బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లో మొదటివారంలో హౌస్ నుంచి ముమైత్ ఎలిమినేట్ కాగా.. రెండోవారం ఎలిమినేషన్ లో శ్రీరాపాక బయటకొచ్చేసింది. ఇక మూడో వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి పన్నెండు మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వారెవరంటే.. మిత్రా, శివ, చైతు, తేజస్వి, అజయ్, స్రవంతి, అఖిల్, మహేష్, హమీద, నటరాజ్, అరియానా, బిందు. ఇందులో తేజస్వి, బిందు, అజయ్, స్రవంతి మొదటిసారి నామినేషన్స్ లోకి వచ్చారు. అయితే ఈ వారం ఊహించని ఎలిమినేషన్ జరగబోతుందని సమాచారం. 


నిజానికి అజయ్(Ajay), స్రవంతి(Sravanthi)లలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు. స్రవంతి ఇప్పటివరకు తన గేమ్ ని మొదలుపెట్టలేదు. ఎంతసేపు అఖిల్, అజయ్ లతో కూర్చొని ముచ్చట్లు మాత్రమే పెడుతుంది. దీంతో ఈ వారం ఆమె బయటకు వచ్చేయడం గ్యారెంటీ అనుకున్నారంతా. కానీ ఇప్పుడు ఆర్జే చైతు(RJ Chaitu) ఎలిమినేట్ అవ్వబోతున్నారని సమాచారం. మొదటి నుంచి చైతు కాస్త అతి చేస్తున్నాడని.. తనకు సంబంధం లేని విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నాడని చాలా మంది తిట్టుకుంటున్నారు. 


సంచాలక్ గా వ్యవహరించిన సమయంలో అతడి బిహేవియర్ చాలా మందిని చికాకు పెట్టింది. ఈ వారం అతడు కెప్టెన్ అయ్యాడు. దానికి కారణం అఖిల్ అనే చెప్పాలి. చైతు తరఫున గేమ్ ఆడి అతడు కెప్టెన్ అయ్యేలా చేశాడు అఖిల్. దీంతో చైతు కెప్టెన్ అయినప్పటికీ.. పేరు మాత్రం అఖిల్ కి వచ్చింది. అయితే అతడికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రమోషన్స్ కూడా బాగా చేస్తున్నారు. నిజానికి అతడికంటే హౌస్ లో వీక్ కంటెస్టెంట్స్ చాలా మంది ఉన్నారు. 


కానీ ఇప్పుడు ఆర్జే చైతుని ఎలిమినేట్ చేసి షాక్ ఇవ్వబోతున్నారు బిగ్ బాస్. అతడికి ఓట్లు ఎలా పడినా బిగ్ బాస్ కి అనవసరం. ఎందుకంటే ఓట్లు ఎక్కువ వచ్చినా.. బిగ్ బాస్ ఎలిమినేట్ చేయాలనుకుంటే చేసేస్తాడు. ఇలా చాలా సార్లు జరిగింది. ఇప్పుడు ఆర్జే చైతు విషయంలో కూడా ఇదే జరగబోతుంది. ఎన్నో ఆశలతో హౌస్ లోకి వచ్చిన ఆర్జే చైతు మూడో వారానికే తిరిగివెళ్లిపోవాల్సి వస్తుంది.