Bigg Boss Telugu Season 10 Annoncement Video : ఫేమస్ రియాలిటీ షో బిగ్ బాస్ సరికొత్త సీజన్ వచ్చేస్తోంది. ఈసారి మరిన్ని హంగులతో తెలుగు సీజన్ 10 రెడీ అవుతోంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా న్యూ సీజన్ అనౌన్స్ చేశారు.
ఆటే సవాల్
'బిగ్ బాస్... ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు. ఎంతోమంది హృదయాలు గెలుచుకున్న మహా సామ్రాజ్యం.' అంటూ నాగ్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్‌తో ప్రారంభమయ్యే వీడియో ట్రెడిషనల్ ఇంటి లుక్‌తో పాటు మాస్ డ్యాన్సులతో ఎంటర్టైన్ చేసింది. స్పెషల్ సాంగ్ ట్రెండ్ అవుతోంది. 'ఆటలో సవాల్ కాదు... ఈసారి ఆటే సవాల్' అనే క్యాప్షన్‌తో గత 9 సీజన్ల కంటే ఈ సీజన్ మరింత రసవత్తరంగా ఉండబోతోందంటూ హింట్ ఇచ్చారు నాగార్జున.
సామాన్యులకు ఎంట్రీ?
గత సీజన్ మాత్రం వెరీ స్పెషల్. ఫస్ట్ టైం అగ్ని పరీక్ష కాంటెస్ట్ ద్వారా సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా బిగ్ బాస్ హౌస్‌లో చోటు కల్పించారు. అన్నీ సవాళ్లు దాటుకుని ఆరుగురు హౌస్‌లోకి అడుగుపెట్టారు. తమ టాలెంట్, మైండ్ గేమ్‌తో సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇచ్చారు. విన్నర్‌గా కామనర్ పడాల కల్యాణ్ నిలిచాడు. ఫస్ట్ టైం ఓ కామనర్ బిగ్ బాస్ విన్నర్ కావడం విశేషం.
మరి ఈసారి కూడా సామాన్యులకు ఛాన్స్ ఇస్తారా? లేదా కేవలం సెలబ్రిటీల వరకే ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ 10 కంటెస్టెంట్స్ ఎవరు? షో ఎప్పుడు ప్రారంభం అవుతుంది? వీటన్నింటికీ మరికొద్ది రోజుల్లో ఆన్సర్ దొరకనుంది.
Also Read : Raghava Lawrence : పాలిటిక్స్‌లోకి రాఘవ లారెన్స్ - విజయ్ టీవీకే పార్టీ తరఫున పోటీ?
