బిగ్ బాస్ సీజన్ 8 రోజులు గడుస్తున్న కొద్ది ఆసక్తికరంగా మారుతోంది. అందరూ ఊహించినట్టుగానే మొదటి వారం ఎలిమినేషన్లలో బెజవాడ బేబక్క హౌస్ నుంచి ఎవిక్ట్ అయ్యింది. ఆమెకు వంటింటి సెంటిమెంట్ దెబ్బ పడింది. ఇక సెకండ్ వీక్ మాత్రం ఊహించని విధంగా శేఖర్ బాషాను స్వయంగా హౌస్ హౌస్ మేట్స్ బయటకు పంపారు. బయటకు వచ్చాక తానే బిగ్ బాస్ ను రిక్వెస్ట్ చేసి వచ్చాను అని ఆయన బాంబ్ పేల్చిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన బిగ్ బాస్ 8 మూడవ వారం నామినేషన్స్ హౌస్ లో హీట్ పుట్టించాయి. మరి ఈ వీక్ నామినేషన్ లిస్ట్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరో, ఎవరికి ఎక్కువ రిస్క్ ఉందో ఓ లుక్కేద్దాం పదండి.
నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే...
ఎప్పటిలా కాకుండా బిగ్ బాస్ ఈ మూడవ వారం నామినేషన్ల కోసం చెత్తను ఉపయోగించి షాక్ ఇచ్చారు. మొదటి వారం ప్రేరణ చెత్త బుట్టలో నుంచి బాటిల్ తీసి పక్కన పెట్టింది అనేది ఎంత పెద్ద ఇష్యూ అయిందో తెలిసిందే. కానీ ఇప్పుడు బిగ్ బాస్ ఏకంగా చెత్త బుట్టలో ఉన్న చెత్తను తలపై పోసి నామినేట్ చేయాలని చెప్పారు. ఇక ఆయన చెప్పినట్టుగానే హౌస్ మేట్స్ తాము నామినేట్ చేస్తున్న కంటెస్టెంట్స్ తలపై చెత్తను పోస్తూ రీజన్స్ చెప్పారు. తాజా ఎపిసోడ్ ప్రకారం పృథ్వీని సీత, యష్మి గౌడ.. విష్ణు ప్రియ ప్రేరణను నామినేట్ చేయగా... సోనియా నైనికను, యష్మిని నామినేట్ చేసింది. యష్మి.. నాగ మణికంఠను, నైనికను నామినేట్ చేయగా, ప్రేరణ విష్ణు ప్రియను నామినేట్ చేసింది. అయితే చీఫ్ గా ఉన్న నిఖిల్ లలో ఎవరు నామినేట్ కావాలో తేల్చుకోమన్నారు బిగ్ బాస్. నిఖిల్ అప్పటికే మూడు సార్లు చీఫ్ అయ్యాడనే రీజన్ తో, తాను నామినేషన్ నుంచి బయట పడగలననే నమ్మకంతో పాటు తన స్ట్రెంత్ ఎంతో తెలుసుకోవడానికి అభయ్ సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. మొత్తానికి మూడవ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన సభ్యుల లిస్టులో యష్మి గౌడ, ప్రేరణ కంబం, కిరాక్ సీత, పృథ్వీ రాజ్, విష్ణు ప్రియ, నైనిక, అభయ్ నవీన్, నాగ మణికంఠ ఉన్నారు.
ఎవరు రిస్క్ లో ఉన్నట్టు?
బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్స్ అందరికీ ఓటింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే ఓటింగ్ మాత్రమే కాదు హౌస్ లో కో కంటెస్టెంట్స్ తో ఎలా ఉంటున్నారు అనేది కూడా చాలా ముఖ్యం అనే విషయాన్ని బిగ్ బాస్ వీకెండ్ లో ప్రూవ్ చేశారు. ఏకంగా కంటెస్టెంట్స్ చేతికే హౌస్ లో నుంచి ఒకరిని బయటకు పంపించే అధికారాన్ని ఇచ్చి శేఖర్ బాషాను బయటకు పంపారు. అయితే ఈ వారం నామినేషన్ల లిస్ట్ చూసుకుంటే రిస్క్ లో ఉండేది నైనిక, పృథ్వీ అని చెప్పొచ్చు. నిజానికి పృథ్వీకి గత వారమే అతి తక్కువగా ఓట్లు వచ్చాయి. ఇక ఇప్పుడున్న నామినేషన్ల లిస్టు చూసుకుంటే అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్సే ఉన్నారు. అందరితో పోలిస్తే పృథ్వీరాజ్, నైనిక రిస్క్ లో పడ్డట్టే. మరి ఈ వారం ఎలిమినేషన్లలో నాగార్జున ఎలాంటి ట్విస్ట్ ఇస్తారు? వీరిలో హౌస్ నుంచి బయటకు వెళ్ళేది ఎవరు? అనే విషయం తెలియాలంటే ఓటింగ్ రిజల్ట్స్ తో పాటు వీకెండ్ ఎపిసోడ్ వచ్చేదాకా వెయిట్ అండ్ సీ.