Bigg Boss 6 Telugu: సోమవారం నామినేషన్లు పూర్తయ్యాక ఆ తరువాత ఇంటి సభ్యుల రియాక్షన్‌ను మంగళవారం ఎపిసోడ్‌లో చూపించారు. ముఖ్యంగా కీర్తి - శ్రీసత్య ముందు చాలా సేపు వాదించుకున్నారు. పాత విషయాలన్నీ తీసి శ్రీసత్య కీర్తిని అడిగింది. శ్రీసత్యకు కీర్తి ఆదివారం ఎపిసోడో ‘ఇగో’ అనే ట్యాగ్ ఇచ్చింది. ఆ విషయంపై శ్రీసత్య కీర్తిని నామినేట్ చేసింది. దాని గురించి ఇద్దరి మధ్య గొడవ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా శ్రీసత్య కీర్తిని ఇమిటేట్ చేసింది. గెంతుకుంటూ నటించి చూపించింది. దానికి కీర్తి చాలా ఫీలైయింది. ‘ఈ వెటకారం తగ్గించుకో’ అని చెప్పింది. ‘నీ నుంచి ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు’ అంటూ చాలా బాధపడింది కీర్తి. 


ఇక కొత్త గేమ్‌ని ఇచ్చారు బిగ్ బాస్. ఈ వారం నామినేషన్లో ఫైమా తప్ప మిగతా తొమ్మిదిమంది ఉన్నారు. వారికి బిగ్‌బాస్ కొత్త గేమ్ ఇచ్చారు. నామినేషన్లో ఉన్న వారు ఈ వారం సేవ్ అయ్యేందుకు ఒక ఛాన్సు ఇచ్చారు. ఇందులో భాగంగా నామినేట్ అయిన సభ్యులకు ఖాళీ చెక్‌లు ఇచ్చారు. ఆ చెక్ లపై కొంత ఎమౌంట్ వేయాలని చెప్పారు. ఎవరైతే ఎక్కువ ఎమౌంట్ వేస్తారో వారు సేవ్ అవుతారని చెప్పారు. అయితే ఆ మొత్తం విన్నింగ్ ప్రైజ్ అయినా యాభై లక్షల నుంచి కట్ అవుతుందని చెప్పారు. 


స్నేహితుల మధ్య గొడవ
ఏమైందో కానీ రేవంత్, శ్రీహాన్ మధ్య దూరం పెరిగింది. వారిద్దరూ ఫుడ్ విషయంలో వాదించుకున్నారు. ఆ వాదనలో వ్యక్తిగతంగా మారింది. ఎప్పుడు నువ్విలాగే చేస్తావంటూ శ్రీహాన్ అనగానే, నేను కూడా నీలోని తప్పులు ఎంచగలను అన్నాడు రేవంత్. వారిద్దరి వాదన తరువాత శ్రీహాన్ వెళ్లి శ్రీసత్య దగ్గర కూర్చుని మాట్లాడాడు. రేవంత్ నన్ను నామినేట్ చేద్దామనుకున్నాడంట, ఆదిరెడ్డి అదే పాయింట్‌తో చేయడంతో నేను చేయలేదు అంటున్నాడు అని చెప్పుకున్నాడు. 


ఆదిరెడ్డి ఓవరాక్షన్
కామన్ మ్యాన్‌గా వచ్చాడన్న సానుభూతితో ఆదిరెడ్డికి ఎక్కువమంది సపోర్ట్ చేస్తున్నారు. నిజానికి ఆయన ఇంట్లో పెద్ద ఆడిందేమీ లేదు. ఎంటర్టైన్ చేసింది కూడా లేదు.అయినా ఆయనకు ఓట్లు పడుతున్నాయి. ఆయన చేసే వెటకారం కూడా తక్కువేమీ కాదు. ముఖ్యంగా ఇనాయను అవమానించిన వారిలో ఇతను ఉన్నాడు. అయితే చెక్ పై డబ్బులు రాయమన్నప్పుడు మాత్రం ‘నేనే విన్నర్, నా డబ్బులోంచి నేను కట్ చేసుకోవడం ఏంటి? ఎవరైతే ఎక్కువ ఎమౌంట్ రాస్తే వారు ఈ ఇంట్లో ఉండడానికి అర్హత లేదని అర్థం’ అంటూ లెక్చర్ ఇచ్చాడు.   


శ్రీహాన్ - 1,00,000
ఆదిరెడ్డి - 1,00,000
శ్రీసత్య - 4,99,999
రోహిత్ - 2,51,000
కీర్తి - 4,99,999
రాజ్ - 5,99,700
రేవంత్ - 4,99,999
మెరీనా -  4,99,998
ఇనాయ - 4,99,998


శ్రీసత్య షాక్
చెక్ మీద రాసిన మొత్తం ఎవరికీ చెప్పొద్దని బిగ్ బాస్ ముందే చెప్పారు. అయితే శ్రీ సత్య తన స్నేహితుడు శ్రీహాన్‌కు నేరుగా కాకుండా కోడ్ భాషలో మొత్తాన్ని చెప్పింది. తను కట్టుకున్న చీరతో పోల్చి ఎంత మొత్తం రాసింది చెప్పేసింది. 


రాజ్ సేఫ్
ఇంటి సభ్యుల్లో శ్రీసత్య, కీర్తి, రేవంత్ ఒకే ఎమౌంట్ రాయడంతో రిజెక్ట్ చేశారు. అలాగే ఇనాయ, మెరీనా కూడా ఒకే ఎమౌంట్ రాయడంతో వాటిని రిజెక్ట్ చేశారు. శ్రీహాన్, ఆదిరెడ్డి కూడా ఒకే ఎమౌంట్ రాయడంతో వారిద్దరివి కూడా రిజెక్ట్ చేశారు. చివరికి రాజ్ అధికంగా రాయడంతో అతనికి సేవ్ అయ్యే అవకాశాన్ని ఇచ్చారు. ఈ వారం రాజ్ ఇమ్యూనిటీ పొందాడు.  ఈ ఇమ్యూనిటీని రాజ్ పొందాక విన్నింగ్ ప్రైజ్ 45,00,000 లక్షల రూపాయలకు తగ్గింది. 


Also read: అరుపులు, కేకలు లేకుండా సాఫీగా సాగిన నామినేషన్ ప్రకియ, ఈసారి నామినేషన్లో ఉన్నది వీళ్లే