‘బిగ్ బాస్’లో ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ సందడిగా కనిపిస్తోంది. ప్రస్తుతమైతే.. ఈ వారం అంతా టాస్కులతో బిజిబిజీ గడిపేశారు. అయితే, ఆదివారం నుంచి షాకులు మీద షాకులు తప్పకపోవచ్చు. ఎందుకంటే.. ఈ సారి ఎలిమినేట్ అవుతోంది కూడా లేడీ కంటెస్టెంటే. ఆమె మరెవ్వరో కూడా.. పూజా మూర్తి అని సమాచారం. అదే టైమ్‌లో.. రీఎంట్రీ కోసం హౌస్ మేట్స్ నుంచి తక్కువ ఓట్లు పొందిన కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి మళ్లోస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? రతిక రోజ్. 


బీబీ పోలింగ్‌లో ఆమే లాస్ట్


‘బిగ్ బాస్’ సీజన్-7ను ఫస్ట్ నుంచి చూస్తున్నవారికి రతిక రోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హౌస్‌లో పల్లవి ప్రశాంత్‌‌కు ఇచ్చిన షాకులు చూసి మీమర్స్ ఆమెకు ‘రాధిక’ (డీజే టిల్లులో హీరోయిన్ పాత్ర) అని బిరుదు ఇచ్చారు. పల్లవి ప్రశాంత్, శివాజీలను వ్యతిరేకించడం వల్ల హౌస్ బయట తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంది. చివరికి అది.. ఎలిమినేషన్‌కు దారి తీసింది. అయితే, ఇటీవల ‘బిగ్ బాస్’కు ఓ కొత్త ఆలోచన వచ్చింది. ఉల్టాపుల్టాలో భాగంగా హౌస్‌మేట్స్, ప్రేక్షకులకు షాకిచ్చేందుకు.. హౌస్ నుంచి బయటకు వెళ్లిన శుభశ్రీ, దామిని, రతికలకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా హౌస్ మేట్స్‌తో పోలింగ్ నిర్వహించాడు. 


రతిక రీఎంట్రీ కన్ఫార్మ్?


వాస్తవానికి ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో.. వారే విజేతలు అవుతారనే సంగతి మనకు తెలిసిందే. అయితే, ‘బిగ్ బాస్’ ఊహించని షాకిచ్చాడు. ఎక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్‌ను హౌస్‌లోకి పంపిస్తే.. ఓట్లు వేసిన హౌస్‌మేట్స్‌తో గొడవలు పెట్టుకోలేదు. పైగా వారికి సపోర్టుగా ఉంటుంది. అందుకే, కాస్త శాడిజం చూపించడం కోసం బిగ్ బాస్ టీమ్ కొత్తగా ఆలోచించింది. ఎక్కువ ఓట్లు వచ్చేవారు కాకుండా.. తక్కువ ఓట్లు వచ్చినవారిని హౌస్‌లోకి పంపాలని ప్లాన్ చేశారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. హౌస్‌మేట్స్ మెప్పు పొందినవారిలో శుభశ్రీ, దామిని ముందు వరుసలో ఉన్నారు. అతి తక్కువ ఓట్లతో రతిక చివరిలో ఉంది. దీంతో ఆమెకే హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ వారం రతిక హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి. 


సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటోందో.. 


హౌస్‌లో పల్లవి ప్రశాంత్‌కు బెస్ట్ బడ్డీగా ఎంపికైన రతిక.. మొదట్లో ప్రేక్షకులను మంచిగానే ఆకట్టుకుంది. పల్లవి ప్రశాంత్‌తో ఫ్రెండ్లీగా, క్లోజ్‌గా ఉన్న రతిక.. ఆ తర్వాత ట్రాక్ మార్చింది. పల్లవి ప్రశాంత్‌తో గొడవులు.. అతడిపై చేసిన వ్యాఖ్యలు ఆమెను విలన్ చేశాయి. రతిక కాస్తా.. రాధికగా మారిపోయిందంటూ మీమర్స్ కూడా ఆమెను ట్రోల్ చేశారు. మరే కంటెస్టెంట్‌కు రానంత నెగిటివిటీ రతికాకు వచ్చింది. దీంతో రతిక నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. ఇప్పుడు హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఆమె ఎలా ఉంటుందనే ఆసక్తి తప్పకుండా ప్రేక్షకుల్లో నెలకొటుంది. పైగా ప్రేక్షకులు బయట తన గురించి ఏమి అనుకుంటున్నారో కూడా తెలుసుకుని మరీ హౌస్‌లోకి ఎంట్రీకి ఇవ్వనుంది. మరి, ఈ సారి తనపై పడిన మచ్చను తొలగించుకొని.. మంచి కంటెస్టెంట్‌గా ప్రేక్షకుల మెప్పు పొందుతో లేదో చూడాలి. 


Also Read: నాగార్జున ముందే శోభా, భోలే మాటల యుద్ధం - క్షమాపణలు చెప్పిన ప్రియాంక