Bigg Boss 9 Contestants Final List: అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సస్పెన్స్‌కు తెరపడింది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా ది ఫేమస్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆదివారం గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈసారి హౌస్‌లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ఎంట్రీ ఇవ్వడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా తమ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లతో అదరగొట్టి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
హౌస్‌లో ఫైనల్‌గా 15 మంది కంటెస్టెంట్స్
ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. వీరిలో 9 మంది సెలబ్రిటీస్ కాగా... మిగిలిన ఆరుగురు సామాన్యులు. తొలుత 14 మందినే ఫైనల్ చేయగా... ఆ తర్వాత అగ్నిపరీక్ష జ్యూరీ రిక్వెస్ట్‌తో మరో కామనర్‌కు ఎంట్రీ ఇస్తూ నాగార్జున డెసిషన్ తీసుకున్నారు. ఇది ఆడియన్స్‌కే కాకుండా వారికి కూడా సర్‌ప్రైజ్‌గా మారింది.
9 మంది సెలబ్రిటీస్ వీళ్లే
- బిగ్ బాస్ 9 హౌస్‌లోకి మొత్తం 9 మంది సెలబ్రిటీస్ ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ సెలబ్రిటీగా సీరియల్ నటి తనూజ ఎంట్రీ ఇచ్చారు. కన్నడలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత 'ముద్ద మందారం' సీరియల్‌తో పాపులర్ అయ్యారు.
- రెండో సెలబ్రిటీగా 'లక్స్ పాప' సాంగ్ ఫేం ఫ్లోరా షైనీ ఎంటర్ అయ్యారు. తనదైన జోష్‌తో డ్యాన్స్ చేసి అదరగొట్టారు. నరసింహనాయుడు, నువ్వు నాకు నచ్చావ్ మూవీస్‌లో తనదైన నటనతో మెప్పించారు.
- మూడో సెలబ్రిటీగా జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయెల్ ఎంట్రీ ఇచ్చారు. గుంటూరు నుంచి వచ్చిన ఆయన... 'పటాస్' షో ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుని... ఆ తర్వాత జబర్దస్త్ కమెడియన్‌గా తనదైన కామెడీ టైమింగ్, పంచులతో అదరగొట్టారు. హౌస్‌లోకి ఎంటర్ అవుతూనే తన పేరు చాలా కాలం గుర్తుంటుందంటూ చెప్పారు.
- ఆ తర్వాత ఫేమస్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 'మనమే' మూవీలో శర్వానంద్ పాటకు, రీసెంట్‌గా 'పుష్ప 2' సాంగ్‌కు కొరియోగ్రఫీ చేసినట్లు చెప్పారు. 'ఢీ'షో ద్వారా పరిచయమైన శ్రష్టి జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేశారు. తనను లైంగికంగా వేధించారంటూ ఆయనపై ఆరోపణలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది.
- ఐదో సెలబ్రిటీగా సీరియల్ యాక్టర్ భరణి ఎంట్రీ ఇచ్చారు. 'చిలసౌ స్రవంతి' సీరియల్‌తో ఫేమ్ సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత పలు సీరియళ్లలో విలన్‌గా చేశారు. సీక్రెట్ బాక్స్‌తో ఎంటర్ అవుతుండగా బిగ్ బాస్ ముందు అనుమతించలేదు. ఆ తర్వాత ఆయన్ను అలౌ చేశారు.
- ఆరో సెలబ్రిటీగా ఫేమస్ టీవీ నటి రీతూ చౌదరి ఎంట్రీ ఇచ్చారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్‌గా పాపులర్ అయిన ఆమె ఆ తర్వాత టీవీ షోస్, సీరియళ్ల ద్వారా పాపులర్ అయ్యారు. తన అసలు పేరు దివ్య అని చెప్పారు.
- ఏడో సెలబ్రిటీగా 'బుజ్జిగాడు' మూవీ ఫేం సంజనా గల్రానీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినట్లు చెప్పారు.
- ఎనిమిదో సెలబ్రిటీగా 'రాను ముంబయికి రాను' ఫేం ఫోక్ డ్యాన్సర్ రాము రాథోడ్ ఎంట్రీ ఇచ్చారు. డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిన రాము... నాగార్జునపైనే పాట పాడి అలరించారు.
- తొమ్మిదో సెలబ్రిటీగా 'జయం' మూవీ ఫేం సుమన్ శెట్టి ఎంట్రీ ఇచ్చారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, భోజ్ పురి భాషల్లో దాదాపు వందల్లో సినిమాలు చేశారు. బిగ్ బాస్ తనకు సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పారు.
ఆరుగురు కామనర్స్
ఇక అగ్నిపరీక్ష ద్వారా బిగ్ పరీక్ష ఎదుర్కొన్న టాప్ 13లో ఆరుగురిని ఆడియన్స్ పోల్, జ్యూరీ డెసిషన్ ద్వారా హౌస్‌లోకి పంపించారు. ఆడియన్స్ పోల్ ద్వారా విజయనగరం నుంచి వచ్చిన పడాల కల్యాణ్, డీమాన్ పవన్, ప్రియా శెట్టి ఎంపికయ్యారు. జ్యూరీ ద్వారా మాస్క్ మ్యాన్ హరీష్, దమ్ము శ్రీజ, మర్యాద మనీష్ హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు.