Bigg Boss 6 Telugu: కేవలం మూడు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 6 ముగిసిపోతోంది. ఇప్పటికీ ఈ సీజన్ పై పెద్దగా ఆసక్తి పెరగలేదు. ఎవరు విజేత అయినా కూడా ప్రేక్షకులు పట్టించుకునేట్టు కనిపించడం లేదు. కారణం ఈ సీజన్ ఎవరికీ నచ్చకపోవడమే. ప్రస్తుతం ఇంట్లో తొమ్మిది మంది సభ్యులు మిగిలారు. వారిలో ఆరుగురు టాప్ 6కి చేరే అవకాశం ఉంది. మిగతా ముగ్గురిని మధ్యలో ఎలిమినేట్ చేయచ్చు. ఒకవేళ టాప్ 5ని ఫైనల్ కి తీసుకెళ్లాలనుకుంటే మధ్యలో నలుగురిని ఎలిమినేట్ చేయచ్చు. ఇక టైటిల్ ఫేవరేట్ గా ఉన్నది మొదట్నుంచి రేవంత్ అనే చెప్పాలి. మధ్యలో ఆదిరెడ్డి, శ్రీహాన్ పేరు వినిపించినప్పటికీ శ్రీసత్యతో కలిసి శ్రీహాన్, గీతూ వల్ల ఆదిరెడ్డి నచ్చుకుండా పోయారు. అలాగే ఆదిరెడ్డి అతి విశ్వాసం కూడా ఓవర్‌గా అనిపించింది.
ఇక ఈ ప్రోమోలో ఏం ఉందంటే... ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రశ్నలకు జవాబులు ఇమ్మని అడిగాడు బిగ్ బాస్. అందులో కీర్తిని సింపథీ గేమ్ గురించి అడిగారు. ఆమె సింపథీతో రెండు మూడు వారాలు ఉండొచ్చు కానీ, ఎక్కువ వారాలు ఉండమని చెప్పింది. ఇక రాజ్‌ను ‘మీ వెనుక ఎవరు మీ గురించి మాట్లాడుతారని అనుకుంటున్నారు’ అని అడిగారు. దానికి రాజ్ ‘ఇనాయ చేస్తుందేమో’ అన్నాడు. దానికి ఇనాయ చాలా బాధపడి ఏడ్చేసింది. ఇనాయ పేరు చెప్పగానే మిగతా ఇంటిసభ్యులు నవ్వుకున్నారు. ఇక శ్రీసత్య అయితే తెగ ఓవరాక్షన్ చేసింది. కానీ ప్రశ్నలు కాస్త పదునుగా ఉండే బావుండును అనిపించింది. ఈ ఇంటి సభ్యులకు చాలా గట్టి ప్రశ్నలే అడగాలి. అప్పుడు కాస్త ఎపిసోడ్ రక్తి కట్టేదేమో.
ఇక ఇనాయను ఏ ప్రశ్నో అడిగారో తెలియదు కానీ ఆమె మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది. ‘ఇది నా జీవితం, నా రూల్స్, అందుకే అందరికీ అన్‌ప్రిడిక్టబుల్‌గా అనిపిస్తా’ అంది. ఇక రాత్రి పూట దయ్యాల్లా మారి కంటెంట్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించారు ఫైమా, శ్రీసత్య.
ఇక ఈ వారం నామినేషన్లలో రేవంత్, కీర్తి తప్ప మిగతా అందరూ ఉన్నట్టు తెలుస్తోంది. రేవంత్ కెప్టెన్ అయినందున ఎవరూ నామినేట్ చేయలేదు. ఇక కీర్తిని ఎందుకు నామినేట్ చేయలేదో మరి.
Also read: ఫుడ్ కోసం మళ్లీ గొడవ - కన్ఫెషన్ రూమ్‌లో నామినేషన్ ప్రక్రియ