Bigg Boss 6 Telugu: కార్తీక దీపంలో చాలా సాఫ్ట్ గా కనిపించే అమ్మాయి హిమ. హిమ పాత్రలో కీర్తి భట్ ఒదిగిపోయింది. ఆమె జీవితంలో ఎన్నో విషాదాలు. అందులో అంతులేని విషాదం తను పెంచుకున్న పాప చనిపోవడం. ఆ పాప గురించి గతంలో ఓ ఇంటర్య్వూలో చెప్పింది. ఆమె ఎక్కడ దొరికింది? ఎలా పెంచిందో వివరించింది. 


కీర్తి భట్ ఫ్యామిలీ కారు యాక్సిడెంట్లో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈమె ఒక్కతే బతికింది. అది కూడా కొన్ని రోజుల పాటూ కోమాలో ఉండి బయటికి వచ్చింది. బంధువులు సరిగా చూడక ఇంట్లోంచి బయటికి వచ్చి, తినేందుకు ఫుడ్ కూడా లేక చాలా బాధలు పడింది. ఇప్పుడు స్వశక్తితో సీరియల్ హీరోయిన్ గా నిలబడింది. అయితే ఆమె బిగ్‌బాస్‌లో తన జీవితం గురించి అప్పుడప్పుడు పంచుకునేది. ఓసారి తను పెంచుకున్న పాప గురించి చెప్పి కన్నీరు పెట్టుకుంది. ఆ పాప చనిపోయిందని ఎంతో బాధపడింది. బిగ్‌బాస్‌కు రావడానికి ముందు ఆమె కొన్ని ఇంటర్య్వూలు ఇచ్చింది. వాటిలో తన పాప గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకుంది. ఆ విశేషాలు మీకోసం. 


కీర్తి భట్ తన పుట్టినరోజున అనాథాశ్రమాలకు వెళ్లి స్వీట్లు, దుస్తులు పంచడం వంటివి చేస్తుంది. కర్ణాటకలోని కెంగేరి ఘటి అనే ప్రాంతానికి వెళ్లింది. అక్కడ అనాధాశ్రమం వారు, కొంతమంది ప్రజలు గుమిగూడి ఉన్నారు. ఒకరి చేతిలో నెల రోజుల పాప ఉంది. ఆ పాపను అక్కడ ఎవరో వదిలేశారు అని మాట్లాడుకోవడం కీర్తికి తెలిసింది. అనాధాశ్రమం వారు అయిదేళ్ల వయసు దాటిన వారినే పెంచుతారు. దీంతో ఆ నెల రోజుప పాపను ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నారు. ఆ సమయంలో కీర్తి ఆ పని తాను పెంచుకుంటానని అడిగింది. స్థానిక అధికారులంతా వచ్చి ఆ పాపను ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ఒంటరిగా ఉండే తాను ఆ పాపను ఎలా పెంచాలో తెలియక. అదే అనాధాశ్రమంలో ఒక గదిని, ఒక ఆయాను పాపకు పెట్టి ఖర్చులన్నీ తానే భరిస్తానని పాపను పెంచమని చెప్పింది. అలా పాప నాలుగేళ్లు పెరిగింది. ఆ పాప పేరు తనూ భట్. 


ఆరోగ్య సమస్య ఇదే...
పాప చాలా క్యూట్‌గా ఉండేది. గతేడాది ఆ పాపకి ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. శ్వాస సరిగా ఆడకపోవడం ఎక్కువైంది. గాలి గొట్టానికి చిన్న రంధ్రం పడడంతో ఇబ్బంది పడింది పాప.  దానికి ఆపరేషన్ కూడా చేయించారు. కొన్ని నెలల బాగానే ఉన్నప్పటికీ మళ్లీ అదే సమస్య వచ్చింది. దీంతో బిగ్ బాస్‌కు రావడానికి ముందే ఆమెను ఆపరేషన్లో జాయిన్ చేసింది కీర్తి. అయినా ఆరోగ్యం బాగవ్వలేదు. దీంతో సరిగా కీర్తి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లడానికి ముందు పాప ఆసుపత్రిలోనే చనిపోయింది. ఆ పాపే తన కుటుంబం అనుకున్నానని, తను చనిపోవడంలో చాలా బాధపడ్డానని చెప్పింది కీర్తి. అంతేకాదు బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లాక కచ్చితంగా మరో పాపని దత్తత తీసుకుంటానని కూడా బిగ్ బాస్ ఇంట్లోనే చెప్పింది కీర్తి భట్. 


Also read: కొత్త కెప్టెన్ రేవంత్, నీ వెనుక నేను తిరగాలా అంటూ అర్జున్‌తో వాసంతి ముచ్చట్లు


Also read: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఎలక్షన్స్, సూర్యకు హ్యాండిచ్చిన ఇనయా - యాంగ్రీ మ్యాన్ కి కెప్టెన్సీ?