Bigg Boss 9 Telugu Live Updates: 9 మంది సెలబ్రిటీస్... ఆరుగురు కామనర్స్ - బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ కంటెస్టెంట్స్

Bigg Boss 9: కింగ్ నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈసారి సరికొత్తగా డబుల్ డోస్ డబుల్ జోష్‌తో మరింత ఎంటర్‌టైన్‌మెంట్ అందించనుంది.

Ganesh Guptha Last Updated: 07 Sep 2025 09:33 PM

Background

Nagarjuna's Bigg Boss Telugu Season 9 Live Updates: కింగ్ నాగార్జున హోస్ట్‌గా ది ఫేమస్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9కు సర్వం సిద్ధమైంది. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా సరికొత్తగా డబుల్ హౌస్ డబుల్ డోస్...More

బిగ్ సర్ ప్రైజ్ - 15వ కంటెస్టెంట్‌గా కామనర్ మర్యాద మనీష్

బిగ్ బాస్ హౌస్‌లోకి బిగ్ సర్ ప్రైజ్ ఇస్తూ 15వ కంటెస్టెంట్‌గా కామనర్ మర్యాద మనీష్‌ను యాంకర్ శ్రీముఖి ఎంపిక చేశారు. తొలుత 14 మందినే అనుకున్నా... హోస్ట్ నాగార్జునను రిక్వెస్ట్ చేయగా 15వ కంటెస్టెంట్‌కు అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. దీంతో యాంకర్ శ్రీముఖి, జ్యూరీ అభిజిత్ మనీష్‌‌ను సెలక్ట్ చేశారు. దీంతో మొత్తం 15 మందితో బిగ్ బాస్ హౌస్ సీజన్ 9 సాగనుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరో ఐదుగురు ఎంటర్ అయ్యే అవకాశం ఉంది.