Bigg Boss 6 Telugu: మరొక్క మూడు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు విన్నర్ ఎవరో తెలిసిపోతారు. ప్రస్తుతం పన్నెండో వారానికి చేరుకుంది సీజన్. డిసెంబర్లో సీజన్ ముగుస్తుంది. అయితే ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ మొదలైంది. ఇందులో ఒక్కొక్కరుగా ఇంటి సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్ అడుగుపెడుతున్నారు. మొదటగా ఆదిరెడ్డి ఫ్యామిలీ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భార్య కవిత, కూతురు హద్విత వచ్చారు. మధ్యలో కామెడీ టాస్కులు కూడా ఇస్తున్నారు బిగ్ బాస్. ఫైమా ఇంగ్లిషు టీచర్‌గా నవ్వించింది. ఇక శ్రీసత్య గ్లామరస్ టీచరమ్మగా కనిపించింది. ఆమె మేకప్ గురించి క్లాసు తీసుకుంటూ కనిపించింది. 


ప్రోమోలో ఉన్న ప్రకారం శ్రీసత్య మేకప్ కిట్ పట్టుకుని క్లాసుకు వచ్చింది. ఎవరికైనా మేకప్ అంటే ఏమిటో తెలుసా అని అడిగింది. దానికి రేవంత్ ‘మేకును అప్‌లో కొడితే మేకప్’ అని చెప్పాడు. అలాగే రాజ్ ‘ఇదిగో కప్పు, ఇందులో మేకు వేస్తే మేకప్ అవుతుంది’ అన్నాడు. దానికి అందరూ నవ్వారు. ఇక మేకప్ ప్రాక్టికల్స్ ఇవ్వడం మొదలుపెట్టింది శ్రీసత్య. శ్రీహాన్‌కు క్రీములు రాస్తూ కనిపించింది. 



రాజ్‌కి పండగే...
ఇక ఫ్యామిలీ వీక్‌లో భాగంగా రాజ శేఖర్ తల్లి ఇంట్లోకి అడుగుపెట్టారు. దీంతో ఆయన ఆనందం రెట్టింపైంది. తల్లిని కౌగిలించుకుని చాలా ఆనందపడ్డారు. ఇంటి సభ్యులంతా ఆమెతో కూర్చుని ఆనందంగా మాట్లాడారు. అందరూ బాగా ఆడుతున్నారంటూ ఆవిడ మెచ్చుకున్నారు.  






ఈ వారం నామినేషన్లు చాలా కూల్‌గా అయ్యాయి. కన్ఫెషన్ రూమ్‌లో నామినేషన్లు జరిగాయి. ఆ నామినేషన్లలో రేవంత్, కీర్తి తప్ప మిగతా అందరూ ఉన్నారు. ఈసారి ఇంటి నుంచి ఎవరు వెళతారో అంచనా వేసేస్తున్నారు  ప్రేక్షకులు. రాజ్ లేదా రోహిత్... వీరిద్దరిలో ఒకరు బయటికి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు భావిస్తున్నారు. రోహిత్‌కే ఎక్కువ ఛాన్సులు ఉన్నట్టు అంచనా.


Also read: ఆదిరెడ్డికి బిగ్‌బాస్ భారీ సర్‌ప్రైజ్, అతని భార్యా బిడ్డ ఎంట్రీ - మధ్యలో రేవంత్ కన్నీళ్లు