Bigg Boss Captaincy Contender Promo : బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు డే 46 ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. కెప్టెన్సీ కంటెండర్స్ కోసం.. దొంగల థీమ్‌తో టాస్క్‌లు నిర్వహిస్తున్నాడు. దానిలో భాగంగా ఈ టాస్క్‌లు మూడో దశకు చేరుకున్నాయి. గొడవలు, ఎంటర్టైన్మెంట్తో కలిసి సంజన, దివ్వెల మాధురి గ్రూప్‌లు గేమ్స్ ఆడుతున్నారు. ఎవరి స్ట్రాటజీలు వాళ్లు ప్లే చేసుకుంటూ.. ముందుకు వెళ్తున్నారు. మరి తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఏమి హైలెట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో..
బిగ్‌బాస్ డే 46 మొదటి ప్రోమోలో భాగంగా ముందు ఫన్నీ టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. ఎవరైనా బిగ్‌బాస్ అంటే.. అప్పుడు కోడిలాగా కొక్కొరొక్కో అరవాలి అంటూ ఫన్నీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. బ్లూ టీమ్ వాళ్లు బిగ్‌బాస్ అంటే రెడ్ టీమ్ సభ్యులు కొక్కొరొక్కో అని అరవాల్సి ఉంటుందని చెప్పాడు. దీంతో సంజనను ఇది ఎవరికి ఇద్దామంటూ అడిగాడు. అఫ్కోర్స్ ఇమ్మాన్యూయేల్ బిగ్‌బాస్ అంటూ చెప్పింది సంజన. దీంతో ఇమ్మాన్యూయేల్ ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పాడు బిగ్‌బాస్. కాసేపు బ్లూ టీమ్ సభ్యులు బిగ్‌బాస్ అంటూ అరవగా.. ఇమ్మూ.. కోడిలాగా అరిచాడు. దీనిని రెండు టీమ్ సభ్యులు బాగా ఎంజాయ్ చేశారు.
బురదలో టాస్క్...
ఫన్నీ టాస్క్ తర్వాత రెడ్, బ్లూ టీమ్ సభ్యులకు బురదలో ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఏ గ్యాంగ్‌స్టార్ అయినా ఆధిపత్యం చలాయించడానికి.. ఎక్కువ బలం ఉండడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు. ఇప్పుడు ఆ బలాన్ని మీరు చూపించి డబ్బు సంపాదించడానికి మీకు ఇస్తోన్న మూడో టాస్క్ జెండాలే మీ అజెండా అని చెప్పాడు. దీనిలో భాగంగా బురదతో కూడిన ఓ టబ్‌కి ఓ మూల బ్లూ జెండాలు, ఎల్లో జెండాలు ఉంటాయి. అలాగే మరో మూల రెడ్ జెండాలు, ఎల్లో జెండాలు ఉంటాయి. అయితే ఏ టీమ్ వాళ్లు వారి కలర్ జెండా టబ్‌లో వేసుకుంటే ఒక పాయింట్.. ఎల్లో కలర్ జెండా వేస్తే రెండు పాయింట్లు వస్తాయని చెప్పాడు. నలుగురికి లాక్ చేసి.. మధ్యలో ఉంటే.. వారు తమ బలాన్ని ఉపయోగిస్తూ.. మిగిలిన వాళ్లతో సహా ముందుకు వెళ్లి జెండాలు కలెక్ట్ చేసి బాక్స్‌లో వేయాల్సి ఉంది. అయితే ప్రోమో ప్రకారం బ్లూ టీమ్ ఫ్లాగ్స్ బాక్స్‌లో వేసినట్లు కనిపిస్తుంది. మరి ఈ టాస్క్ ఎలా గడిచిందో.. ఎవరు గెలిచారో ఎపిసోడ్ వచ్చాక తెలుస్తుంది.