Bigg Boss 9 Telugu Emmanuel vs Bharani Promo : బిగ్‌బాస్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత గత రెండు వారాల నుంచి భరణి.. తనలోని కోపాన్ని కూడా చూపిస్తున్నాడు. మొదట్లో సౌమ్యంగా, ప్రశాంతంగా ఉన్న భరణి.. తన గురువు సలహాతో కోపాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఒక్కోసారి అవసరం లేని సమయాల్లో.. విషయం సరిగ్గా తెలుసుకోకుండా సీరియస్ అవుతున్నాడు. దానికి సబంధించిన ప్రోమోనే బిగ్‌బాస్ తాజాగా విడుదల చేేశాడు.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో..
బిగ్‌బాస్‌లో Ultimate Clash పేరుతో కొత్త ప్రోమో రిలీజ్ చేశారు. నిన్న డబ్బులు ఇవ్వడం.. వాటిని పాయింట్స్‌గా పెట్టి.. గేమ్స్ ఆడించడం చేస్తున్నాడు. లీడర్ బోర్డ్‌లో పాయింట్స్ పెంచుకోవడానికి.. పోటీదారులకు ఇస్తోన్న రెండో యుద్ధం వీల్ బారో. దీనిలో భాగంగా.. వీల్ ఉన్న స్లైడ్‌పై.. 5 పాట్స్ పెట్టుకుని.. కిందకి పడకుండా తీసుకెళ్లాలి. అవి కిందపడితే.. మళ్లీ వెనక్కి వెళ్లి వాటిని పెట్టుకోవాల్సి ఉంది. ఈ టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్ గెలిచాడు. దీని తర్వాతే అసలైన గొడవ పెట్టాడు బిగ్‌బాస్.
ఈ యుద్ధంలో తర్వాతి టాస్క్ ఆడడానికి.. మీలో నుంచి ఒకరిని తప్పించాలంటూ ట్విస్ట్ పెట్టాడు. తర్వాత జరిగే యుద్ధంలో వాళ్లు పాల్గొనలేరు. వారికి లభించే స్కోరు 0. అని చెప్పగా.. ఇమ్మాన్యుయేల్, పవన్, సంజన కలిసి మాట్లాడుకుంటారు. నువ్వు నా పేరు చెప్పకుండా ఎవరి పేరు చెప్పినా.. నేను అవుట్ అయిపోతాను. ఇలా అంటే సంజన.. తనూజ నీ పేరే చెప్పమని ప్రెజర్ చేస్తుంది అంటూ చెప్తుంది. అదే మమ్మీ నా పేరు చెప్పకపోతే వెళ్లేది నేనే.. పైగా నా పాయింట్స్ 0 అయిపోతాయి.
భరణి vs తనూజ
తనూజ వెళ్లి ఇమ్మూతో.. సంజనతో నువ్వు భరణిని తీసేయమని చెప్పావా అని అడుగుతుంది. దాంతో ఇమ్మూ.. నేను భరణిని తీసేయమని చెప్పనా అంటూ అడిగేసరికి... అది విన్న భరణి సీరియస్‌గా రియాక్ట్ అయ్యాడు. అగ్రెసివ్‌గా ఇమ్మూ దగ్గరికి వెళ్తుంటే నేను మిమ్మల్ని అనలేదు అన్న. నేను నిన్ను టార్గెట్ చేయట్లేదు అన్న.. నేను భరణి అన్న పేరు తీసుకువచ్చానా? లేదు. అంటూ సర్ది చెప్పబోయాడు కానీ.. గొడవ గట్టిగానే అయినట్లు చూపించారు. లైవ్ ప్రకారం సంజన, తనూజకి కూడా గట్టిగానే గొడవ జరిగేటట్లు ఉంది.