Bigg Boss 9 Telugu - Suman & Bharani Dance Task: బిగ్ బాస్ ఇంట్లో ప్రస్తుతం ఓ రాజ్యం, రాజు, రాణులు, కమాండర్స్, ప్రజలు అంటూ ఓ కొత్త టాస్క్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో కళ్యాణ్, రీతూ, దివ్య అధికారంలో ఉండి.. ప్రజలైన సుమన్, భరణి, ఇమ్ముని ఆడుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. రాజులు ఏం చెబితే అది చేయడమే ప్రజల పని అంటూ బిగ్ బాస్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుమన్, భరణి, ఇమ్ముల్ని వింత వింత టాస్కులతో ఆడేసుకుంటున్నారు.
చిరు నవ్వు అంటూ సుమన్‌కు వీణ స్టెప్పులు, భరణికి అమ్మడు లెట్స్ డు కుమ్ముడు స్టెప్పులు, ఇమ్ముకి ముఠామేస్త్రి స్టెప్పుల్ని ఇచ్చారు. ఇది కాకుండా కమాండర్స్, ప్రజలకి మరో అవకాశం ఇచ్చాడు. ప్రజలు కమాండర్స్‌గా మారేందుకు, కమాండర్స్ తమ స్థానాన్ని కాపాడుకునేందుకు నేటి ఎపిసోడ్‌లో మరో టాస్క్ ఇచ్చారు. ఇక ఈ నిలబెట్టు, పడగొట్టు, గెలుపొందు టాస్కులో కమాండర్స్, ప్రజలు కలిసి పాల్గొన్నట్టుగా కనిపిస్తోంది. మరి ఈ టాస్కులో ఎవరు గెలుస్తారు? ఎవరి స్థానం మారుతుందో చూడాలి.
Also Read: బిగ్ బాస్ డే 65 రివ్యూ... సుమన్ శెట్టికి అన్యాయం... ఇమ్మూ కూరగాయల కథ... కళ్యాణ్ vs తనూజా గొడవ
నిన్నటి టాస్కులో కమాండర్స్ నుంచి సంజనా చివరి స్థానంలోకి వచ్చి.. సుమన్‌తో పోటీ పడాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. సుమన్, సంజనా ఆడిన టవర్ టాస్కు పెద్ద పంచాయితీగా మారింది. సంచాలక్ అయిన కళ్యాణ్ చెప్పిన తీర్పుని తనూజ, దివ్య తప్పుబట్టారు. కానీ సంచాలక్ నిర్ణయమే తుది నిర్ణయం కాబట్టి.. కళ్యాణ్ తీర్పుతో సంజనా గెలిచింది. సుమన్ ఓడిపోయాడు. అలా సంజనా తన కమాండర్ స్థానాన్ని కాపాడుకున్నట్టు అయిన సంగతి తెలిసిందే.
Also Read: బిగ్ బాస్ డే 64 రివ్యూ... నామినేషన్లలో బుర్రబద్దలయ్యే షాక్... ఆ ఒక్కడు తప్ప అందరికీ డేంజరే
ఈ వారం ఇంటి సభ్యులంతా నామినేషన్‌లో ఉన్నారన్న సంగతి తెలిసిందే. కెప్టెన్ అయిన ఇమాన్యుయేల్‌కు ఇంటి సభ్యుల సహకారం రావడంతో నామినేషన్స్ నుంచి బయట పడ్డాడు. మరి ఈ సారి ఇంటి నుంచి బయటకు ఎవరు వెళ్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికి అయితే కళ్యాణ్, తనూజ, గౌరవ్ వంటి వారు ఓటింగ్‌లో టాప్ స్థానంలో ఉన్నట్టుగా సమాచారం. ఇక ఇది బిగ్ బాస్ కాబట్టి చివరి వరకు ఏం జరుగుతుందో చెప్పలేం.