని అనుకుంది, కానీ తగ్గించుకోలేదని అన్నారు. రాజ్... ఇనాయ గురించి చెప్పాడు. ఆమె ప్రతిదానికి మధ్యలో దూరుతుందని అర్థం వచ్చేలా చెప్పాడు. ఇక ఫైమా ఏదో చెప్పబోతుంటే నాగార్జున ఆపారు.
‘ఫైమా సంచాలక్ తమ వ్యక్తిగత ఇష్టయిష్టాలతో ఆట ఆడొచ్చా, కొంతమందికి నువ్విలా ఆడు అని చెప్పొచ్చా?’ అని అడిగారు. దానికి ఆమె అందరికీ ఇచ్చుకుని వచ్చాను సర్ అంది. దానికి నాగార్జున అందరికీ ఎప్పుడిచ్చావ్, ఒక్కరికే ఇచ్చావ్ అన్నారు. దానికి ఫైమా ‘ఉంటాది కదా సర్ మనవాళ్లు ఉండాలని’ అంది. నాగార్జున ‘మరి సంచాలక్ అలా చెప్పొచ్చా?’ అని ప్రశ్నించారు. ఈమెను ఇలా ప్రశ్నిస్తున్నారు రేవంత్ ముఖం వెలిగిపోయింది.