Bigg Boss 9 Telugu Day 7 Episode Promo Review: గొడవలు, క్లాస్ పీకడాలు, నిక్ నేమ్స్ ఇలా ఫస్ట్ వీక్ బిగ్ బాస్ హౌస్ చాలా రసవత్తరంగా సాగింది. ఓనర్స్‌గా కామనర్స్ ఓవైపు... టెనెెంట్స్‌గా సెలబ్రిటీలు మరోవైపు... స్ట్రిక్ట్ రూల్స్ అంటూ ఇబ్బంది పెడుతున్నారనే కంప్లైంట్స్ మధ్య హౌస్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ దశకు వచ్చేసింది. హౌస్ నుంచి ఫస్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేదే సస్పెన్స్‌గా మారింది.

Continues below advertisement

గుండు అంకుల్, పొటాటో ఫ్రై, ఫ్రీ బర్డ్ అనే పదాల గురించి దీని వల్ల హౌస్ మేట్స్ మధ్య వచ్చిన గొడవ గురించి హోస్ట్ నాగార్జున క్లాస్ పీకుతూనే వాటిని సరి చేశారు. ఇక మాస్క్ మ్యాన్ హరీష్ ఆటిట్యూడ్ నాగ్‌కే చిరాకు తెప్పించింది. 'రెడ్ ఫ్లవర్' అంటూ వాడిన పదానికి సమర్థించుకునే ప్రయత్నం చేయగా నాగ్ తిప్పికొట్టారు. 'తనూజ, ఇమ్మాన్యుయేల్, భరణి ఇలా ముగ్గురు ఆడాళ్లతో ఫైట్ చేశానని నాకిప్పుడు అర్థమైంది.' అంటూ హరీష్ అన్న వీడియోను చూపించగా ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆ తర్వాత సారీ చెప్పి 'నేను వెళ్లిపోతా' అన్నట్లు చెప్పాడు. 

ఫ్రూట్స్ కోసం గొడవ

Continues below advertisement

ఓనర్స్‌లో ఈక్వాలిటీ చూపించని వ్యక్తి ఎవరు? అంటూ నాగ్ ప్రశ్నించగా... మర్యాద మనీష్ పేరు వినిపిస్తుంది. నా హెల్త్ కండీషన్ బట్టి నాకు యాపిల్ కావాలని మనీష్‌ను అడిగినా ఫ్రూట్ ఇవ్వలేదని శ్రష్టి నాగ్‌కు కంప్లైంట్ చేయగా... 'ఆ రోజు మా రూంలో డిస్కస్ చేసి ఏ ఫ్రూట్స్ బయటకు వెళ్లవు.' అని నిర్ణయించుకున్నట్లు మనీష్ చెప్పాడు. మరి 2 అరటిపండ్లు బయటకు ఎలా వెళ్లాయి అంటూ నాగ్ ప్రశ్నించగా మనీష్ ఆన్సర్ చెప్పలేకపోయాడు. 

వెంటనే అందుకున్న రీతు ఆ బనానాస్ రాముకు ఇచ్చామని చెప్పగా... శ్రష్టికి ఎందుకు ఇవ్వలేదు అంటూ నాగ్ ప్రశ్నించాడు. 'ఈ రూల్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు?.' అంటూ సీరియస్ అయిన నాగ్.. 'మతిమరుపునకు ఏమైనా మందుంటే వేసుకోండి' అంటూ క్లాస్ పీకారు. ఇంతలో టెనెంట్స్ ఫ్రూట్స్ తింటున్న ఓ ఫన్ వీడియోను ప్లే చేశారు నాగ్. దీంతో హౌస్‌లో నవ్వులు పూశాయి.

'మిరాయ్' టీం సర్ ప్రైజ్

ఇంతలో 'మిరాయ్' మూవీ టీం హౌస్ మేట్స్‌కు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. హీరో తేజ సజ్జా, హీరోయిన్ రితికా నాయక్ హౌస్ మేట్స్‌తో మాట్లాడి సందడి చేశారు. తన మదర్ మీకు బిగ్ ఫ్యాన్ అంటూ నాగార్జునకు చెప్పారు రితికా. ఇక ఓనర్స్, టెనెంట్స్ మధ్య గేమ్ పెట్టగా దానికి జడ్జెస్‌గా వ్యవహరించారు తేజ, రితికా. ఆద్యంతం ఫన్‌తో గేమ్ సాగగా... డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు.

టైం ఫర్ ఎలిమినేషన్

ఇక హౌస్‌లో టైం ఫర్ ఫస్ట్ ఎలిమినేషన్ అంటూ నాగ్ అనౌన్స్ చేయగానే ఒక్కొక్కరి ముఖాలు మాడిపోయాయి. రెడ్ కలర్ షాంపూ బయటకు వస్తే అన్ సేఫ్, గ్రీన్ వస్తే సేఫ్ అంటూ నాగ్ చెప్పడంతో ఆ టాస్క్ చేసే పనిలో పడ్డారు. మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.