Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6 అంతగా అలరించనప్పటికీ కొంతమంది కంటెస్టెంట్లు మాత్రం బాగా హైలైట్ అయ్యారు. వారు అంతకుముందు ఎవరో కూడా ప్రేక్షకులకు తెలియదు. కానీ ఈ సీజన్ వల్ల వీరంతా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అందులో మొదటి కంటెస్టెంట్ ఇనాయ సుల్తానా. ఈమె ఎవరో కూడా అంతకుముందు తెలుగు వారికి తెలియదు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో చేసినప్పటికీ ఆమెను ఎవరూ పోల్చలేరు. కానీ ఇప్పుడు ఆమెను ఎక్కడా చూసినా పోల్చేంత పబ్లిసిటీ ఆమెకు వచ్చింది. ఆటలో కూడా చురుగ్గా ఉంది ఇనాయ. ఒకనొక దశలో ఆమె విన్నర్ అవుతుందని ఎంతో మంది అనుకున్నారు. కానీ ఆమె ఈ రోజు ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విన్నర్ మెటీరియల్‌గా చెప్పుకుంటున్న రేవంత్ కు మొదటి పదివారాలు గట్టి పోటీ ఇచ్చింది కూడా ఇనాయనే. ఆమె ఓటింగ్లో ఎక్కువ వారాలు రెండో స్థానంలోనే కొనసాగింది. గత మూడు వారాలుగా రోహిత్ దూసుకొచ్చాడు. మెరీనా ఇంట్లోంచి వెళ్లిపోవడం ఆయనకు కలిసి వచ్చింది. ఇప్పుడు రేవంత్ మొదటిస్థానంలో ఉండగా, రోహిత్ రెండో స్థానంలో, ఇనాయ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అలాంటిది ఈ వారం ఇనాయను ఎలిమినేట్ చేశారనే సమాచారం రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 


ఇక ప్రోమో విషయానికి వస్తే నాగార్జున ఇంటి సభ్యుల చేత ఆటలు ఆడించారు. పాట ఇచ్చి డ్యాన్సు ద్వారా ఆ పాట ఏంటో మిగతా ఇంటి సభ్యులకు చెప్పాలని ఆట ఇచ్చారు. ఇందులో రేవంత్ ఎక్కువ పాటలు పోల్చాడు. కానీ ప్రోమోలో మాత్రం పాటలు, డ్యాన్సులు అదిరాయి. ఇక ఆది డ్యాన్సు హైలైట్ అనే చెప్పాలి. సన్నగా, పొడవుగా ఉండే ఆది డ్యాన్సు వేస్తుంటే చాలా నవ్వు వచ్చేలా ఉంది. 



ఇక అందరినీ సేవ్ చేశాక చివరికి ఆది, ఇనాయ మిగిలారు. వారిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. రోలర్ ఎవరు ఎలిమినేట్ అయ్యారో చెబుతుందని అన్నారు నాగార్జున. బోర్డుపై రోలర్‌తో రోల్ చేస్తే ఎలిమినేట్ అయిన వారి పేరు లేదా ఫోటో వచ్చేలా ఏర్పాటు చేశారు. ఇందులో ఇనాయ ఎలిమినేట్ అయినట్టు ఆల్రెడీ వార్తలు వచ్చేశాయి. 


ఈ వారం ఎక్కువ మంది ఊహించింది కీర్తి లేదా రోహిత్ ఎలిమినేట్ అవుతారని. కానీ వీరిద్ధరూ ఫైనల్లోకి వెళ్లిపోయారు. ఎంతో కష్టపడి ఆడిన ఇనాయ మాత్రం పాపం ఎలిమినేట్ అయి ఇంటికెళ్లిపోయినట్టు తెలుస్తోంది. శ్రీసత్యకు కూడా ఇనాయ కంటే తక్కువ ఓట్లు వచ్చినట్టు సమాచారం. అయినా కూడా ఇనాయనే ఎలిమినేట్ చేశారు.






Also read: సంచాలక్ నేను, నా ఇష్టం - నాగార్జున కామెడీ, ఆటపాటలతో హోరు