Bigg Boss 9 Captaincy Task Promo : బిగ్‌బాస్‌లో కెప్టెన్సీ కంటెండర్స్ కోసం జరిగిన టాస్క్ చివరి దశకు చేరుకుంది. ఈ టాస్క్‌కు ఆరుగురు కంటెండర్లు అయ్యారు. సీక్రెట్ టాస్క్ గెలిచి దివ్య, సుమన్ శెట్టి, రీతూ కంటెండర్లు అవ్వగా.. మిగిలిన వాళ్లు టాస్క్‌ల్లో నెగ్గి కంటెండర్లు అయ్యారు. అయితే ఇప్పుడు వీరిలో కెప్టెన్ అవుతారని తేల్చేందుకు ఇంట్రెస్టింగ్ టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా సాయికి, దివ్యకి, రీతూకి మధ్య గొడవ జరిగింది. మరి వీరిలో ఎవరు ఉన్నారు? ప్రోమో హైలెట్స్ ఏంటో చూసేద్దాం.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో హైలెట్స్..
బిగ్‌బాస్ ప్రోమో మొదలైంది. కెప్టెన్సీ కోసం పోటీదారులకు ఇస్నోన్న టాస్క్ అంటూ ప్రోమో మొదలైంది. ఈ టాస్క్ పేరు వే టూ కెప్టెన్సీ అని చెప్పాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉంచిన ట్రైన్స్‌తో టాస్క్ ఉంటుందని చెప్పాడు బిగ్‌బాస్. బజర్ మోగిన తర్వాత ఏదైనా ఓ ట్రైన్‌కి డ్రైవర్ అవ్వాల్సి ఉంటుందని.. ఆ తర్వాత తన ట్రైన్లో ఉన్న కంటెస్టెంట్లలో ఒకరిని కారణాలు చెప్పి తీసేయాలని బిగ్‌బాస్ చెప్పాడు. అలా తీసేసిన వారు కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించుకోవాల్సి ఉంటుందని చెప్పాడు బిగ్‌బాస్. అయితే ఇలా మొదటిసారి వెళ్లినప్పుడు రాము ఒక ట్రైన్లో డ్రైవర్‌గా, సాయి మరో ట్రైన్లో డ్రైవర్‌గా కూర్చొంటారు. అయితే రాము ట్రైన్ ఎవరూ ఎక్కలేదు.
రీతూకి చుక్కలు చూపించిన సాయి..
సాయి తన ట్రైన్లో కూర్చొన్న వారినుంచి ఒకరిని ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. దాంతో సాయి.. నేను కచ్చితంగా సేఫ్ గేమ్ ఆడట్లేదు అంటే దివ్య సరే అన్నట్లు తల చూపించింది. రీతూ నన్ను కాదు వాళ్లని చేయమంటూ సైగ చేయడం ప్రోమోలో కనిపిచింది. తీసేయ్ పర్లేదు. మంచి కంటెండర్ అని చెప్పిన వ్యక్తే నన్ను కంటెండర్ నుంచి తీసేయాలనుకుంటున్నాడంటూ సాయిని ఎమోషనల్‌గా డైవర్ట్ చేసింది దివ్య. ఈ సమయంలో సాయి నిర్ణయం చెప్పండి అంటూ బిగ్‌బాస్ అడగ్గా.. రీతూ దండం పెట్టి తన పేరు చెప్పవద్దు అంటూ సైగలు చేస్తుంది. కానీ సాయి రీతూ పేరే చెప్పేస్తాడు.
డిఫెన్స్ చేసుకున్న రీతూ.. మాట మార్చేసిన సాయి..
ఒక్క నిమిషం నన్ను ఎందుకు తీసేయాలనుకుంటున్నావో చెప్పు అంటూ రీతూ సాయిని అడుగుతుంది. నువ్వు నన్ను తీసేది కెప్టెన్సీ రేస్ నుంచి.. అది కూడా పక్కనవాళ్ల వల్ల ఇన్ఫ్లూయెన్స్ అయి అంటూ ఆర్గ్యుమెంట్ చేస్తుంది. పక్కనవాళ్లదేమి లేదు అని సాయి చెప్పగా.. నీ ట్రైన్ ఎక్కించి.. కావాలనే నన్ను దించేస్తున్నావా? ఆమెను తీసేస్తాను అని చెప్తేనే కదా నేను నీ ట్రైన్ ఎక్కింది. లేకుంటే నేను ఎందుకు ఎక్కుతాను అంటూ రీతూ అడిగింది. దాంతో దివ్య సాయిని తగులుకుంది. నేను నిన్ను సపోర్ట్ చేస్తే.. నువ్వు నన్ను నమ్మించి మోసం చేశావా అని అడుగుతుంది. మొత్తానికి దివ్యనే ట్రైన్ దిగేస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని నన్ను వద్దు అంటున్నారు. నువ్వు కూడా అదే.. వాళ్లు ఎలా సపోర్ట్ చేస్తారో చూస్తాను అనడంతో ప్రోమో ముగిసింది.