Bigg Boss 9 Finale Event Chief Guest Finalist Prize Details : ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు. ఒకటే చర్చ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ ఎవరు? ఈసారి కామనరే విన్నర్ అవుతారని అంతా అనుకుంటున్నారు. ఆదివారం రాత్రి బిగ్ బాస్ 9 విన్నర్‌ను హౌస్ట్ నాగార్జున అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు. 22 మంది కంటెస్టెంట్స్ దాదాపు 105 రోజులు హౌస్‌లో ఉండాలని కష్టపడగా ఫైనల్‌గా టాప్ 5 మెంబర్స్ నిలిచారు. వీరిలో ఒకరు విన్నర్‌గా నిలవనున్నారు.

Continues below advertisement

టాప్ 5 ఎవరంటే?

ఎన్నో గేమ్స్, ట్విస్టులు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, వాదనలు, ప్రతి వాదనలు, నవ్వులు, ఆనంద క్షణాలు, గుర్తుండిపోయే జ్ఞాపకాలు, టఫ్ టాస్కులు... ఇలా బిగ్ బాస్ పెట్టిన పరీక్షలన్నింటినీ నెగ్గుకుని టాప్ 5లో ఐదుగురు నిలిచారు. వారు తనూజ, డెమోన్ పవన్, కల్యాణ్ పడాల, సంజనా, ఇమ్మాన్యుయెల్. వీరిలో ఒక్కరినే ట్రోఫీ వరిస్తుంది. ఒకవేళ కామనర్ విన్నర్‌గా ఎంపికైతే అది రికార్డే అనే చెప్పాలి.

Continues below advertisement

ఎన్నో వేల మందిలో స్క్రూటినీ అయి చివరకు 'అగ్ని పరీక్ష'ను ఎదుర్కొని ఫైనల్‍‌గా టాప్ 15 మెంబర్స్‌లో ఒకడిగా నిలిచి జడ్జెస్ మనసు మెప్పించి... పరీక్షల్లో నెగ్గి చివరకు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టారు. టాప్ 5లో కామనర్ గెలిస్తే సూపర్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

విన్నర్ ఎవరంటే?

గత సీజన్స్ కంటే ఈసారి ఎక్కువగా ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. టాప్ 5లో ఎవరికి వారే తమ ఆటతీరుతో హౌస్‌లో తగ్గేదేలే అనేలా శ్రమించారు. అయితే, వికీపీడియా మాత్రం ముందుగానే విన్నర్‌ను అనౌన్స్ చేసేసింది. ఓటింగ్ ప్రకారం కల్యాణ్, తనూజలో ఒకరు విన్ అవుతారని బజ్ వినిపిస్తుండగా... విన్నర్‌గా తనూజ నిలిచిందని... రన్నర్‌గా కల్యాణ్ నిలిచారంటూ అప్డేట్ చేసింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వకుండానే ఇలా అప్డేట్ చేయడంపై ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియా బజ్ ప్రకారం తొలుత సంజన, ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్, డిమోన్ పవన్ ఎలిమినేట్ అవుతారని... ఫైనల్‌గా తనూజ, కల్యాణ్‌ల్లో ఒకరిని విన్నర్‌గా నాగ్ అనౌన్స్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.

Also Read : ఓటీటీలోకి కీర్తి సురేష్ 'రివాల్వర్ రీటా' - ఎప్పటి నుంచి ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?

ముఖ్య అతిథిగా మెగాస్టార్

బిగ్ బాస్ సీజన్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తారని తెలుస్తోంది. గతంలోనూ ఆయన ఫినాలేకు గెస్ట్‌గా హాజరయ్యారు. ఈసారి కూడా ఆయనే రానున్నట్లు సమాచారం. అలాగే, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా మెగాస్టార్‌తో కలిసి రానున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోతోన్న 'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.

ప్రైజ్ మనీ ఎంతంటే?

బిగ్ బాస్ ఫైనల్‌లో విన్నర్‌కు ట్రోఫీతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతిని కూడా ఇస్తారు. గతంలో కొన్ని ఎపిసోడ్స్‌లో హోస్ట్ నాగార్జున కొన్ని ఆఫర్స్ ఇవ్వడం లాంటివి జరిగాయి. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

ఎంతకు, ఎందులో చూడొచ్చంటే?

బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ ఆదివారం రాత్రి 7 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది. అలాగే, ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్‌లోనూ స్ట్రీమింగ్ కానుంది.