Bigg Boss 6 Telugu: ముందుగా ఊహించినట్టే చలాకీ చంటినే ఈ వారం ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఫైమా బాగా ఏడ్చింది. ఇక ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...


మ్యూజిక్ మాంత్రికుడు దేవిశ్రీ ప్రసాద్ పాటలతో హోరెత్తించారు. అంతే కాదు ఒక పాప్ సాంగ్ కూడా వేదికపైనే రిలీజ్ చేశారు. ‘ఓ..పిల్లా’ అనే సాంగ్ చూడడానికి, వినడానికీ కూడా బావుంది. తరువాత ఇంటి సభ్యులతో ఒక పాటల గేమ్ ఆడించారు. అందులో గెలిచిన టీమ్‌కు ‘బిగ్ బాస్ బహుమతి’ అందింది. తరువాత నామినేట్ అయిన సభ్యుల నుంచి వాసంతి సేఫ్ అయినట్టు చెప్పారు. 


సామెతల ఆట
వాడుకలో ఉన్న సామెతల ట్యాగ్‌లను తెచ్చారు. ఆ సామెతలకు తగ్గ వారిని ఎంపిక చేసి వారి మెడలో వేయమని చెప్పారు నాగార్జున. ఫైమా ‘ఏమిరా పడ్డావు అంటే అదో పల్టీలే అన్నాడంట’ అనే సామెతను తీసుకుని రాజశేఖర్ మెడలో వేసింది. తరువాత బాలాదిత్య ‘అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరి ఎగిరి పడుతుంది’ అనే సామెతను రోహిత్ మెడలో వేశాడు. అతనిలో చాలా శక్తి అయినా కామ్‌గా ఉంటాడని రీజన్ చెప్పాడు బాలాదిత్య. అతను అన్నీ ఉన్నా ఆకు అని అన్నాడు. తరువాత ఆదిరెడ్డి ‘పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది’ అనే సామెతను బాలాదిత్య మెడలో వేశాడు. అతను మంచి వాడని, అందుకే ఆయనకు అందరూ మంచివాళ్లలా కనిపిస్తారని అన్నాడు. ఇక ఇనయా ‘అగ్నికి ఆజ్యం పోయడం’ అనే సామెతను గీతూ మెడలో వేసింది. రోహిత్ ‘ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి’ అనే సామెతను గీతూ మెడలో వేశాడు. తనకు సంబంధం లేకపోయినా గొడవల్లో దూరి హడావుడి చేస్తుందని చెప్పాడు. 


నామినేషన్లో మిగిలిన నలుగురు సభ్యులు చంటి, ఇనయా, మెరీనా, అర్జున్ నిలుచున్నారు. వారికి నాలుగు లాలీపాప్స్ ఇచ్చారు. వారిలో అందులో గ్రీన్ కలర్ లాలీపాప్ వచ్చిన మెరీనా సేఫ్ అయినట్టు చెప్పారు నాగార్జున. తరువాత అర్జున్‌ను కూడా సేఫ్ చేశారు. చివరగా ఇనయా, చంటి మిగిలిపోయారు. 


ఇనయా - సూర్య
ఇనయా, చంటి చివరికి మిగిలే సరికి ఫైమా ఏడ్చింది. ఆ ఇద్దరూ తనకు దగ్గర వారేనని, ఎవరు వెళ్లినా బాధపడతానని చెప్పింది. ఇక సూర్య కూడా ఏడుపు మొదలుపెట్టాడు. తనకు దగ్గరైన వాళ్లంతా వెళ్లిపోతారని అన్నాడు. లాండ్రీ రూమ్‌కు వెళ్లి గోడలను పిడికిలితో గుద్దాడు. ఇనయా వెళ్లి ఓదార్చింది. ఇద్దరూ టైట్ హగ్ ఇచ్చుకుని ఎమోషనల్ అయ్యారు. వా


చంటి ఔట్
ఇక ఇనయా, చంటిలకు రెండు డబ్బాలు ఇచ్చి చేతులు పెట్టమన్నారు. చేయి బయటికి తీసేసరికి ఇనయా చేయి గ్రీన్‌గా ఉంది. చంటి చేయి రెడ్ అయింది. దీంతో అతను ఎలిమినేట్ అయ్యాడు.   


Also read: రేవంత్‌కు వాసంతి అంటే ఇంట్రెస్ట్ - లాలీపాప్ కోసం గీతూ చెత్త గేమ్



Also read: చలాకీ చంటి షాకింగ్ నిర్ణయం, సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకుని బిగ్‌‌బాస్ నుంచి బయటికి వచ్చేసిన కమెడియన్?