Bigg Boss 9 Captaincy Task Promo : బిగ్​బాస్ సీజన్ 9 తెలుగు 9వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్​లు బాగా జరుగుతున్నాయి. అలాగే బిగ్​బాస్​ సీక్రెట్ టాస్క్​లు ఇస్తూ.. ఫన్ క్రియేట్ చేస్తున్నాడు. కొందరిని రెబల్స్ చేసి కెప్టెన్సీ కంటెండర్ అవుతారు అంటూనే.. టాస్క్​లు పెడుతూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాడు. ఈసారి టాస్క్​లో కూడా ఇమ్మూ మరోసారి సత్తాచాటాడు. మరికొత్తగా విడుదలైన ప్రోమోలో ఏముంది? హైలెట్స్ ఏంటి వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం. 

Continues below advertisement


బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమో హైలెట్స్.. 


బిగ్​బాస్ ప్రోమో మొదలవ్వగానే భరణి కెప్టెన్సీ టాస్క్​కి సంబంధించిన రూల్స్ చదువుతాడు. ఈవారం కెప్టెన్సీ కంటెండర్స్ కోసం ఆడే గేమ్ ప్రారంభమైంది. అంటే ముందుగా తనూజ చెప్పిన నమ్మలేదు కాబట్టి మళ్లీ చెప్పించాడు బిగ్​బాస్. కానీ గుర్తు పెట్టుకోండి మీ మధ్యలోనే ఒక రెబల్ ఉన్నారు అంటూ చెప్పాడు. వెంటనే డెన్​లో ఫోన్ వస్తుంది. దానిని సుమన్ లిఫ్ట్ చేస్తాడు. ఈ టాస్క్​లో ఓ రెబల్ ఉన్నాడని తెలుసుకదా అంటే అవును అని చెప్తాడు సుమన్. అది ఎవరో కాదు నువ్వే అంటూ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్​బాస్. అలాగే సీక్రెట్ టాస్క్​ని పూర్తి చేసిన ప్రతీసారి ఒకరిని గేమ్ నుంచి ఎలిమినేట్ చేసే ఆప్షన్ దొరుకుతుందని చెప్తాడు బిగ్​బాస్. దానిలో భాగంగా కొన్ని టాస్క్​లు ఇచ్చాడు. 


కెప్టెన్సీ గేమ్.. 


కెప్టెన్సీ టాస్క్​కి సంబంధించి పోటి పడుతున్న కంటెస్టెంట్లకు బిగ్​బాస్ కొన్ని రూల్స్ ఇస్తాడు. దీనిలో భాగంగా మొదటి ఛాలెంజ్ ఇచ్చాడు. అది సీసా ఛాలెంజ్. జారుడు బల్ల లాంటి బల్లపై ఓ చివర నొక్కిపట్టి మూడు డంబుల్స్ పెట్టాలి. దాని తర్వాత మరొక వ్యక్తి వచ్చి అవి పడకుండా మరోమూడు డంబుల్స్ బ్యాలెన్స్ చేయాలని చెప్పాడు బిగ్​బాస్. అలా పెట్టిన తర్వాత 5 సెకన్లు అలాగే అన్ని ఉంచి సీసా కిందకి తాకకుండా చూసుకోవాలి. అయితే ఈ గేమ్​లో రాము, ఇమ్మూ ఆరెంజ్ టీమ్.. గౌరవ్, పవన్ బ్లూ టీమ్.. దివ్య, సాయి పింక్​ టీమ్​లో గేమ్ ఆడుతున్నారు. 


ఇమ్మూ పవర్.. 


రాము మొదటి మూడు బ్యాలెన్స్ చేసి ఇమ్మూకి ఇవ్వగా.. ఇమ్మూ దాదాపు అన్ని పెట్టినట్లు ప్రోమోలో కనిపిస్తుంది. బేసికల్​గా మొదటి మూడు పెట్టడం కాస్త ఈజీ అయినా.. దాని తర్వాత మూడు బ్యాలెన్స్ చేస్తూ మొత్తం ఆరు ఒకదానిపై ఒకటి పెట్టాలంటే కష్టంతో కూడిన పనే. అయితే ఇమ్మూ దానిని పర్​ఫెక్ట్గా చేశాడు. ఇమ్మూ ఎలాంటి గేమ్​ని అయినా అలవోకగా ఆడేస్తాడు. కష్టపడతాడు. గెలుస్తాడు. అలాగే ఈసారి కూడా గెలిచాడు. మరి ఈ టాస్క్​లో ఎవరు విన్ అయ్యారో పూర్తి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. లైవ్ ప్రకారం ఇమ్మూ టీమ్​నే గెలిచింది.