Bigg Boss Telugu Season 7 : 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 7' త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ షోకు సంబంధించి రోజుకో అప్ డేట్ వైరల్ అవుతోంది. బిగ్ బాస్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు? ఈసారి అలరించబోయే సెలబ్రిటీలు ఎవరు తదితర అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి.

 

పాతవారికి అవకాశం ఉందా?

ఈ సీజన్‌లో గత ‘బిగ్ బాస్’ సీజన్స్‌లో పాల్గొన్న పాత కంటెస్టెంట్లను మళ్లీ తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. వారిలో ఆదర్శ్, మిత్ర, నోయల్ లాంటి వస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, అందులో ఏ మాత్రం వాస్తవం లేదని సమాచారం. ప్రస్తుతం ఈ సీజన్‌లో సురేఖా వాణి, ఆమె కూతురు, యూట్యూబర్ నిఖిల్, టీవీ 9 యాంకర్ ప్రత్యూష, దీపికా పిళ్లై, వర్షిణి, సీనియర్ ఉదయ్ భాను ఎంట్రీ ఇవ్వనున్నారని తెలిసింది. అయితే, ఈ జాబితాపై సందేహాలు కూడా ఉన్నాయి.


వీళ్లు వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు


శ్వేతా నాయుడు, యాంకర్ ధనుష్ చాలా కాలంగా షోకు రావాలని ప్రయత్నిస్తున్నారు. బీబీ టీమ్ కూడా వారిని సంప్రదించినట్టు తెలుస్తోంది. శోభితా శెట్టి లాస్ట్ టైమే రావాల్సింది. సో ఈ సారి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జబర్దస్త్ షో నుంచి ఖచ్చితంగా ఒకరు వస్తారని టాక్. విదేశాల్లో ఉండి యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన ఓ మహిళ కంటెస్టంట్ కూడా ‘బిగ్ బాస్’లో పాల్గొనే అవకాశం ఉంది. ఇన్ స్టాలో రీల్స్, యూట్యూబ్ తో ఫేమస్ అయిన మరో లేడీ కంటెస్టంట్ పేరు కూడా వినిపిస్తోంది. టీవీ నటులు, దంపతులు అమర్ దీప్ చౌదరి, తేజస్విని గౌడ. లాస్ట్ సీజన్ లోనే వస్తున్నారని వైరల్ కాగా.. అప్పట్లో వారి పెళ్లి బిజీగా ఉన్నారని, అందుకే రాలేదని ప్రచారం జరిగింది. అలాగే ఇటీవల బాగా వైరల్‌ అవుతోన్న ఆట సందీప్, జ్యోతి జంట కూడా ఈ సీజన్‌లో కనిపించే అవకాశాలున్నాయి. అలాగే విడాకులు తీసుకున్న ఒక జంటను ‘బిగ్ బాస్’ హౌస్‌లో పెట్టి.. ఆసక్తి పెంచాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో తమిళ బిగ్ బాస్ షోలో ఇదే చేశారు. మరి, తెలుగులో ఆ జంట ఎవరనే ఆసక్తి నెలకొంది.


బిగ్ బాస్ లోగో ఎలా ఉందంటే..


ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ షో లోగోపై ఆడియెన్స్ కాస్త నిరాశకు గురైనట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రతి సారి ఇంట్రస్టింగ్ ను క్రియేట్ చేసేలా, తమ మార్క్ ను చూపించుకునేలా బిగ్ బాస్ లోగో ఉండేది. కానీ ఈసారి మాత్రం ఆర్ట్ ఫిల్మ్ టైటిల్ మాదిరిగా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. కానీ షో విషయంలో మాత్రం చాలా గ్రాండ్ గా ఉండనున్నట్టు తెలుస్తోంది. కాగా సెప్టెంబర్ 3వ తేది ఆదివారం నుంచి ఈ షో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.


Read Also : Thalapathy Vijay: స్పీడ్ పెంచిన దళపతి - విద్యారంగంపై విజయ్ ఫోకస్, 234 నియోజకవర్గాల్లో ఆ సంస్థల ఏర్పాటు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial