Bigg Boss 9 Telugu Task War Double Out Promo : బిగ్‌బాస్ టాప్ 5 కోసం గేమ్స్ పెడుతూ.. అందరికి గొడవలు పెడుతున్నాడు. ఇప్పటికే ఫైనలిస్ట్ అయిన కళ్యాణ్ ఈ గొడవలకు దూరంగా ఉన్నాడు కానీ.. మిగిలిన వాళ్లంతా టాప్ 5 కోసం కష్టపడుతున్నారు. నామినేషన్స్‌ని తప్పించుకుని.. టాప్ 5కి వెళ్లాలని చూస్తున్నారు. దానిలో భాగంగా పలు దశల్లో బిగ్‌బాస్ గేమ్స్ పెడుతున్నారు. వాటిలో వీలైనన్ని గొడవలు జరిగేలా ప్లాన్ చేశాడు. నిన్న అందరూ అనుకుని ఒకరిని తప్పించాలని చెప్పిన బిగ్‌బాస్.. ఇప్పుడు ఇద్దరిని తీసేయాలంటూ చెప్పి.. అందరికీ షాక్ ఇచ్చాడు. దానికి సంబంధించిన ప్రోమో హైలెట్స్ చూసేద్దాం.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో హైలెట్స్..
నామినేషన్స్ నుంచి బయటపడి.. ఫైనలిస్ట్ అవ్వాలంటే మరో ట్విస్ ఉందంటూ బిగ్‌బాస్ చెప్పడంతో ప్రోమో మొదలైంది. ఈసారి ఒక్కరు కాదు ఇద్దరినీ తర్వాత జరిగే గేమ్స్‌లో పాల్గొనకుండా చేయాలంటూ ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఇంటి సభ్యులంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చి.. అది చెప్పాలంటూ బిగ్‌బాస్ సూచించాడు. దీంతో గొడవలు స్టార్ట్ అయ్యాయి. తనూజ, ఇమ్మూకి.. పవన్, సంజనికి గట్టిగానే ఆర్గ్యూమెంట్స్ అయ్యాయి.
భరణి, తనూజ దగ్గరికి వెళ్లి.. ఇమ్మూ.. ప్లీజ్ అర్థం చేసుకోండి. నిన్న ఓటు వేశారు. ఇప్పుడు కూడా అదే రీజన్ చెప్పి నన్ను తీసేయకండి అంటూ అడిగాడు. దానికి తనూజ.. మేము మిడిల్లో ఉన్నాము. మీరు పాయింట్స్ ఎక్కువలో ఉన్నారు అనేసరికి.. ఇంక ఇమ్మూకి అర్థమై.. అక్కడినుంచి వెళ్లిపోయాడు. లీస్ట్ స్కోర్‌లో ఉండేవాళ్లని ఎందుకు ఎంక్రేజ్ చేస్తాము రా.. బాగా ఆడేవాళ్లని కదా ఎంక్రేజ్ చేయాలి అంటూ కళ్యాణ్‌తో చెప్పుకున్నాడు ఇమ్మాన్యుయేల్. తనూజ మాత్రం నాకు ఫస్ట్ రెండు హై స్కోర్స్‌ని తీసేయాలనుకుంటున్నాను అని చెప్తుంది. ఆ రెండు ఇమ్ము, పవన్.
ఇమ్మూని హర్ట్ చేసిన తనూజ
ప్రతిదానికి మీరు ముందుకు ఉంటామంటే ఒప్పుకోమని చెప్తుంది. దాంతో పవన్ రెండూ ముందు ఉన్నవాళ్లే ఎందుకు.. ఫస్ట్లో ఒకరు, లాస్ట్‌లో ఒకరిని తీయండి అని చెప్తాడు. లాస్ట్‌లో ఉన్నవాళ్లు ఏమి చేశారురా పాపం అంటూ అడిగింది తనూజ. మీరు గెలిస్తే నువ్వు అడగవా.. నువ్వు కూర్చుంటావా అని కౌంటర్ ఇచ్చాడు పవన్. ఈ క్రమంలోనే సంజన, డిమోన్ పవన్కి కూడా గొడవ అయింది. నీకు నేను, ఇమ్మూ కలిసి 50,000 ఇచ్చాము. కానీ నువ్వు మా పేరే చెప్తున్నావంటూ ఇది నువ్వు అంటూ గట్టిగా ఇచ్చాడు పవన్. తర్వాత తనూజ పవన్‌తో ఇమ్మాన్యుయేల్ ఒక్కడే కష్టపడి వచ్చాడా అంటూ సీరియస్‌గా మాట్లాడేసరికి ఇమ్మూ హర్ట్ అయినట్లు కనిపించింది. దీంతో ప్రోమో ముగిసింది.