హించినట్లే ‘బిగ్ బాస్’ (Bigg Boss Telugu Season 7) హౌస్‌లోకి రతిక రీ-ఎంట్రీ ఇచ్చేసింది. కంటెస్టెంట్ల నుంచి అతి తక్కువ ఓట్లు సాధించడంతో బిగ్ బాస్.. తిరిగి హౌస్‌లోకి వచ్చింది రతిక. ఇప్పటికే బయట ఉండి అన్ని ఎపిసోడ్స్ చూసేసి.. తన మిస్టేక్స్‌పై ఒక అవగాహనకు వచ్చేసి ఉంటుంది. హౌస్‌లో అడుగు పెట్టగానే ఆమెలో అదే కనిపించింది. రాగానే ఆమె శివాజీని హత్తుకుంది. మిగతా ఇంటి సభ్యులను పెద్దగా పట్టించుకోలేదు. వెంటనే శివాజీ చేతులు పట్టుకుని లోపలికి తీసుకెళ్లిపోయింది. ఆ తర్వాత కాళ్లు పట్టుకొని శివాజీకి క్షమాపణలు చెప్పింది. 


పట్టించుకోని పల్లవి ప్రశాంత్


రతిక రోజ్ హౌస్‌లోకి వచ్చినా.. పల్లవి ప్రశాంత్ ఎలా స్పందిస్తాడని ప్రేక్షకులు ఎదురు చూశారు. అయితే, అతడు అస్సలు పట్టించుకోలేదు. ఆ తర్వాత హాల్‌లో రతిక అందరితో కలిసి మళ్లోచ్చా అని ప్రశాంత్‌ను చూసి పలకరించే ప్రయత్నం చేసింది. కానీ, రైతు బిడ్డ ఆమెను లైట్ తీసుకున్నాడు. ఆ తర్వాత రతిక రూమ్‌లో శివాజీ కాళ్లు పట్టుకుని.. క్షమాపణలు కోరింది. ‘‘నాకు తెలీదు చెప్పినావ్, ఇంకోసారి అలాంటివి చేయను. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఎలిమినేట్ కాగానే మాట్లాడలేకపోయా. ఏడుపు వచ్చేసింది. అదృష్టంగా భావిస్తున్నా’’ అని రతిక తెలిపింది. దీంతో శివాజీ స్పందిస్తూ.. ‘‘జాగ్రత్తగా ఆడు.. అందరితో మంచిగా ఉండు. ఇక్కడ పర్శనల్ ఏమీ లేదు’’ అని తెలిపాడు. అయితే, నామినేషన్లలో శివాజీ ఈ సారి ప్రియాంక, శోభాశెట్టిని టార్గెట్ చేసుకున్నారు. ఈ సారి నామినేషన్స్ ఎపిసోడ్ ఊహించని విధంగా ఉండే అవకాశాలున్నాయి.


హౌస్ నుంచి పూజా మూర్తి ఔట్ - రతిక ప్లాన్ ఇదేనా?


ఆదివారం ఎపిసోడ్‌లో పూజా మూర్తి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. కేవలం రెండు వారాలు మాత్రమే ఇంట్లో ఉంది. అయితే ఇంట్లో నుంచి బయటకు వెళ్లినా.. తోటి కంటెస్టెంట్లపై పాజిటివ్‌గా మాట్లాడుతూ వెళ్లింది. ఆ తర్వాత నాగార్జున హౌస్‌మేట్స్‌కు దసరా కానుకగా హౌస్‌లో అతి తక్కువ ఓట్లు సాధించిన కంటెస్టెంట్‌గా రతికను పంపిస్తున్నట్లు నాగార్జున చెప్పారు. ఇప్పుడు రతిక తన సెకండ్ ఛాన్సు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి. ఒక రకంగా ఇది ఆమెకు అగ్నిపరీక్ష లాంటిదే. ముఖ్యంగా ప్రతి నామినేషన్‌లో ఆమెను హౌస్‌మేట్స్ టార్గెట్ చేసుకొనే అవకాశం ఉంది. అలాగే.. తక్కువ ఓటింగ్‌తో హౌస్ నుంచి బయటకు పంపేసిన ప్రేక్షకులను మెప్పించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే, హౌస్‌లోకి రాగానే శివాజీ కాళ్లను పట్టుకోగానే ప్రేక్షకులకు విషయం అర్థమైపోయింది. ఇకపై శివాజీ గ్రూపుతోనే ఉంటూ వాళ్ల ఫాలోవర్ల మెప్పును కూడా పొందుతూ సేఫ్ గేమ్ ఆడేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. మరి, ప్రేక్షకులు ఏం చేస్తారో చూడాలి. శివాజీకి బయట ఉన్న ఫాలోయింగ్ తెలిసిన భోలే షావలి, అర్జున్, అశ్వినీ శ్రీ ఇప్పటికే ఆయనతో జాగ్రత్తగా ఉంటున్నారు. ఇప్పుడు వారి జాబితాలో రతిక కూడా చేరనుంది. మరి శివాజీ సపోర్టర్స్ ఏం చేస్తారో చూడాలి.


Also Read: బిగ్ బాస్ హౌస్​లో గ్రాండ్​గా దసరా సెలెబ్రేషన్స్ - చివర్లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన హోస్ట్ అక్కినేని నాగార్జున!