Bigg Boss 9 Captaincy Task Promo : బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగులో ఫన్నీ టాస్క్‌లు పెడుతూ అలరిస్తున్నాడు. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా సీక్రెట్ టాస్క్‌లు పెట్టి.. ఫన్ క్రియేట్ చేస్తున్నాడు. నిన్న కెప్టెన్సీలో సుమన్ శెట్టిని బిగ్‌బాస్ రెబల్‌గా మార్చాడు. అలాగే దివ్య నిఖిత కూడా తర్వాత రెబల్ అయింది. అయితే వీరిద్దరికీ కలిపి బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. దివ్యకు ఆ విషయం చెప్పి.. సుమన్‌తో కలిసి ఆ టాస్క్ ఆడాలని చెప్పాడు. అయితే ఈ టాస్క్‌లో వారిద్దరూ సక్సెస్ అయినట్టే కనిపిస్తుంది. ఎక్కడా సంబంధం లేకుండా సంజనా ఎంజాయ్ చేస్తుంది. ఇంతకీ ఏమి జరిగింది?
బిగ్‌బాస్ ప్రోమో హైలెట్స్..
బిగ్‌బాస్‌లో డే 59కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసింది స్టార్ మా. అయితే దీనికి సంబంధించిన టాస్క్ ప్రోమో నిన్న విడుదల చేయగా.. దానికి రియాక్షన్ వీడియో ఇప్పుడు పోస్ట్ చేసింది. రీతూ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి.. పాలు కనిపించట్లేదని చెప్తుంది. పాలు ఎవరో తీసేశారు అని అడుగుతుంది. భరణి ఎన్ని పోయాయి అంటే.. 8 ప్యాకెట్లు పోయాయి.. ఇంకోటి ఓపెన్ చేసి ఉంటుందని చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. దివ్యకి చెప్తుంది. కెప్టెన్ దివ్య మీలో ఎవరైనా తీశారా మిల్క్ అంటూ ఏమి తెలియనట్లు అడుగుతుంది.
ఎంజాయ్ చేస్తోన్న సంజన..
ఈ విషయం విన్న తర్వాత భరణి.. నీ పేరు రాకుండా నేను చూసుకుంటాను.. ఎక్కడపెట్టావో చెప్పు అంటూ సంజనను అడుగుతాడు. సంజన నవ్వితే.. ఏయ్ చెప్పు అంటూ అడుగుతాడు భరణి. నా స్టీరింగ్ పోయింది మీకు ఏమైనా కనిపించిందా అంటూ ఇమ్మాన్యుయేల్ కామెడీ చేస్తాడు. పాలు ప్యాకెట్లు పోయాయి అంటూ బయట ఉన్నవాళ్లకి చెప్తోంది దివ్య. దీంతో తనూజ పోవడం అంటే.. ఎవరో తీసేశారని చెప్తుంది. సుమన్ లోపలికి వస్తాడు. భరణి పోయి పోయి సుమన్ అన్న ఎన్ని పాల ప్యాకెట్లు పోయాయో అని చెప్తాడు. ఏమి ఎరుగనట్లు సుమన్ అవునా అంటాడు.
రాకింగ్ సుమన్
సుమన్ నిజమా అనగానే.. సుమన్ పాలు తాగుతున్న సీన్ పడుతుంది. మొత్తం ఇంటి సభ్యులు పాలను వెతికే పనిలో పడ్డారు. అరేయ్ టాస్క్‌లు చేసే ఓపికే లేదురా అంటే.. మళ్లీ ఇవి కూడానా అంటూ ఇమ్మూ కామెడీ చేస్తాడు. కానీ కంటెస్టెంట్లు మాత్రం ఇంట్లో పాలను చాలా సీరియస్‌గా వెతికేస్తారు. దీనిని బట్టి చూస్తే ఈ సీక్రెట్ టాస్క్‌లో సుమన్ శెట్టి, దివ్య సక్సెస్ అయినట్లే కనిపిస్తున్నారు.