బిగ్ బాస్ 6 తెలుగు సీజన్ విన్నర్ ఎవరో తేలిపోవడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలింది. నేరుగా ఫైనల్ కి వెళ్ళే కంటెస్టెంట్ కోసం ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్ జరుగుతోంది. ఇప్పటికే ‘బిగ్ బాస్’ కొన్ని టాస్క్‌‌లు ఇచ్చాడు. వాటిలో అందరి కంటే ఆదిరెడ్డి 13 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ మళ్ళీ ఏకాభిప్రాయం నిర్ణయం పెట్టి గొడవలు పెట్టేశాడు.

  


తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ప్రకారం.. తదుపరి ఛాలెంజ్ లో కేవలం పోటి పడేందుకు ముగ్గురు సభ్యులు మాత్రమే ఉంటారని, ప్రస్తుతం ఉన్న ఐదుగురు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. అయితే పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో రోహిత్, ఫైమా ఉన్నారు. కానీ ఫైమా మాత్రం తర్వాత ఛాలెంజ్ లో ఆడాలని అనుకుంటున్నట్టు చెప్పింది. ఇక రేవంత్ కూడా తన నిర్ణయం చెప్పాడు. ఇప్పటికే ఒకసారి త్యాగం చేసి డౌన్ అయ్యాను. మరోసారి త్యాగం చేసేందుకు తాను సిద్ధంగా లేనని తేల్చి చెప్పేశాడు. నాలుగో పొజిషన్ నుంచి మూడో పొజిషన్ కి ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ వచ్చానని వెనక్కి వెళ్లాలని అనుకోవడం లేదని శ్రీహాన్ కూడా ఏకాభిప్రాయం నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. తక్కువ ఉన్న వాళ్ళని తదుపరి రౌండ్ లో ఆడేందుకు ఒప్పుకుంటే ఎలా అని ఆదిరెడ్డి కూడా తన అభిప్రాయం చెప్పాడు.


పోటీదారుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోయేసరికి శ్రీసత్య, ఇనయా, కీర్తి ముగ్గురు కలిసి ఒక నిర్ణయం తీసుకుని చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించాడు. రేవంత్, ఫైమా, రోహిత్ ని తదుపరి ఛాలెంజ్ కి ఎంపిక చెయ్యాలని అనుకుంటునట్లు ఇనయా చెప్పింది. ఇదేమి చివరి అవకాశం కాదని ఇంకా చివర ఉన్న వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలని ఇనయా చెప్పుకొచ్చింది. కానీ ఆ నిర్ణయానికి ఆదిరెడ్డి పూర్తిగా తప్పుబట్టాడు. లాస్ట్ లో ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తే ఎలా అని శ్రీహాన్.. శ్రీసత్య మీద గట్టిగా అరిచాడు. లాస్ట్ లో ఉన్న వాళ్ళు ఆడకపోతే నెక్స్ట్ ఛాలెంజ్ కూడా వెస్ట్ కదా అని ఇనయా వాదిస్తుంటే రేవంత్ కూడా ఒప్పుకోడు. "వరస్ట్ డెసిషన్ ఆఫ్ ది సీజన్" అని ఆదిరెడ్డి అన్నాడు.


రోహిత్ అయితే తనంతట తానే పోటి నుంచి తప్పుకుంటునట్టు చెప్పేశాడు. "గేమ్ ఆడనని చెప్తున్నావా" అని ఇనయా అడిగేసరికి "ఆడాలని ఉంది. కానీ, అది ఫెయిర్ గా ఉండదు. అలా ఆడితే పాయింట్లు ఎక్కువ ఉన్న వారికి ఆన్ ఫెయిర్ అయిపోతుంది" అని నిజాయితీగా మాట్లాడాడు.


Also read: టిక్కెట్ టు ఫినాలే రేసులో కీర్తికి కోపం - కాలితో తన్నిన కార్తీక దీపం బ్యూటీ