Bigg Boss 9 Bharani Daughter Promo : బిగ్​బాస్ ఫ్యామిలీ వీక్​ మూడోరోజు కొనసాగుతుంది. సీజన్ 9 తెలుగు 74వ రోజులో ఉదయం భరణి కూతురి ప్రోమో చూపించగా.. ఇప్పుడు రీతూ ప్రోమోని స్టార్ మా విడుదల చేసింది. ఇంట్లోకి వచ్చిన రీతూ తల్లి ఏమి చేసింది? రీతుని కొట్టాలని ఆమె అమ్మ ఎందుకు చూసిందో.. ప్రోమో హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

Continues below advertisement

బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమో హెలైట్స్..

బిగ్​బాస్ ఇంట్లోకి రీతూ తల్లి వచ్చారు. అయితే ఆమె అందరిలా కాకుండా కాసేపు బిగ్​బాస్లా కంటెస్టెంట్లతో ఆడుకుంది. కిచెన్ రీతూ, కళ్యాణ్​తో మాట్లాడుతుండగా.. పవన్ కళ్యాణ్ ఫ్రీజ్ అంటూ ఆర్డర్ వేసింది. తనూజ అర్థం చేసుకుని.. హేయ్ అనేసరికి.. తనూజ్ ఫ్రీజ్ అంటూ చెప్పింది. రీతూ గుర్తుపట్టి మమ్మీ అంటూ ఏడ్చేసింది. అప్పుడు ఆమె ఇంట్లో అందరికి ఫాస్ట్ ఫారార్డ్ అని, ఇమ్మూకి ఫ్రీజ్ ఇలా ఇంట్లో అందరికీ ఫ్రీజ్ అని చెప్పి రీతూ తల్లి ఇంట్లోకి వచ్చింది. 

Continues below advertisement

ఎమోషనల్ అయిన రీతూ.. 

రీతూ తల్లిని చూడగానే ఎమోషనల్​గానే ఏడుస్తూ పరుగెత్తుకుంటూ వచ్చి ఏడ్చేసింది. ఇద్దరూ ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. రీతూ ఏడుస్తుంటే.. నేను నీకు చెప్పింది ఏంటి.. నువ్వు వచ్చి చేసేది ఏంటి అంటూ ఫన్నీగా మాట్లాడింది. తర్వాత చపాతీ కర్ర ఇవ్వండి తినని కొట్టాలి అంటూ కర్ర తెచ్చుకునేసరికి.. రీతూ ఏడ్చేసింది. దాంతో వాళ్ల అమ్మకూడా ఆమెను హగ్ చేసుకుని ఏడ్చేసింది. ప్రోమో మాత్రం చాలా ఎమోషనల్​గా సాగింది. ఆడియన్స్ కూడా రీతూ మదర్​ని చూసి హ్యాపీగా ఫీల్​ అవుతూ కామెంట్స్ పెడుతున్నారు. సింగిల్ మదర్ అయి ఉండి కూడా కష్టపడి పెంచారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

పవన్​ గురించి తిడుతారా?

అయితే మొన్న ఇమ్మాన్యుయేల్ ఫన్నీగా మీ మమ్మీ వస్తే నిన్ను తిడతారు అంటూ చెప్పారు. అయితే బిగ్​బాస్ హోజ్​లో ఈ సీజన్​లో పవన్, రీతూ మధ్య ట్రాక్ బాగా వర్క్ అయింది. పైగా పవన్ మమ్మీ కూడా రీతూని ఏమనలేదు. అంతేకాకుండా ఆమెను హగ్ చేసుకుని లడ్డూ కూడా తినిపించారు. మరి రీతూ మదర్ పవన్​ని దగ్గరికి తీసుకుంటారా? లేదా అనేది పూర్తి ఎపిసోడ్​లో చూడాల్సిందే. ఆ సస్పెన్స్ క్రియేట్ చేసేందుకే బిగ్​బాస్ ఈ ప్రోమోలో ఎక్కువ డైలాగ్స్ లేకుండా.. ఎమోషనల్​గా కట్ చేశారు. మరి కళ్యాణ్ ఎపిసోడ్​లో ఎంత ఎమోషన్ ఉంటుందో.. ఊహించడం కూడా కష్టమే మరి.