Bigg Boss 9 Week Nominations Promo : బిగ్​బాస్​లో ఫ్యామిలీ వీక్ ముగిసిన తర్వాత నామినేషన్స్ మొదలయ్యాయి. ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన అవుట్​పుట్​తో కంటెస్టెంట్లు గేమ్ ప్లాన్ ఛేంజ్ చేసేటట్టే కనిపిస్తున్నారు. అయితే వాళ్లకి ఆ ప్లాన్ ఇవ్వడం ఎందుకనీ బిగ్​బాస్ ఓ ట్విస్ట్​తో వచ్చేశాడు. సోమవారం నామినేషన్స్ జరుగుతాయని అందరికీ తెలుసు. అయితే ఈ వారం నామినేషన్స్ రెండు దశల్లో ఉంటాయని.. మునుపెన్నడూ లేనివిధంగా ఉంటుందని చెప్తూ.. దానికి సంబంధించిన మొదటి ప్రోమో విడుదల చేసింది స్టార్ మా. 

బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమో.. 

ఈసారి నామినేషన్స్ బాగా ఆసక్తిగా, భిన్నంగా ఉండబోతున్నాయని బిగ్​బాస్ చెప్పడంతో ప్రోమో మొదలైంది. ఈ నామినేషన్స్ రెండు దశల్లో జరగబోతుంది. ఒకరి తర్వాత ఒకరు డెన్​కి వచ్చి.. వారి గురించి చెప్పలేకపోయిన పాయింట్స్​ను క్లియర్​గా చెప్పి.. నామినేట్ చేయాలని చెప్పారు. వారితో ఉన్న ఇబ్బందిని స్పష్టంగా బయట చెప్పి.. వారి పేరు కార్డ్​పై రాసి బాక్స్​లో వేయాలని సూచించారు. ఈ మొదటి దశను ప్రైవేట్ నామినేషన్​గా చెప్పాడు బిగ్​బాస్. ఇది ప్లేన్​గా సాగిపోతుంది కాబట్టి దీనికి రెండో దశ పెట్టాడు. 

ముందుగా వచ్చిన ఇమ్మాన్యుయేల్.. తన నామినేషన్ డిమోన్ పవన్ అని చెప్పాడు. కంటెండర్ అయిన తర్వాత.. ఎక్కడో.. ఎవరి గురించో ఆలోచించి.. కెప్టెన్సీ దూరం చేసుకున్నాడని అనిపించిందని చెప్పాడు. కళ్యాణ్ వచ్చి సుమన్ శెట్టిని నామినేట్ చేశాడు. కెప్టెన్సీ నుంచి ఎవరైతే గివ్ అప్ ఇచ్చేస్తున్నారో.. వాళ్లని వదిలేసి.. నేను కెప్టెన్సీలో ఉండాలనుకుంటున్నాను.. ఒకసారి ఆపండి అంటూ అని చెప్పినా తను వినలేదు. అతని మైండ్ సెట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు బిగ్​బాస్ అని చెప్పాడు. డిమోన్ వచ్చి కళ్యాణ్​ని నామినేట్ చేశాడు. సుమన్ శెట్టి సంజనను నామినేట్ చేశాడు. అయితే సంజన, తనూజ ఎవిరిని నామినేట్ చేశారనేది ప్రోమోలో చూపించలేదు. 

ఆ ముగ్గురి చుట్టే తిరుగుతోన్న నామినేషన్స్.. 

భరణి వచ్చి తనూజను నామినేట్ చేశాడు. నా గురించి డిస్కషన్ రావద్దు అంటే తనూజనే మళ్లీ తన టాపిక్ తీసి.. పెద్ద స్టేట్​మెంట్ ఇచ్చిందని చెప్పాడు. అలాగే దివ్య, తనూజ కూడా ఇద్దరూ చైల్డిష్​గానే ఉన్నారంటూ చెప్పాడు. దివ్య వచ్చి భరణి తన కోసం స్టాండ్ తీసుకోలేదని నామినేట్ చేసింది. అయితే తనూజ దివ్యను నామినేట్ చేసినట్లు చూపించలేదు కానీ.. లైవ్​లో వీరి ఇద్దరి మధ్య గట్టిగానే గొడవ జరిగింది. మోస్టీ తనూజ దివ్యను నామినేట్ చేసి ఉండొచ్చని తెలుస్తుంది. ఏది ఏమైనా వీరి చుట్టూ ఉన్న గొడవ తగ్గకపోగా పెరుగుతూనే ఉంది. మరి ఈ వారం నామినేషన్స్​లో రెండో దశ ఏంటో.. రీతూ ఎవరిని నామినేట్ చేసిందో తెలియాలంటే లైవ్ చూడాలి. లేదా ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాలి.